Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi Vs Balakrishna: చిరంజీవి కొడుకు టాప్ హీరో అయ్యాడు.. మరి బాలయ్య కొడుకు ఏం...

Chiranjeevi Vs Balakrishna: చిరంజీవి కొడుకు టాప్ హీరో అయ్యాడు.. మరి బాలయ్య కొడుకు ఏం అవుతాడు…

Chiranjeevi Vs Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి – బాలయ్య బాబు మధ్య విపరీతమైన పోటీ ఉన్న విషయం మనకు తెలిసిందే. గత 50 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్నప్పటికి ఎవరు ఎవరి పైన పై సాధిస్తారనే విషయంలో వీరిద్దరి మధ్య ప్రతిసారి పోటీ జరుగుతూనే ఉంది. కొన్ని సందర్భాల్లో చిరంజీవి బాలయ్య బాబు ను డామినేట్ చేస్తే మరికొన్ని సిచువేషన్ లలో బాలయ్య చిరంజీవి ని డామినేట్ చేస్తూ […]

Chiranjeevi Vs Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి – బాలయ్య బాబు మధ్య విపరీతమైన పోటీ ఉన్న విషయం మనకు తెలిసిందే. గత 50 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్నప్పటికి ఎవరు ఎవరి పైన పై సాధిస్తారనే విషయంలో వీరిద్దరి మధ్య ప్రతిసారి పోటీ జరుగుతూనే ఉంది. కొన్ని సందర్భాల్లో చిరంజీవి బాలయ్య బాబు ను డామినేట్ చేస్తే మరికొన్ని సిచువేషన్ లలో బాలయ్య చిరంజీవి ని డామినేట్ చేస్తూ వచ్చాడు. ఫైనల్ గా చిరంజీవి బాలయ్యను ఎక్కువగా డామినేట్ చేస్తూ వరుస సక్సెస్ లను సాధించడం వల్ల తను మెగాస్టార్ గా మారాడు. గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా వెలుగొందుతుందటం విశేషం… ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది.

చిరంజీవి తనయుడు అయిన రామ్ చరణ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మెగా పవర్ స్టార్ గా రాణిస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రతి సినిమా విషయంలో తన వైవిధ్యాన్ని చూపిస్తూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాడు. ఇక బాలయ్య కొడుకు అయిన మోక్షజ్ఞ ఇప్పటికే 30 సంవత్సరాల పైబడిన వయసు వచ్చినప్పటికి ఇంకా కూడా ఇండస్ట్రీకి రాకపోవడంతో ఇక బాలయ్య బాబు కొడుకు ఇండస్ట్రీకి రావడం అసాధ్యమని చాలామంది అనుకుంటున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే మోక్షజ్ఞ ఎందుకని ఇంత నిర్లక్ష్యం చేస్తున్నాడు. సినిమాలంటే ఇంట్రెస్ట్ లేకపోతే సినిమా ఇండస్ట్రీకి రానని చెప్పొచ్చు కదా అని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఫైనల్ గా చిరంజీవి తన కొడుకును మెగా పవర్ స్టార్ గా మార్చితే బాలయ్య బాబు మాత్రం తన కొడుకుని ఏం చేయబోతున్నాడు అనే విషయంలో ఇంకా క్లారిటి రావడం లేదంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.

ఇక మొత్తానికైతే నందమూరి అభిమానులు సైతం బాలయ్య బాబు కొడుకు ఇండస్ట్రీకి వస్తే అతన్ని ఆదరించాలని అతని సినిమాలు చూడడానికి వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ అతను మాత్రం సినిమా ఇండస్ట్రీకి రావడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించనట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి ఫ్యూచర్ లో ఏం జరగబోతుంది అనేది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper