R Narayana Murthy: గత 2 సంవత్సరాల క్రితం సినిమా ఇండస్ట్రీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి చాలా గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నాడు…అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి ని కలిసి సినిమా ఇండస్ట్రీ పరిస్థితి గురించి వివరించాడు… ఇక అప్పుడెప్పుడో జరిగిన ఈ విషయాల మీద రీసెంట్ గా ఏపీ అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే అయిన బాలయ్య బాబు స్పందించారు… అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డిని సైకో గాడు అంటూ మాట్లాడటమే కాకుండా చిరంజీవి మీద కూడా కొన్ని విమర్శలైతే చేశాడు. ఇక మొత్తానికైతే చిరంజీవి దాని మీద క్లారిటీ ఇస్తూ ఒక లేఖ అయితే రాశాడు. అందులో చిరంజీవి నాతో పాటుగా రాజమౌళి, నాగార్జున, ప్రభాస్, మహేష్ బాబు, కొరటాల శివ, ఆర్.నారాయణమూర్తి లాంటి వారు జగన్మోహన్ రెడ్డి ని కలవడానికి వచ్చారు అక్కడేం జరిగిందనేది వాళ్లకు తెలుసు అంటూ క్లారిటీ ఇచ్చాడు… ఇక ఆరోజు ఏం జరిగింది అనే విషయం మీద ఆర్ నారాయణ్ మూర్తి స్పందిస్తూ ఇండస్ట్రీలో ఉన్న చాలామంది ప్రొడ్యూసర్లు చిరంజీవి గారిని కలిసి ఇండస్ట్రీ లో జరుగుతున్న కొన్ని విపత్కర పరిస్థితులకు చెక్ పెట్టాలని చెప్పారట.
దానికి చిరంజీవి స్పందించి ఇండస్ట్రీ లో స్టార్ హీరోలు డైరెక్టర్లతో కలిసి జగన్మోహన్ రెడ్డికి దగ్గరికి వెళ్లే ప్రయత్నంలో భాగంగానే చిరంజీవి నాకు ఫోన్ చేసి నువ్వు కూడా మాతో పాటు జగన్మోహన్ రెడ్డి ని కలవడానికి రావాలి. చిన్న సినిమాలు నుంచి పెద్ద సినిమాలు వరకు అన్ని సినిమాలు బతికే విధంగా నిర్ణయాలు తీసుకురావాలని మనం సీఎం గారికి తెలియజేయాలి అంటూ చెప్పారట…
దాంతో వాళ్ళతో పాటు నేను కూడా వెళ్లనని చెప్పాడు. అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారని మేము చెప్పే ప్రాబ్లమ్స్ ని విన్నారని చెప్పాడు. అలాగే ఇందులో చిరంజీవి గారి తప్పేమీ లేదని ఇండస్ట్రీ కోసం ఇండస్ట్రీ బాగుపడడానికి ఆయన తీసుకున్న నిర్ణయం వల్లే ఇండస్ట్రీలో కొన్ని మార్పులు జరిగాయని చెప్పాడు.
ఇక దీంతో బాలయ్య బాబు మీద చాలామంది ఫైర్ అవుతున్నారు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం సరైనది కాదని, తనకంటే ఏజ్ లోను, క్రేజ్ లోను పెద్దవాడైన చిరంజీవిని ఉద్దేశించి అలాంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు. అందుకే బాలయ్య బాబు బహిరంగంగా చిరంజీవికి క్షమాపణలు చెప్పాలి అంటూ మెగా అభిమానులు నినాదాలు చేస్తున్నారు…