Chiranjeevi-Balakrishna controversy: ఏపీ అసెంబ్లీలో( AP assembly) జరిగిన ఘటనకు సంబంధించి వివాదం రోజురోజుకు పెరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవికి బాలకృష్ణ క్షమాపణ చెప్పాలన్న డిమాండ్ వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవిని చులకన చేసే విధంగా బాలకృష్ణ మాట్లాడాలని మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో కొందరు పెద్దలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. చిరంజీవితో పాటు బాలకృష్ణకు సన్నిహితులుగా ఉన్న కొంతమంది పెద్దలు రంగంలోకి దిగి రాజీవ
చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బిజెపి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ బహిరంగ క్షమాపణలు అడిగారు. ఇందుకు సంబంధించి శాసనసభలోనే ఈ ప్రకటన చేశారు. స్పీకర్ రఘురామకృష్ణం రాజుకు విజ్ఞప్తి చేశారు. శాసనసభ రికార్డుల నుంచి వాటిని తొలగించాలని కోరారు. తన వ్యాఖ్యలు పెను దుమారానికి కారణం అయ్యాయని.. లేనిపోని అపార్థాలకు దారి తీసినందుకు క్షమించాలని కోరుతూ వాటిని రికార్డులను తొలగించాలని కోరారు కామినేని శ్రీనివాస్. దీంతో వాటిని రికార్డుల నుంచి తొలగించారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు.
కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలతో..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) ప్రభుత్వం సినీ పరిశ్రమను సైతం ఇబ్బంది పెట్టిందని సభలో వ్యాఖ్యానించారు కామినేని శ్రీనివాస్. అప్పట్లో టిక్కెట్ ధర పెంపు అనేది మెగాస్టార్ చిరంజీవి గట్టిగానే అడిగితేనే జగన్ ఒప్పుకున్నట్లు కామినేని ప్రకటించారు. దానికి కౌంటర్ ఇచ్చారు నందమూరి బాలకృష్ణ. అప్పట్లో జరిగింది ఇది అంటూ చెప్పే క్రమంలో.. చిరంజీవి గట్టిగా అడిగితే జగన్ స్పందించారనేది తప్పు అని.. అప్పట్లో ఎవరు గట్టిగా అడగలేదని.. పైగా చిరంజీవికి అవమానం జరిగిందని చెప్పుకొచ్చారు బాలకృష్ణ. అయితే తన పేరు ప్రస్తావనకు తీసుకురావడంతో చిరంజీవి విదేశాల నుంచి స్పందించారు. నాడు ఏం జరిగింది అనే దానిపై ప్రకటనలో పేర్కొన్నారు. అప్పట్లో సినీ ప్రముఖుల విన్నపం మేరకు మాత్రమే తాను జగన్మోహన్ రెడ్డిని అందరినీ తీసుకెళ్లి కలిశానని.. దాని ఫలితమే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి లాంటి సినిమాలకు టిక్కెట్ల ధర పెంపు అనుమతి అంటూ చెబుతూ ముగించారు.
వివాదం ముదురుతుండగా..
అప్పటినుంచి వివాదం చినికి చినికి గాలి వానలా మారి.. చిరంజీవికి బాలకృష్ణ క్షమాపణ చెప్పాలన్న స్థితికి చేరుకుంది. అయితే దీనిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార అస్త్రంగా మార్చుకుంది. అప్పట్లో సినీ పరిశ్రమకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డిని చెప్పుకొచ్చారని.. ఆ ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని.. ఇదంతా టీడీపీ కూటమి పని అని తేల్చి చెప్పే ప్రయత్నం చేసింది. చిరంజీవిని టార్గెట్ చేసుకున్న బాలకృష్ణ క్షమాపణ చెప్పాల్సిందేనని చెప్పింది. చిరంజీవి పట్ల జగన్మోహన్ రెడ్డి తన అభిమానాన్ని చాటుకుంటూ వచ్చారని గుర్తుచేసింది. తద్వారా కూటమిలో విచ్ఛిన్నం తేవాలని చూసింది. సామాజిక రంగు కూడా దీనికి పులుముకుంది. దీంతో సీఎం చంద్రబాబు సైతం అసహనం వ్యక్తం చేసినట్లు ప్రచారం నడిచింది. అయితే ఇంతటి వివాదానికి కారణమైన కామినేని శ్రీనివాస్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు.. అపార్థాలకు కారణమైన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను రికార్డుల నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేయడం విశేషం. దీంతో ఈ వివాదానికి కొంతవరకు ఎండ్ కార్డు పడినట్టే.