Chiranjeevi Vs Balakrishna: ఇటీవలే ఆంధ్ర ప్రదేశ్ శాసన సభలో హిందూపురం ఎమ్మెల్యే,సినీ నటుడు నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) పై చేసిన కొన్ని వ్యంగ్యమైన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస రావు చిరంజీవి ని పొగుడుతూ, గత వైసీపీ ప్రభుత్వం లో చిరంజీవి ఒక మెట్టు క్రిందకు దిగి, జగన్ తో పోట్లాడి,బ్రతిమిలాడి మాట్లాడడం వల్లే సినీ ఇండస్ట్రీ లో టికెట్ రేట్స్ సమస్య తీరిందని అంటాడు. దానికి బాలయ్య కౌంటర్ ఇస్తూ, అదంతా అబద్దం, చిరంజీవి పీకిందేమి లేదు, నాన్ సెన్స్ మాట్లాడకండి అంటూ చాలా అహంకారం తో మాట్లాడుతాడు. ఈ వ్యాఖ్యలపై చిరంజీవి కూడా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. కేవలం చిరంజీవి మాత్రమే కాదు, ఆ రోజు ఆయనతో కలిసి వచ్చిన నారాయణ మూర్తి, మరియు ఇతర వైసీపీ నేతలు కూడా బాలయ్య కి బలమైన కౌంటర్ ఎటాక్ ఇచ్చారు.
ఇక చిరంజీవి అభిమానుల సంగతి తెలిసిందే కదా. తమ అభిమాన హీరో ని ఒక్క మాట అన్నా ఊరుకోరు. గతం లో CPI నారాయణ ని పరుగులు తీయించి కొట్టేంత పని చేశారు. ఇక బాలయ్య ఈ రేంజ్ కామెంట్స్ చేసిన తర్వాత ఊరుకుంటారా?, గతం లో రియాక్ట్ అయినంత వయొలెంట్ గా రియాక్ట్ అవ్వలేదు కానీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య పై 300 పోలీస్ స్టేషన్స్ లో కేసు ఫిర్యాదు చెయ్యాలని నిన్న బ్లడ్ బ్యాంక్ సమీపం లోని ఒక హోటల్ లో మెగా అభిమానులు మీటింగ్ పెట్టి నిర్ణయం తీసుకున్నారు. ఇదే కనుక జరిగితే పెద్ద సంచలనమే అవుతుంది. ఇరు వర్గాల మధ్య పోరు సోషల్ మీడియా ని దాటి, బయట తారా స్థాయికి చేరుతుంది. అలాంటి పరిస్థితులు రాకుండా, చిరంజీవి లేదా బాలకృష్ణ ఎవరో ఒకరు బలమైన స్టాండ్ తీసుకొని, అభిమానులను శాంతింప చేయాలనీ కోరుకుంటున్నారు విశ్లేషకులు.
మరి చిరంజీవి, బాలయ్య రియాక్ట్ అవుతారా లేదా అనేది చూడాలి. ఒకవేళ రియాక్ట్ అవ్వకపోతే పరిస్థితులు చేతులు దాటే ప్రమాదం లేకపోలేదు. బాలయ్య చిరంజీవి పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమి కాదు. చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి స్థానం లో ఉన్నాడు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు అసెంబ్లీ లో ఉన్నారు, వీళ్లంతా ఒక కూటమి, అనవసరంగా కూటమి మధ్య చిచ్చు పెట్టే వ్యాఖ్యలు చెయ్యకూడదు అనే స్పృహ బాలయ్య లేదు, ఏది పడితే అది మాట్లాడేస్తున్నాడు అంటూ సోషల్ మీడియా లో మెగా అభిమానులు మండిపడుతున్నారు. దీనిపై చంద్రబాబు బాలయ్య ని కంట్రోల్ లో పెట్టాలి, లేదంటే నేరుగా పవన్ కళ్యాణ్ బహిరంగ కౌంటర్లు ఇచ్చే రోజులు ఉంటాయని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నారు.