Chiranjeevi Vs Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ వాంటెడ్ కాంబినేషన్ ఏదైనా ఉంది అంటే అది చిరంజీవి – బాలయ్య కాంబినేషన్ అనే చెప్పాలి. వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తే చూడాలని యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కెరియర్ మొదట్లో వీళ్ల కాంబినేషన్ లో సినిమా రావాల్సింది కానీ కథ కుదరకపోవడంతో ఆ సినిమాని చేయలేకపోయారు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు అవకాశం దొరికిన ప్రతిసారి మేము కలిసిన నటించడానికి సిద్ధంగా ఉన్నామని ఇరు చిరంజీవి, అటు బాలయ్య చెప్పినప్పటికి అది కార్యరూపం మాత్రం దాల్చడం లేదు… ఒకరకంగా వీళ్ళిద్దరి కి సరిపడా కథ దొరకడం లేదని కొంతమంది చెబుతుంటే, మరి కొంతమంది మాత్రం వీళ్ళిద్దరికి ఉన్న ఇగో ని తగ్గించుకొని సినిమా చేయడం అనేది చాలా కష్టం…
వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరి పాత్ర పెరిగిన, మరొకరిది తగ్గిన ఇద్దరి మధ్య విభేదాలు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. అలాగే తమ అభిమానులు సైతం ఆ విషయాలను జీర్ణించుకోలేరు. కాబట్టే వీళ్ళు కలిసి సినిమా చేయడానికి ఆసక్తిని చూపించడం లేదనేది ప్రధానాంశంగా తెలుస్తోంది. ఇక మలయాళం సినిమా ఇండస్ట్రీలో మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి నటులు కలిసి నటించడానికి ఆసక్తి చూపించడమే కాకుండా వీళ్ళ కాంబినేషన్లో కొన్ని సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధించారు…
ఆ ఇద్దరు లెజెండరీ హీరోల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ మన చిరంజీవి – బాలయ్య బాబు మధ్య లేకపోవడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన విషయం అనే చెప్పాలి… ఇక వీళ్ళిద్దరూ తీర్చలేని కోరికను మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ హీరోలైన రాంచరణ్, ఎన్టీఆర్లు తీర్చారు. వీళ్ళిద్దరు కలిసి ‘త్రిబుల్ ఆర్’ సినిమా చేశారు. ఒక రకంగా ఈ రెండు ఫ్యామిలీల అభిమానులు కూడా ఈ సినిమా మీద సంతృప్తిని చెందారు.
అయినప్పటికి చిరంజీవి – బాలయ్య బాబు కాంబినేషన్లో సినిమా వస్తే దానికి చాలా మంచి క్రేజ్ దక్కుతుందని చెబుతున్నారు. ఇక రీసెంట్ గా బాలయ్య బాబు అసెంబ్లీ లో చిరంజీవి ని ఉద్దేశించి కొన్ని క్లిక్స్ వ్యాఖ్యలు చేశారు. దాంతో వీళ్లిద్దరి మధ్య చిన్నపాటి ఇగో ప్రాబ్లం అయితే వచ్చింది. మొన్నటివరకు వీళ్ళ కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు వచ్చినప్పటికీ బాలయ్య బాబు కామెంట్స్ తో వీళ్లిద్దరి మధ్య ఇగోలు ఎలా ఉన్నాయి అనేది క్లారిటీగా తెలిసిపోయింది. ఇక దీన్ని బట్టి చూస్తే వీళ్ళ కాంబినేషన్లో సినిమా రావడం అనేది అసాధ్యం అనే చెప్పాలి…