Homeఎంటర్టైన్మెంట్Ram Charan Dance Performance: రామ్ చరణ్ తో డాన్స్ అంటే భయపడిపోతున్న హీరోయిన్స్ వీళ్లేనా..?

Ram Charan Dance Performance: రామ్ చరణ్ తో డాన్స్ అంటే భయపడిపోతున్న హీరోయిన్స్ వీళ్లేనా..?

Ram Charan Dance Performance: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ కి చాలా మంచి క్రేజ్ ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాడు. ఇక రామ్ చరణ్ అంటే డ్యాన్స్, ఫైట్లతో ప్రేక్షకులకు ఒక మంచి కిక్ ఇచ్చే హీరో అనే విషయం మనందరికి తెలిసిందే. ఆయన మొదటి సినిమా నుంచి మాస్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలను నమ్ముకుని ముందుకు సాగుతున్నాడు. మధ్యలో మగధీర లాంటి […]

Ram Charan Dance Performance: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ కి చాలా మంచి క్రేజ్ ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాడు. ఇక రామ్ చరణ్ అంటే డ్యాన్స్, ఫైట్లతో ప్రేక్షకులకు ఒక మంచి కిక్ ఇచ్చే హీరో అనే విషయం మనందరికి తెలిసిందే. ఆయన మొదటి సినిమా నుంచి మాస్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలను నమ్ముకుని ముందుకు సాగుతున్నాడు. మధ్యలో మగధీర లాంటి ప్రయోగాత్మకమైన సినిమా చేశాడు. ఆ మూవీ సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడంతో రామ్ చరణ్ క్రేజ్ తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు తను వెను తిరిగి చూడకుండా ముందుకు సాగుతున్నాడు. రాజమౌళితో చేసిన ‘త్రిబుల్ ఆర్’ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో గ్లోబల్ స్టార్ గా కూడా అవతరించాడు. అలాంటి రామ్ చరణ్ తన అభిమానుల కోసం ఎంత కష్టమైన స్టెప్పులనైనా సరే వేసి తన డాన్సులతో అభిమానులను మెప్పిస్తూ ఉంటాడు.

ఇక ఇలాంటి క్రమంలోనే రామ్ చరణ్ పక్కన డాన్సులు వేయడానికి హీరోలు చాలా వరకు భయపడిపోతున్నారట… మిగతా హీరోలతో డ్యాన్స్ చేయడానికి వాళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోయిన కూడా రామ్ చరణ్ పక్కన డాన్స్ వెయ్యాలంటే మాత్రం వాళ్ళు చాలా వరకు రిహార్సల్స్ చేసుకొని మరి సెట్ కి వస్తున్నారట. ఈ క్రమం లోనే ‘పెద్ది’ సినిమాలో శృతిహాసన్ ఐటెం సాంగ్ చేసిన విషయం మనకు తెలిసిందే.

ఆమె ఆ సాంగ్ చేయడానికి చాలా వరకు షూటింగ్ కి మూడు రోజుల ముందు నుంచి ఏమైనా రిహార్సల్స్ చేసుకుంటూ ఆ స్టెప్పును ఎలా పెర్ఫామ్ చేయాలి. ఆ గ్రేస్ ఎలా రావాలి అనే విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రామ్ చరణ్ పక్కన స్టెప్ లు వేయడం అంటే అంత ఆశా మాశీ వ్యవహారం అయితే కాదు.

అందులో ఏమాత్రం చిన్న తేడా వచ్చినా కూడా పక్కన ఉన్న హీరోయిన్ తేలిపోతూ ఉంటారు. కాబట్టి రామ్ చరణ్ కి పోటీ ఇవ్వకపోయిన తన డాన్స్ ను మ్యాచ్ చేస్తే చాలు అనే ఉద్దేశ్యంతోనే హీరోయిన్స్ అయితే ఉన్నారు. శృతిహాసన్ సైతం అలాగే బయపడిందట. మొత్తానికైతే ఐటెం సాంగ్ లో అద్భుతమైన స్టెప్పులు వేసిన శృతిహాసన్ రామ్ చరణ్ పక్కన మంచి స్టెప్ లు వేసింది. ఇక రీసెంట్ గా ఈ సాంగ్ కి సంబంధించిన లిరికల్ వీడియో అయితే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పెన్స్ రావడం విశేషం…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper