Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi: చిరంజీవి చేయాల్సిన ఆ రెండు సినిమాలను చేసి డిజాస్టర్లను అందుకున్న వెంకటేష్, బాలయ్య...

Chiranjeevi: చిరంజీవి చేయాల్సిన ఆ రెండు సినిమాలను చేసి డిజాస్టర్లను అందుకున్న వెంకటేష్, బాలయ్య…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యం ఉంటుంది. అందుకే ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వస్తుంటుంది. అలాంటి చిరంజీవి ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. తన నుంచి వచ్చే సినిమాలు యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా ఈ ఏజ్ లో కూడా అంత మంచిన్మోవీస్ […]

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యం ఉంటుంది. అందుకే ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వస్తుంటుంది. అలాంటి చిరంజీవి ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. తన నుంచి వచ్చే సినిమాలు యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా ఈ ఏజ్ లో కూడా అంత మంచిన్మోవీస్ చేస్తున్నాడు అంటే సినిమాలంటే అతనికి ఎంత ఇష్టమో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పటికి ఆయన చాలా రిస్కీ షాట్స్ డూప్ లేకుండానే చేస్తుంటాడు. అంటే ఆయన సినిమా మీద ఎంత ఎఫర్ట్ పెడతాడో మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తానికైతే చిరంజీవి లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం అనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సక్సెస్ లను సాధించినా కూడా చిరంజీవి రేంజ్ సక్సెసు లైతే పొందలేకపోయారు. బ్యాక్ టు బ్యాక్ ఆరు సంవత్సరాల్లో 6 ఇండస్ట్రీ హిట్లు కొట్టిన ఘనత కూడా తనకే దక్కుతుంది.

మరి అలాంటి చిరంజీవి చేయాల్సిన రెండు సినిమాలను బాలయ్య బాబు, వెంకటేష్ చేసి భారీ డిజాస్టర్ ను మూట గట్టుకున్నారనే విషయం మనలో చాలామందికి తెలియదు… కొదండ రామిరెడ్డి దర్శకత్వంలో బాలయ్య బాబు చేసిన ‘నిప్పురవ్వ’ సినిమా కథని మొదట చిరంజీవికి వినిపించారట.

అయితే చిరంజీవి అందులో కొన్ని మార్పులు చేర్పులు చేయమని అడగడంతో దర్శకుడు కోదండరామిరెడ్డి ఆ కథని బాలయ్య బాబు దగ్గరికి తీసుకెళ్లి సినిమా చేశారు. సినిమా ఓకే అనిపించుకున్నప్పటికి కలెక్షన్స్ మాత్రం ఏమీ రాలేదు. దాంతో సినిమా ప్లాప్ అయినట్టుగా తేల్చేశారు. ఇక వెంకటేష్ చేసిన సుభాష్ చంద్రబోస్ సినిమాని సైతం రాఘవేంద్రరావు మొదట చిరంజీవితోనే చేయాలనుకున్నారట.

చిరంజీవి ఆ కథను విని ఇది అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదని రాఘవేంద్రరావుకు చెప్పాడు. దాంతో హర్ట్ అయిన రాఘవేంద్రరావు వెంటనే ఆ కథని వెంకటేష్ దగ్గరికి తీసుకెళ్లి ఈ సినిమాను పట్టాలెక్కించాడు. మొత్తానికి ఈ సినిమాకి కూడా అల్ట్రా డిజాస్టర్ గా మిగలడంతో చిరంజీవి ఆ రెండు సినిమాలను వదిలేసి రెండు ఫ్లాప్ ల నుంచి తప్పించుకున్నాడు అంటూ అతని అభిమానులైతే ఆనందపడుతున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper