Sampoornesh Babu: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు “క్యాలీ ఫ్లవర్” నుంచి స్వీట్ గిఫ్ట్ ఇచ్చిన చిత్ర బృందం…
Written By:
Raghava Rao Gara , Updated On : November 13, 2021 7:14 pm
Follow us on
Sampoornesh Babu: హృదయ కాలేయం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో సంపూర్ణేష్ బాబు. ఆ తర్వాత సింగం 123, కొబ్బరిమట్ట చిత్రాలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు మన బర్నింగ్ స్టార్. సంపూ ప్రస్తుతం ఆర్కే మలినేని దర్శకత్వంలో… వాసంతి హీరోయిన్ గా ‘క్యాలీఫ్లవర్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. గుడూరు శ్రీధర్ సమర్పణలో ఆశాజ్యోతి గోగినేని ఈ సినిమాని నిర్మించారు. ‘‘ఇంగ్లాండ్ నుంచి ఇండియా వచ్చిన ఓ ఇంగ్లిష్ వ్యక్తిగా సంపూ కనిపిస్తారు. అయితే తాజాగా ఈ సినిమా కు సంబంధించిన రెండు పోస్టర్లను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ఈ పోస్టర్స్ లో మగాడి దీ శీలమేగా అనే క్యాప్షన్ తో విడుదల చేశారు. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు క్యారెక్టర్ ఆడవారిదే శీలమా, మగాడి దీ శీలం కాదా అని ప్రశ్నించేలా ఉంటుందని తెలుస్తుంది. అలాగే పోస్టర్ లలో శీలో రక్షతి రక్షితః అనే ఉప శిర్షీక ఉండడం గమనార్హం. పోస్టర్లను చూస్తుంటే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు సంపూ సిద్దమైనట్లు అనిపిస్తుంది. ఈ సినిమాను నవంబర్ 26 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
ఈ సినిమా లో పోసాని కృష్ణ మురళి, పృధ్వీ, నాగ మహేష్, గెటప్ శ్రీను, రోహిని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కాగా ఈ మూవీతో సంపూ మంచి విజయాన్ని దక్కించుకుంటాడని మూవీ యూనిట్ చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంకి విడుదలైన పోస్టర్లు. టీజర్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రస్తుతం ఈ పోస్టర్లు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.