Homeక్రీడలుక్రికెట్‌Womens Asia Cup: అదీ టీమిండియా మహిళల దమ్ము.. పాపం పాకిస్తాన్ నఖ్వీ గాడికి అరెకరం...

Womens Asia Cup: అదీ టీమిండియా మహిళల దమ్ము.. పాపం పాకిస్తాన్ నఖ్వీ గాడికి అరెకరం తడిచిపోయింది.. వైరల్ వీడియో..

Womens Asia Cup: సరిహద్దుల్లో పారించిన రక్తం ఇంకా పచ్చిగానే ఉంది. చేసిన గాయాలు.. చోటు చేసుకున్న దారుణాలు.. కోల్పోయిన ప్రాణాలు.. ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తుంటే వాటిని మరిచిపోయి ఎలా ముందుకు వస్తారు.. చిరునవ్వులు చిందిస్తూ ట్రోఫీ ఎలా తీసుకుంటారు.. అలా తీసుకుంటే వాళ్లు మన భారతీయ మహిళలు ఎలా అవుతారు.. ఆసియా కప్ లో శ్రీలంక మీద భారత్ గెలిచి.. విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో వీరోచితమైన పోరాటం చేసి అదరగొట్టింది. ఈ నేపథ్యంలో […]

Womens Asia Cup: సరిహద్దుల్లో పారించిన రక్తం ఇంకా పచ్చిగానే ఉంది. చేసిన గాయాలు.. చోటు చేసుకున్న దారుణాలు.. కోల్పోయిన ప్రాణాలు.. ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తుంటే వాటిని మరిచిపోయి ఎలా ముందుకు వస్తారు.. చిరునవ్వులు చిందిస్తూ ట్రోఫీ ఎలా తీసుకుంటారు.. అలా తీసుకుంటే వాళ్లు మన భారతీయ మహిళలు ఎలా అవుతారు..

ఆసియా కప్ లో శ్రీలంక మీద భారత్ గెలిచి.. విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో వీరోచితమైన పోరాటం చేసి అదరగొట్టింది. ఈ నేపథ్యంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు హోదాలో పాకిస్తాన్ క్రికెట్ సంఘ అధ్యక్షుడు మోసిన్ నఖ్వీ ట్రోఫీ అందించేందుకు ముందుకు వచ్చారు. వాస్తవానికి ఈ విషయం భారత క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కు తెలియదు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి.. తోటి మహిళా క్రికెటర్లతో ఆమె స్టేడియంలోకి అడుగుపెట్టింది. ఒక్కసారిగా నఖ్వీ ని చూసి వెంటనే ఆమె వెనకడుగు వేసింది.

బీసీసీఐ ప్రతినిధులతో నఖ్వీ చర్చలు జరిపినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. నఖ్వీ ని చూసి భారత మహిళలు దూరంగా ఉండిపోయారు. అతడు స్టేడియం నుంచి వీడి వెళ్లిపోయిన తర్వాతనే భారత మహిళా క్రికెటర్లు ఫోటోలు దిగారు. భారత మహిళా క్రికెటర్లు ట్రోఫీ తీసుకురావడానికి ముందుకు రాకపోవడంతో నఖ్వీ నిరాశతో వెళ్లిపోయాడు.

గతంలో కూడా భారత పురుషుల జట్టు గెలిచినప్పుడు.. పాకిస్తాన్ మీద అద్భుతమైన విజయాన్ని సాధించినప్పుడు.. ట్రోఫీ అందుకోవడానికి ముందుకు రాలేదు. నఖ్వీ అప్పుడు కూడా ఇలాంటి పరాభవాన్నే ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరికి ట్రోఫీ ఇవ్వకుండా అతడు వెళ్లిపోయాడు. అయితే ఇప్పటివరకు టీం ఇండియాకు ఆసియా కప్ ట్రోఫీ ఇవ్వలేదని తెలుస్తోంది. దీనికి తోడు ట్రోఫీని భారత జట్టుకు ఇంతవరకు పంపించకపోవడంతో సోషల్ మీడియాలో ఇప్పటికి పాకిస్తాన్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు నఖ్వీ మీద విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి.

సోషల్ మీడియాలో ఈ స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నప్పటికీ.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు నఖ్వీ ట్రోఫీ ఇవ్వడానికి ముందుకు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అసలు పాకిస్తాన్ అంటేనే టీమిండియా ఈ స్థాయిలో చీదరించుకుంటుంటే.. సిగ్గు లేకుండా ట్రోఫీ ఇవ్వడానికి పాకిస్తాన్ క్రికెట్ సంఘ అధ్యక్షుడు ముందుకు ఎలా వస్తారని క్రికెట్ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా పాకిస్తాన్ క్రికెట్ పెద్దలు.. పాకిస్తాన్ దేశ అధినేతలు సిగ్గు తెచ్చుకోవాలని.. భారత్ మీద విద్వేషాన్ని మానుకోవాలని విశ్లేషకులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper