Homeఎంటర్టైన్మెంట్Balakrishna: బాలయ్య ఎవరినైతే నమ్ముతాడో వాళ్లే మోసం చేస్తున్నారా...

Balakrishna: బాలయ్య ఎవరినైతే నమ్ముతాడో వాళ్లే మోసం చేస్తున్నారా…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. నందమూరి తారక రామారావు గారి నట వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన బాలయ్య తండ్రికి తగ్గ తనయుడిగా పేరును సంపాదించుకున్నాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వెను తిరిగి చూడకుండా ముందుకు దూసుకెళ్తున్నాడు. మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న నటుడు కూడా తనే కావడం విశేషం… 70 సంవత్సరాలకు దగ్గరవుతున్న కూడా ఆయన ఏమాత్రం అలిసిపోకుండా సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకుంటున్నాడు. యాంగ్ హీరోలు సైతం అతని ముందు సరిపోవడం లేదు అంటే అతని ఎనర్జీ ఏ లెవెల్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు… ఇక అలాంటి బాలయ్య కొంతమంది దర్శకులను నమ్మి వాళ్లకు సినిమాలను చేసే అవకాశం అయితే ఇచ్చాడు. కానీ ఆ దర్శకులు అతని నమ్మకాన్ని నిలబెట్టలేకపోయారు.

ముఖ్యంగా అతనికి సక్సెస్ లను సాధించి పెట్టిన దర్శకులు సైతం అతన్ని విమర్శల పాలు చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇలాంటి క్రమంలోనే బాలయ్య బాబు – బి.గోపాల్ కాంబినేషన్ లో భారీ సినిమాలైతే వచ్చాయి. లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి ఎన్నో గొప్ప సినిమాలు వచ్చినప్పటికి ఈ సినిమాలు బాలయ్య బాబుకి గొప్ప ఇమేజ్ ని తీసుకొచ్చి పెట్టాయి.

ఆయనే ‘పల్నాటి బ్రహ్మనాయుడు’ సినిమా ద్వారా బాలయ్య బాబు ఇమేజ్ ను డామేజ్ చేశాడనే చెప్పాలి. తనను నమ్మి కథ కూడా వినకుండా అవకాశం ఇచ్చినందుకు బాలయ్య బాబుకు పెద్ద బొక్క పెట్టాడు అంటూ చాలామంది బి.గోపాల్ మీద ఫైర్ అయ్యారు. ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య బాబు చేసిన మూడు సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించాయి.

దాంతో ‘అఖండ 2’ సినిమా విషయంలో బాలయ్య బాబు పెద్దగా ఇన్వాల్వ్ కాకుండా కథ కూడా వినకుండా డైరెక్ట్ సెట్స్ లోకి వెళ్లిపోయాడు. ఆ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుంది అనుకున్నప్పటికి సినిమా ఫ్లాప్ అయింది. దాంతో ప్రొడ్యూసర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు భారీగా నష్టాలైతే వచ్చాయి. ఇక బాలయ్య ఇమేజ్ కూడా కొంతవరకు తగ్గిందనే చెప్పాలి. ఆ ఇద్దరు దర్శకులను బాలయ్య బ్లైండ్ గా నమ్మాడు. కానీ వాళ్ళిద్దరు అతనికి భారీ ఇమేజ్ ను ఇచ్చినట్టే ఇచ్చి తన క్రేజ్ తగ్గిపోయే సినిమాలను చేశారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Ramayana Movie

Ramayana Movie: రామాయణంలో రావణుడు.. యష్ బీభత్సకాండ కు రణబీర్ షాక్

Ramayana Movie: నితీష్ తివారీ డైరెక్షన్లో 'రామాయణ' అనే భారీ పౌరాణిక చిత్రం సిద్ధమవుతోంది. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్.. రావణుడిగా యశ్ పాత్రను పోషించనున్నారు. సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తున్నారు. హనుమంతుడి...
Haripriya Vasishta N Simha

Haripriya Vasishta N Simha: ఈ భార్యభర్తలిద్దరూ ప్రముఖ నటులే.. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు..

Haripriya Vasishta N Simha: సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఇందులో ఒక్కసారి ఛాన్స్ వస్తే ఎవరు వదులుకోరు. ఒక కుటుంబంలో ఒకరికి అవకాశం వస్తే ఆ తర్వాత వారికి సంబంధించిన వారు...
Quality Content In Cinema

Quality Content In Cinema: కంటెంటే కింగ్.. ఇప్పటికైనా తత్త్వం బోధపడిందా?

Quality Content In Cinema: గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాయి. వెండితెరకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఓటీటీలేనని చాలా మంది ఆరోపించారు. కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు...
Adarsha Kutumbam

Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ లో ఏముంది… అదొక్కటి తప్ప…

Adarsha Kutumbam: వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆదర్శ కుటుంబం' సినిమాకు సంబంధించిన గ్లింప్స్ కొద్ది సేపటి క్రితం రిలీజ్ అయింది. ఈ గ్లింప్స్ లో సినిమా యొక్క ఎంటైర్...
Zomato Anniversary Campaign

Zomato Anniversary Campaign: బిల్డప్ కోసం లోగో తీసేస్తే.. కోట్లు బొక్క..

Zomato Anniversary Campaign: క్రియేటివిటీ.. ఇది ఆకర్షించే విధంగా ఉండాలి. జనాలలో ఆలోచన తెచ్చే విధంగా ఉండాలి. ఒకరకంగా నూతనత్వం వైపు అడుగులు వేసే విధంగా ఉండాలి. అలాకాకుండా చదివేస్తే ఉన్న...
Oktelugu Epaper