Homeఎంటర్టైన్మెంట్Bandla Ganesh vs Prakash Raj: బండ్ల గణేష్ కు భయపడుతున్న ప్రకాష్ రాజ్!

Bandla Ganesh vs Prakash Raj: బండ్ల గణేష్ కు భయపడుతున్న ప్రకాష్ రాజ్!

Bandla Ganesh vs Prakash Raj: పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకోవడంలో ముందుంటారు ప్రకాష్ రాజ్. మరి ఆయనకు పవన్ కళ్యాణ్ పై కోపమో.. లేకుంటే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే వస్తే లాభమో.. తెలియదు కానీ అదే పనిగా సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తూనే ఉంటారు. ప్రశ్నిస్తాను అంటూ పెద్ద పెద్దగా ప్రశ్నలు వేస్తుంటారు. ప్రతిరోజు ఉదయం ఓ ట్వీట్ చేయడం.. అందులో పవన్ ని టార్గెట్ చేయడం.. ఇదో రొటీన్ కథగా […]

Bandla Ganesh vs Prakash Raj: పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకోవడంలో ముందుంటారు ప్రకాష్ రాజ్. మరి ఆయనకు పవన్ కళ్యాణ్ పై కోపమో.. లేకుంటే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే వస్తే లాభమో.. తెలియదు కానీ అదే పనిగా సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తూనే ఉంటారు. ప్రశ్నిస్తాను అంటూ పెద్ద పెద్దగా ప్రశ్నలు వేస్తుంటారు. ప్రతిరోజు ఉదయం ఓ ట్వీట్ చేయడం.. అందులో పవన్ ని టార్గెట్ చేయడం.. ఇదో రొటీన్ కథగా మారిపోయింది. చివరకు అందరూ మరిచిపోయారు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ పై చేసే కామెంట్లను. పవన్ కళ్యాణ్ తప్పితే ప్రకాష్ రాజ్ కు మరొకరు దొరకరా అని వ్యాఖ్యానించిన వారు ఉన్నారు. పవన్ ఫ్యాన్స్ ఎలానూ ప్రకాష్ రాజ్ పై విరుచుకుపడుతుంటారు. అయితే ఇప్పుడు బండ్ల గణేష్ డైరెక్టుగా లైన్లోకి వస్తున్నాడు. ప్రకాష్ రాజ్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నాడు. బండ్ల ట్విట్టర్ తెరిస్తే.. అందులో సగానికి పైగా ప్రకాష్ రాజ్ ని ఉద్దేశించినవే.

* ఇచ్చి పడేసిన బండ్లన్న..
బండ్ల గణేష్ ఈరోజు ట్వీట్ చేశాడు. ప్రకాష్ రాజును ఉద్దేశించి ఇంకా ట్వీట్ వేయలేదేంటి? డబ్బులు ముట్టలేదా? అకౌంట్ చెక్ చేసుకోలేదా? అంటూ కవ్విస్తూ మాట్లాడాడు. రాత్రి తాగడం.. పొద్దున్నే వాగడం అంటూ కౌంటర్ అటాచ్ చేశాడు. పనికిరాని పోస్టులు… పనికిరాని మాటలు.. పనికిరాని గొడవలు.. ఇదే నీ దినచర్య.. హాయిగా నీ పని నువ్వు చేసుకుని సంతోషంగా బతుకు.. అనవసరంగా ఇతరుల గురించి నోరు పారేసుకుని.. నీ విలువను నువ్వే తగ్గించుకోకు… అంటూ ట్విట్టర్ లో హితబోధ చేశాడు.

* గతంలో సైతం..
అయితే బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ విషయంలో ఇంత ఘాటుగా స్పందించడం ఇది తొలిసారి కాదు. గతంలో కూడా కౌంటర్ అటాక్ చేశాడు. అయితే బండ్ల గణేష్ తనకు సరి జోడి కాదు అనుకున్నాడో.. లేకుంటే భయపడ్డాడో తెలియదు కానీ.. ఒక్కసారి కూడా బండ్ల గణేష్ కు సమాధానం చెప్పలేదు. కనీసం తనను తాను డిఫెండ్ చేసుకోవడానికి కూడా చూడలేదు. బండ్ల గణేష్ దూకుడుగా ఉంటారు. ఆ దూకుడు తనం సినీ ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. రాజకీయాల్లో కూడా అదే దూకుడుతో వ్యవహరిస్తారు. అవసరం అనుకుంటే ప్రకాష్ రాజ్ జీవితాన్ని బయటకు పెట్టేస్తాడు గణేష్. అనవసరంగా ఆయన జోలికి వెళ్లడం ఏంటి? అనే ఆలోచనను తప్పకుండా చేస్తాడు.. అందుకే సమాధానం చెప్పలేదని నెటిజెన్లు సైతం భావిస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper