Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ లో ఆరంభం నుండి ఊహించని సంఘటనలు ఎదురు అవుతున్నాయి. ఆడియన్స్ లో కలుగుతున్న అనుమానం ఏమిటంటే ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ ఎలిమినేషన్స్ ఆడియన్స్ ఓటింగ్ కి అనుగుణంగానే ఉంటుందా?, లేదా టాస్కుల ద్వారా ఉంటుందా అని. నేటి ఎపిసోడ్ లో జరగబోయే టాస్క్ లో ఆటో రామ్ ప్రసాద్ చాలా పెద్ద మిస్టేక్ చేసాడని తెలుస్తోంది. తనపై తానూ ఓవర్ కాన్ఫిడెన్స్ తో వ్యవహరిస్తూ, హై రిస్క్ జోన్ లో పెట్టుకోవడం పై ఆయన అభిమానులు మండిపడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే నిన్నటి ఎపిసోడ్ లో పౌచ్ టాస్క్ ని మీరంతా చూసే ఉంటారు. ఈ టాస్క్ లో రామ్ ప్రసాద్ టీం గెలుస్తుంది. రోహిత్ టీం బెస్ట్ ఎఫోర్ట్స్ పెట్టినప్పటికీ ఓడిపోతుంది. అయితే బిగ్ బాస్ మీ ఇరు టీమ్స్ లో ఎవరో ఒకరిని హై రిస్క్ జోన్ లో ఉంచాలని అంటాడు.
రోహిత్ టీం లో అందరూ చర్చించుకొని చరణ్ ని హై రిస్క్ జోన్ లో పెట్టగా, రామ్ ప్రసాద్ టీం లో ఎలాంటి చర్చలు లేకుండానే , నేను టీం లీడర్ ని కదా, బాధ్యతలు తీసుకొని నేనే హై రిస్క్ జోన్ లోకి వెళ్తాను అని చెప్పి , రామ్ ప్రసాద్ వెళ్తాడు. రామ్ ప్రసాద్ టీం లీడర్ అయ్యుండి తప్పుకున్నాడు కాబట్టి , మీ లీడర్ షిప్ ని ఎవరికో ఒకరికి ఇచ్చి మీరు గేమ్స్ నుండి తప్పుకోండి అని బిగ్ బాస్ అంటాడు. అప్పుడు రామ్ ప్రసాద్ దేబ్ జానీ ని లీడర్ ని చేసి తప్పుకుంటాడు. ఇప్పుడు రామ్ ప్రసాద్ , చరణ్ ఈ వారం టాస్కుల్లో ఆడేందుకు వీలు లేదు అన్నమాట. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ఏమిటంటే, నేడు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందట.
ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో హై రిస్క్ జోన్ లో ఉన్న చరణ్ , రామ్ ప్రసాద్ లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ రామ్ ప్రసాద్ నిజంగా ఎలిమినేట్ అయితే ఒక బలమైన కంటెస్టెంట్ ని బిగ్ బాస్ హౌస్ కోల్పోయినట్టే అనుకోవాలి. ఎందుకంటే రామ్ ప్రసాద్ టాస్కులు అద్భుతంగా ఆడగలడు, కామెడీ చెయ్యగలడు. అందరితో బాగా కలిసిపోతున్నాడు, నిన్న నామినేషన్స్ లో కూడా రఫ్ఫాడించాడు. ఇలాంటి తోపు కంటెస్టెంట్ , చిన్న పొరపాటు వల్ల ఎలిమినేట్ అయితే ఆయన అభిమానుల్లో బాధ మామూలు రేంజ్ లో ఉండదు. ఒకవేళ సేవ్ అయితే మాత్రం వీకెండ్ లో నాగార్జున చేతుల్లో ఫుల్ కోటింగ్ ఉంటుంది అనే చెప్పాలి. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.