Homeటాప్ స్టోరీస్SBI Insurance: ఏడాదికి 3000 కడితే.. 60 లక్షలు.. ఎస్ బీఐ అందిస్తున్న ఈ స్కీమ్...

SBI Insurance: ఏడాదికి 3000 కడితే.. 60 లక్షలు.. ఎస్ బీఐ అందిస్తున్న ఈ స్కీమ్ ల గురించి తెలుసా..

SBI Insurance: మన దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పేరు ఉంది. తన ఖాతాదారులకు మెరుగైన ప్రయోజనం అందించేందుకు ఈ బ్యాంకు వినూత్నమైన పథకాలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో వారికి మెరుగైన ఆర్థిక భరోసా అందించేందుకు కొత్త పథకాలకు రూపకల్పన చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫర్ చేస్తున్న ఈ స్కీం ప్రకారం రోజుకు 8 రూపాయలు సంవత్సరానికి మూడు వేల రూపాయల వరకు చెల్లిస్తే 60 లక్షల వరకు […]

SBI Insurance: మన దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పేరు ఉంది. తన ఖాతాదారులకు మెరుగైన ప్రయోజనం అందించేందుకు ఈ బ్యాంకు వినూత్నమైన పథకాలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో వారికి మెరుగైన ఆర్థిక భరోసా అందించేందుకు కొత్త పథకాలకు రూపకల్పన చేసింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫర్ చేస్తున్న ఈ స్కీం ప్రకారం రోజుకు 8 రూపాయలు సంవత్సరానికి మూడు వేల రూపాయల వరకు చెల్లిస్తే 60 లక్షల వరకు లభిస్తాయి. దీనిని ఎస్బిఐ ప్రత్యేకమైన గ్రూప్ పర్సనల్ యాక్సెంట్ ఇన్సూరెన్స్ కింద అందిస్తోంది. అయితే ఇది ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదా సేవింగ్స్ స్కీం అసలే కాదు. కేవలం ప్రమాదవశాత్తు జరిగే నష్టాల నుంచి రక్షణ కల్పించడానికి ప్యూర్ ఇన్సూరెన్స్ స్కీం.

స్కీం వివరాలు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారుల కోసం తీసుకొచ్చిన మూడు ప్రీమియం ప్లాన్లు ఇవి. ఇందులో వార్షిక ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది.. అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఈ పథకాలకు ఎస్బిఐ రూపకల్పన చేసింది.

ప్లాన్ 1.. ఏడాదికి 1000 రూపాయలు ప్రీమియం చెల్లిస్తే 20 లక్షల వరకు బీమా కవరేజీ లభిస్తుంది.

ప్లాన్ 2: ఏడాదికి 2000 చొప్పున ప్రీమియం చెల్లిస్తే 40 లక్షలు వరకు భీమా కవరేజ్ లభిస్తుంది.

ప్లాన్ 3: ఏడాదికి మూడు వేల రూపాయల చొప్పున ప్రీమియం చెల్లిస్తే.. అంటే రోజుకు 8 రూపాయల రెండు పైసలు చెల్లిస్తే 60 లక్షల వరకు బీమా కవరేజ్ లభిస్తూ ఉంటుంది.

ఈ పాలసీలు తీసుకున్న వ్యక్తులు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే నామినీకి లేదా ఆ వ్యక్తికి సంబంధించిన వ్యక్తులకు డబ్బులు లభిస్తాయి. పాలసీ చెల్లిస్తున్న వ్యక్తి ప్రమాదంలో చనిపోతే నామినీకి 60 లక్షల వరకు బీమా లభిస్తూ ఉంటుంది. ఒకవేళ శాశ్వత వైకల్యం గనుక సంభవిస్తే 60 లక్షల వరకు చెల్లిస్తారు. ఒకవేళ పాక్షికవైకల్యం గనుక సంభవిస్తే.. దాని తీవ్రతను బట్టి నిర్దేశించిన శాతం వరకు బీమా లభిస్తూ ఉంటుంది. ప్రమాదం జరిగినప్పుడు ఆసుపత్రిలో చేరితే అయ్యే ఖర్చులకోసం కూడా కొంతమేరకు సహాయం లభిస్తూ ఉంటుంది.

అయితే ఇక్కడ పాలసీదారులు గమనించాల్సిన విషయం ఒకటి ఏంటంటే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సేవింగ్స్ లేదా కరెంట్ ఎకౌంటు ఉన్న వారికి మాత్రమే గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వయసు ఉన్నవారు ఇందులో చేరడానికి అవకాశం ఉంటుంది.. ఇది కేవలం ప్రమాద బీమా మాత్రమే. పాలసీ కాలపర్మతి ముగిసిన తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వడానికి అవకాశం ఉండదు.

ప్రతి ఏడాది మీరు నిర్వహిస్తున్న బ్యాంక్ ఖాతా నుంచి ప్రీమియం మొత్తం ఆటోమెటిక్ గా కట్ అయ్యే విధంగా దీనిని సెట్ చేసుకోవచ్చు..

ఒకవేళ అరవై లక్షల కవరేజ్ కావాలనుకుంటే సమీపంలో ఉన్న ఎస్బిఐ శాఖను సంప్రదించవచ్చు. గ్రూపు పర్సనల్ ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఫారం పూర్తి చేసి ఇవ్వాలి. ఒకవేళ ఎస్బిఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా యోనో యాప్ ద్వారా కూడా ఆన్లైన్లో సులభంగా ఈ పాలసీ కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper