Homeఎంటర్టైన్మెంట్Mythri Movie Makers: మైత్రి మూవీస్ కు ఏమైంది.. ఆ చిన్న సినిమాతో ఇమేజ్ కి...

Mythri Movie Makers: మైత్రి మూవీస్ కు ఏమైంది.. ఆ చిన్న సినిమాతో ఇమేజ్ కి డ్యామేజ్..

Mythri Movie Makers: తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నది మైత్రి మూవీ మేకర్స్. దాదాపు పెద్ద హీరోలు అందరితోనూ ఈ సంస్థ సినిమాలు చేసింది. సినిమాలు చేస్తూనే ఉంది. ప్రస్తుతం ఈ సంస్థ చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రభాస్ తో ఫౌజీ, జూనియర్ ఎన్టీఆర్ తో డ్రాగన్.. జై హనుమాన్.. ఇంకా అనేక రకాల సినిమాలను నిర్మిస్తోంది. దాదాపు 1000 కోట్ల వరకు పెద్ద సినిమాల మీదనే ఇన్వెస్ట్ […]

Mythri Movie Makers: తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నది మైత్రి మూవీ మేకర్స్. దాదాపు పెద్ద హీరోలు అందరితోనూ ఈ సంస్థ సినిమాలు చేసింది. సినిమాలు చేస్తూనే ఉంది. ప్రస్తుతం ఈ సంస్థ చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రభాస్ తో ఫౌజీ, జూనియర్ ఎన్టీఆర్ తో డ్రాగన్.. జై హనుమాన్.. ఇంకా అనేక రకాల సినిమాలను నిర్మిస్తోంది. దాదాపు 1000 కోట్ల వరకు పెద్ద సినిమాల మీదనే ఇన్వెస్ట్ చేస్తోంది. ఇక చిన్న సినిమాలను కూడా నిర్మిస్తోంది. అటు పెద్ద సినిమాలు.. ఇటు చిన్న సినిమాల చేస్తూ తన ప్రొడక్షన్ పరిధిని మొత్తం విస్తరించుకుంటున్నది.

తాజాగా మైత్రి మూవీ మేకర్స్ నుంచి వచ్చిన చిన్న సినిమా మాత్రం సంస్థకు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేకపోయిందని విమర్శలు ఉన్నాయి. మౌళి హీరోగా వచ్చిన దొంగ నా కొడుకు సినిమా ఈ వారం థియేటర్లలో విడుదలైంది. విడుదలైన తర్వాత ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ప్లాప్ టాక్ నడుస్తోందని సమాచారం. కంటెంట్ పరంగా చూసుకుంటే సినిమాలో బలమైన అంశాలు లేవని.. కామెడీ సన్నివేశాలు కూడా ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోవడం లేదని తెలుస్తోంది. మేకింగ్ కూడా మైత్రి మూవీ మేకర్స్ స్టైల్లో లేదని సమాచారం. కేవలం ఒక స్థాయి లోకేషన్లు మాత్రమే ఇందులో కనిపిస్తున్నాయి. షార్ట్ ఫిలిం తరహాలోనే సినిమా ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇక సినిమాలో కొన్ని డైలాగులలో బూతులు ఎక్కువగా ఉండటం కూడా చర్చకు దారి తీస్తోంది. మైత్రి మూవీస్ కి క్లిన్ ఇమేజ్ ఉంది. అటువంటి సంస్థలు ఇటువంటి డైలాగులు ఉండడం పట్ల ఒక సెక్షన్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

దొంగ నా కొడుకు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా మైత్రి రవి కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇంకా చూడలేదని చెప్పారు చిన్న సినిమాని అయినప్పటికీ మైత్రి మూవీస్ పేరు మీద విడుదలవుతున్నప్పుడు అందులో ఉన్న కంటెంట్.. నిర్మాణానికి సంబంధించిన నాణ్యత మీద నిర్మాతలకు పూర్తి అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం డ్రాగన్.. ఫౌజీ, జై హనుమాన్ వంటి భారీ ప్రాజెక్టులతో మైత్రి మూవీస్ చాలా బిజీగా ఉంది. వందల కోట్ల పెట్టుబడులతో నిర్మాణం అవుతున్న ఈ సినిమాల మధ్య చిన్న సినిమాలను కూడా విడుదల చేస్తోంది. వాస్తవానికి సినిమాలు ఎలా ఉన్నా సరే.. మైత్రి పేరుతోనే ప్రేక్షకుల ముందుకు వస్తాయి. అలాంటప్పుడు కంటెంట్.. మేకింగ్.. డైలాగ్స్ విషయంలో ఒకే స్థాయి ప్రమాణాలను పాటించాల్సిన అవసరం ఉందని అభిమానులు చర్చించుకుంటున్నారు.

మొత్తానికి దొంగ నా కొడుకు సినిమా ఫలితం మైత్రి మూవీస్ చిన్న సినిమాల నిర్మాణ విధానంపై మరోసారి చర్చకు కారణమైంది. ఒకవేళ ఈ వారాంతంలో ప్రేక్షకుల స్పందనలో ఏమైనా మార్పు వస్తుందా.. సినిమా టాక్ మెరుగుపడుతుందా.. అనేవి చర్చనీయాంశంగా మారాయి. ఒకవేళ సినిమా టాక్ మారిపోతే.. వీకెండ్ లో కలెక్షన్లు పెరిగితే అప్పుడు.. దొంగ నా కొడుకు సేవ్ అవుతుంది. లేకపోతే మైత్రి మూవీస్ ఖాతాలో ఒక ఫ్లాప్ సినిమా పడుతుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper