Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: బంగారం లాంటి అవకాశాన్ని చేజార్జుకున్న అమన్.. ఇలా అయితే 'బిగ్...

Bigg Boss 10 Telugu: బంగారం లాంటి అవకాశాన్ని చేజార్జుకున్న అమన్.. ఇలా అయితే ‘బిగ్ బాస్ 10’ లో కష్టమే!

Bigg Boss 10 Telugu: ‘అగ్ని పరీక్ష 2’ షో లో తన మార్క్ పెర్ఫార్మన్స్ ని చూపించి , ఆడియన్స్ లో మంచి మార్కులు సంపాదించిన వారిలో ఒకరు అమన్ మసూద్. నేడు బిగ్ బాస్ 10 లోకి ఆడియన్స్ ఓటింగ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన మొట్టమొదటి సామాన్యుడిగా నిలిచాడు. అయితే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే ముందు హోస్ట్ నాగార్జున అమన్ కి ఒక టాస్క్ ఇస్తాడు. తన చేతిలో ఒక రెడ్ బాక్స్ […]

Bigg Boss 10 Telugu: ‘అగ్ని పరీక్ష 2’ షో లో తన మార్క్ పెర్ఫార్మన్స్ ని చూపించి , ఆడియన్స్ లో మంచి మార్కులు సంపాదించిన వారిలో ఒకరు అమన్ మసూద్. నేడు బిగ్ బాస్ 10 లోకి ఆడియన్స్ ఓటింగ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన మొట్టమొదటి సామాన్యుడిగా నిలిచాడు. అయితే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే ముందు హోస్ట్ నాగార్జున అమన్ కి ఒక టాస్క్ ఇస్తాడు. తన చేతిలో ఒక రెడ్ బాక్స్ పెట్టి , హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగానే ఎవరికో ఒకరికి దాన్ని అంటించాల్సిందిగా ఆదేశిస్తాడు నాగార్జున. కానీ అమన్ ఆ టాస్క్ చేయడం లో విఫలం అవుతాడు. దీంతో అమన్ పై ఫైర్ అయిన నాగార్జున గోల్డెన్ కీ టాస్క్ నుండి తప్పిస్తాడు. ఒకవేళ నాగార్జున ఇచ్చిన టాస్క్ ని అమన్ పూర్తి చేసుంటే అతని చేతిలో గోల్డెన్ కీ ఉండేది.

బంగారం లాంటి అవకాశాన్ని అమన్ ఉపయోగించుకోలేకపోయాడని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో అమన్ పెర్ఫార్మన్స్ ఎలా ఉండబోతుంది అనేది. ఇక బిగ్ బాస్ లైవ్ ని చూస్తుంటే , అమన్ అందరితో బాగా కలిసిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక షాలిని తో లవ్ ట్రాక్ ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఇదే కొనసాగిస్తే , వీళ్లిద్దరి పై తీవ్రమైన నెగెటివిటీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కానీ గత సీజన్ లో రీతూ చౌదరి , డిమోన్ పవన్ జంట ఆడియన్స్ లో మంచి మార్కులు కొట్టేశారు. అలా ఈ జంట నిలవనుందా?, లేదా వీళ్ళ రిలేషన్ ఆటకు నెగెటివ్ గా మారుతుందా అనేది చూడాలి. ప్రస్తుతానికి అయితే అమన్ కి ఇలాగే ఉంటే బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ కాలం కొనసాగడం కష్టమే అని అంటున్నారు నెటిజెన్స్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper