Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: మొదటి రోజే నాగార్జున ని నిరాశపర్చిన ఆటో రామ్ ప్రసాద్..'బిగ్...

Bigg Boss 10 Telugu: మొదటి రోజే నాగార్జున ని నిరాశపర్చిన ఆటో రామ్ ప్రసాద్..’బిగ్ బాస్ 10′ లో భవిష్యత్తు ఏంటో!

Bigg Boss 10 Telugu: కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ‘బిగ్ బాస్ 10’ ఈరోజు గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. గత సీజన్ లో లాగానే ఈ సీజన్ కూడా మంచి ఫైర్ మీదనే మొదలైంది అని చెప్పొచ్చు. మొదటి రోజే కంటెస్టెంట్స్ కి మంచి టాస్కులు నిర్వహించారు. ఇకపోతే ఈ సీజన్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన […]

Bigg Boss 10 Telugu: కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ‘బిగ్ బాస్ 10’ ఈరోజు గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. గత సీజన్ లో లాగానే ఈ సీజన్ కూడా మంచి ఫైర్ మీదనే మొదలైంది అని చెప్పొచ్చు. మొదటి రోజే కంటెస్టెంట్స్ కి మంచి టాస్కులు నిర్వహించారు. ఇకపోతే ఈ సీజన్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ లో ఒకరు ఆటో రామ్ ప్రసాద్. జబర్దస్త్ షో తో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు ఈయన. ఇతను చేసే కామెడీ , వేసే ఆటో పంచులు ఏ రేంజ్ లో ఉంటాయో గత 13 ఏళ్ళ నుండి మనమంతా చూస్తూనే ఉన్నాం. ఈ సీజన్ లోకి ఆటో రామ్ ప్రసాద్ వస్తున్నాడు అనే వార్త రాగానే ప్రేక్షకులు చాలా సంతోషించారు.

ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ కి తిరుగు ఉండదు అని. కానీ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ రోజు ఈయన ఎంటర్టైన్మెంట్ విషయం లో నాగార్జున ని సంతృప్తి పరచలేదు. ‘బిగ్ బాస్ 10’ స్టేజి మీదకు రాగానే నాగార్జున ఆటో రామ్ ప్రసాద్ కి ఒక టాస్క్ ని ఇస్తూ, హౌస్ లోపల ఉన్న కంటెస్టెంట్స్ మనోగతాన్ని చెప్తూ కామెడీ చెయ్యమని అంటాడు. అప్పుడు రామ్ ప్రసాద్ కామెడీ చేసే ప్రయత్నం చేసాడు కానీ, పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. దీంతో నాగార్జున నువ్వు ఎంటర్టైన్ చేయని కారణంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం లేదు , నేరుగా ఇంటికి వెళ్తున్నావు అని అంటాడు. ఆ తర్వాత రామ్ ప్రసాద్ బ్రతిమిలాడుకోగా , బిగ్ బాస్ హౌస్ లోకి పంపుతాడు నాగార్జున. అయితే హౌస్ లోకి వెళ్లిన తర్వాత మాత్రం రామ్ ప్రసాద్ తన విశ్వరూపం చూపించాడు అనే చెప్పాలి.

షాలిని, రామ్ ప్రసాద్ , చైత్ర లకు ఒక టాస్క్ ని నిర్వహించగా, రామ్ ప్రసాద్ అందరికంటే ఆ టాస్క్ ని వేగంగా పూర్తి చేసి గోల్డెన్ కీ ని సంపాదిస్తాడు. రామ్ ప్రసాద్ ఆట తీరుని చూసిన తర్వాత ఇతను మామూలోడు కాదు , బిగ్ బాస్ హౌస్ లో రాబోయే రోజుల్లో రఫ్ఫాడిస్తాడు అని విశ్లేషకులు సైతం తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రామ్ ప్రసాద్ వ్యక్తిత్వం కూడా ఆడియన్స్ కి నచ్చితే ఎంటెర్టైనెర్స్ క్యాటగిరీ లో టైటిల్ ని గెలుచుకునే మొట్టమొదటి కంటెస్టెంట్ గా రామ్ ప్రసాద్ నిలిచే అవకాశాలు ఉన్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper