Jaya Krishna Debut: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు… ఆయన చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరో స్టేటస్ ని అందుకున్నాడు. ప్రస్తుతం ‘వారణాసి’ సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను అలరించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక మహేష్ బాబు అన్నయ్య అయిన రమేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికి ఆయనకు అనుకున్న ఆధరణ దక్కలేదు. ప్రస్తుతం ఆయన మనందరితో పాటు లేడు కాబట్టి అతని కొడుకు అయిన జయ కృష్ణ ను ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను మహేష్ బాబు తీసుకున్నాడు. ముఖ్యంగా ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో హీరోగా లంచ్ అవుతున్న జయకృష్ణ విషయంలో మహేష్ బాబు చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. మొత్తానికైతే మహేష్ బాబు వల్లే అజయ్ భూపతి జయ కృష్ణ తో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. అలాగే ప్రతి విషయాన్ని కూడా మహేష్
బాబు కనుకుంటూ సినిమా ఎలా వస్తుంది ప్రేక్షకుడిని మెప్పించే విధంగా ఉంటుందా లేదా అనే విషయాల్లో కూడా చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు.
మరో రెండు రోజుల్లో ఈ సినిమా రిలీజ్ అవ్వనున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో మహేష్ బాబు కనిపించకపోయిన కూడా తను ఉన్న బిజీ షెడ్యూల్ ని బ్యాలెన్స్ చేసుకుంటూనే జయ కృష్ణ కోసం కొన్ని ప్రమోషనల్ వీడియోస్ నైతే రిలీజ్ చేస్తున్నాడు. రీసెంట్ గా మహేష్ బాబు శ్రీనివాస్ మంగాపురం మూవీ టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు.
మొత్తానికైతే తన అన్న లేకపోయినప్పటికి తన అన్న కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను మహేష్ బాబు తీసుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలోనే జయ కృష్ణ హీరోగా ఎలా రాణిస్తాడు. ప్రేక్షకులను మెప్పించగలుగుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక మరికొద్ది గంటల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమా మీద భారీ బజ్ క్రియేట్ అయింది.
దానికి తగ్గట్టుగానే అజయ్ భూపతి సైతం చాలా పకడ్బందీ ప్రణాళికతో ఈ సినిమాని తెరకెక్కించినట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందు ఆయన చేసిన ‘మంగళవారం’ సినిమా టెక్నికల్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంది. మరి మరోసారి ఆయన ఈ సినిమాతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…