Homeఎంటర్టైన్మెంట్Sun pictures: సన్ పిక్చర్స్ లో సినిమా చేస్తే BMW కారు గ్యారెంటీ

Sun pictures: సన్ పిక్చర్స్ లో సినిమా చేస్తే BMW కారు గ్యారెంటీ

Sun pictures: సన్ పిక్చర్స్ ఇటీవల కాలంలో భారీ సినిమాలను లైన్లో పెట్టింది. రాకా సినిమా సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ భారీగా ఖర్చు పెడుతున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా.. అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. రాకా సినిమా రావడానికి ఇంకా సమయం పడుతుంది. ఈ సినిమా కంటే ముందే సన్ పిక్చర్స్ కొన్ని సినిమాలను పూర్తి చేసింది. అందులో ఇటీవల డిసి అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో దర్శకుడు లోకేష్ […]

Sun pictures: సన్ పిక్చర్స్ ఇటీవల కాలంలో భారీ సినిమాలను లైన్లో పెట్టింది. రాకా సినిమా సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ భారీగా ఖర్చు పెడుతున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా.. అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు.

రాకా సినిమా రావడానికి ఇంకా సమయం పడుతుంది. ఈ సినిమా కంటే ముందే సన్ పిక్చర్స్ కొన్ని సినిమాలను పూర్తి చేసింది. అందులో ఇటీవల డిసి అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో దర్శకుడు లోకేష్ కనగరాజ్, వామిక గబ్బా నటించారు. ఈ సినిమాకు అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వం వహించారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తిరుగులేని స్థాయిలో విజయం సాధించింది. వందల కోట్ల వసూళ్లు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా భారీ విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకొని నిర్మాత కళానిధి మారన్ హీరో.. దర్శకుడు. సంగీత దర్శకుడికి బ్రహ్మాండమైన బహుమతులు ఇచ్చారు.

సన్ పిక్చర్స్ కార్పొరేట్ కార్యాలయంలో కళానిధి మారన్ అనిరుద్ రవిచంద్రన్.. లోకేష్.. అరుణ్ కు బీఎండబ్ల్యూ కార్లను బహుమతులుగా ఇచ్చారు. ఇలాంటి బహుమతులు ఇవ్వడం కళానిధి మారన్ కు ఇదే తొలిసారి కాదు. జైలర్ సినిమా భారీ విజయం సాధించిన నేపథ్యంలో రజనీకాంత్.. నెల్సన్.. అనిరుద్ కు కార్లను బహుమతులుగా ఇచ్చారు కళానిధి. అందుకే స్థాయిలో డి సి సినిమా విజయం సాధించిన నేపథ్యంలో మళ్లీ కార్లను బహుమతులుగా అందించారు. మొత్తానికి సన్ పిక్చర్స్ బ్యానర్ లో సినిమా చేస్తే కార్లు గ్యారంటీ అని కళానిధి మారన్ చెప్పకనే చెప్పారు.

ఇక తెలుగులో ఆ మధ్య సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ విజయాన్ని సాధించిన నేపథ్యంలో.. సక్సెస్ మీట్ లో అనిల్ రావిపూడి కి కారు ఇస్తారా అని ఒక విలేకరి అడిగితే.. దానికి దిల్ రాజు పరోక్షంగా సమాధానం చెప్పారు. అనిల్ ఏది అడిగితే అది ఇస్తామని చెప్పారు. కానీ అనిల్ ఏం అడిగారో.. దిల్ రాజు ఏమిచ్చారో తెలియదు గాని.. మొత్తానికి అయితే ఆ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. మొత్తానికి తమిళ చిత్ర పరిశ్రమలో భారీ విజయం సాధిస్తే కార్లు ఇచ్చే సంస్కృతికి కళానిధి బీజం వేశారు. మరి మిగతా నిర్మతాలు దీన్ని ఫాలో అవుతారా.. భారీ వసూళ్లు సాధిస్తే ఇలాగే బహుమతులు ఇస్తారా.. తెలుగులో మనం ఈ కల్చర్ చూడొచ్చా.. ఏమో దీనికి దిల్ రాజు, మైత్రి నిర్మాతలు, సితార వంశీనే సమాధానం చెప్పాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper