Homeఎంటర్టైన్మెంట్Allu Arjun Lokesh Kanagaraj Movie: అల్లు అర్జున్ కి కండిషన్స్ పెడుతున్న లోకేష్ కనకరాజ్...

Allu Arjun Lokesh Kanagaraj Movie: అల్లు అర్జున్ కి కండిషన్స్ పెడుతున్న లోకేష్ కనకరాజ్…

Allu Arjun Lokesh Kanagaraj Movie: గంగోత్రి సినిమాతో కెరియర్ ను మొదలుపెట్టిన అల్లు అర్జున్… ఆ తర్వాత చేసిన సినిమాతో స్టైలిష్ స్టార్ గా మారాడు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అనే బిరుదుని సంపాదించుకొని ముందుకు దూసుకెళుతున్నాడు. తనను మించిన నటుడు మరెవరు లేరనెంతల పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఆయన అట్లీ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఒక డిఫరెంట్ సినిమా చేయడానికి సన్నాహాలు […]

Allu Arjun Lokesh Kanagaraj Movie: గంగోత్రి సినిమాతో కెరియర్ ను మొదలుపెట్టిన అల్లు అర్జున్… ఆ తర్వాత చేసిన సినిమాతో స్టైలిష్ స్టార్ గా మారాడు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అనే బిరుదుని సంపాదించుకొని ముందుకు దూసుకెళుతున్నాడు. తనను మించిన నటుడు మరెవరు లేరనెంతల పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఆయన అట్లీ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఒక డిఫరెంట్ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. అయితే లోకేష్ కనకరాజ్ అల్లు అర్జున్ కి కొన్ని కండిషన్స్ అయితే పెట్టారట. తన సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు మరొక సినిమా షూటింగ్లో పాల్గొనకూడదని అలాగే తన సినిమాలో అల్లు అర్జున్ మెకోవర్ చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని, దానికంతటికీ ఆయన సహకరించాలని కూడా చెప్పారట. మొత్తానికైతే వీలైనంత తక్కువ రోజుల్లో తను సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. మాక్సిమం తను అనుకున్న సమయానికి సినిమాని పూర్తిచేయడానికి తనకి పూర్తిగా సహకరించాలని కూడా అల్లు అర్జున్ కి కండిషన్స్ పెట్టాడట.

వాటన్నింటికి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ బ్లైండ్ గా లోకేష్ కనకరాజునైతే నమ్ముతున్నాడు. కూలీ సినిమాతో ఆశించిన మేరకు విజయాన్ని సాధించినప్పటికి లోకేష్ కనకరాజు మీద ప్రతి ఒక్కరికి నమ్మకమైతే ఉంది.

తను డిఫరెంట్ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకు రాగలిగే కెపాసిటి ఉన్న దర్శకుడు..ఆయన కథల విషయంలోనే కొంతవరకు కన్ఫ్యూజ్ అవుతున్నాడు. కానీ అల్లు అర్జున్ కి చెప్పిన కథ అద్భుతంగా ఉందట.

దాంతోనే అల్లు అర్జున్ సైతం అతని మీద పూర్తి కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నాడు. ఈ సినిమాతో అల్లు అర్జున్ భారీ విజయాన్ని నమోదు చేసినట్లయితే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనను మించిన హీరోలు ఇంకెవరు ఉండరు అనేది మరోసారి ప్రూవ్ అవుతుంది… చూడాలి మరి ఈ సినిమా ఆయన రేంజ్ ను మారుస్తుందా లేదా అనేది..

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper