Homeఎంటర్టైన్మెంట్Chennai Love Story Twitter Talk: 'చెన్నై లవ్ స్టోరీ' ట్విటర్ టాక్ ఇదే..ఇలాంటి రెస్పాన్స్...

Chennai Love Story Twitter Talk: ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్విటర్ టాక్ ఇదే..ఇలాంటి రెస్పాన్స్ అసలు ఊహించలేదు..

Chennai Love Story Twitter Talk: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’ నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి హైప్ ఏర్పడింది. అందుకు ముఖ్య కారణం ‘బేబీ’ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించడంతో పాటు , ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అనే ఫీలింగ్ ని ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ లో కలిగించింది కాబట్టి. […]

Chennai Love Story Twitter Talk: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’ నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి హైప్ ఏర్పడింది. అందుకు ముఖ్య కారణం ‘బేబీ’ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించడంతో పాటు , ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అనే ఫీలింగ్ ని ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ లో కలిగించింది కాబట్టి. నిర్మాత SKN కూడా ఈ చిత్రం కల్ట్ క్లాసిక్ గా మిగిలిపోతుందని కామెంట్స్ చేయడం తో కచ్చితంగా ఈ సూపర్ హిట్ అవుతుందని అనుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. నిన్న రాత్రి ప్రీమియర్ షోస్ తో ఈ చిత్రం మొదలైంది. కానీ ప్రీమియర్ షోస్ నుండి వచ్చిన టాక్ కి , నేడు రెగ్యులర్ షోస్ నుండి వచ్చిన టాక్ కి చాలా తేడా ఉంది.

ప్రీమియర్ షోస్ నుండి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది , మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అంటూ తెగ ట్వీట్స్ వేశారు. కానీ రెగ్యులర్ షోస్ నుండి పూర్తి భిన్నంగా ఉంది. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది కానీ , సెకండ్ హాఫ్ చాలా చెత్తగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాన్సెప్ట్ మాత్రం చాలా కొత్తగా ఉందని , కానీ డైరెక్టర్ దాన్ని గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కించడం లో విఫలం అయ్యారని అంటున్నారు నెటిజెన్స్. సినిమా ఆరంభం తో పాటు, ఫస్ట్ హాఫ్ చాలా బాగా కుదిరిందని , మంచి మ్యూజిక్ తో , ఆసక్తికరమైన ఇంటర్వెల్ ట్విస్ట్ తో ఫస్ట్ హాఫ్ ముగిసిందని , కానీ సెకండ్ హాఫ్ మాత్రం పూర్తిగా డిజాస్టర్ తరహా లో ఉందని అంటున్నారు. చూస్తున్నంతసేపు సన్నివేశాలను బాగా ల్యాగ్ చేసినట్టు అనిపించింది అట.

పైగా ఇలాంటి లవ్ స్టోరీ సినిమాలకు ఎమోషనల్ కనెక్ట్ ఉండాలి. కానీ అది మిస్ అయ్యిందట. డైరెక్టర్ స్క్రీన్ ప్లే ని మెలోడ్రామా వైపు డ్రైవ్ చేయడం తో , సినిమాని చూసి బయటకు వచ్చే ప్రేక్షకులకు చాలా ఓవర్ గా చూపించారని, సహజత్వానికి చాలా దూరం గా ఈ సినిమా ఉందనే ఫీలింగ్ కలుగుతుందట. కిరణ్ అబ్బవరం , గౌరీ ప్రియా నటన చాలా బాగుందని , మణిశర్మ మ్యూజిక్ కూడా చాలా హృద్యం గా ఉందని , కానీ ఇవేమి ఈ సినిమా ని కాపాడలేకపోయాయని అంటున్నారు నెటిజెన్స్. రన్ టైం కూడా ఈ సినిమాని దెబ్బ తీసిందని , ఓవరాల్ గా బిలో యావరేజ్ సినిమా అని అంటున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper