Naga Chaitanya: ఈ నెల 26వ తారీఖున అక్కినేని నాగార్జున రెండవ కుమారుడు అక్కినేని అఖిల్, జైనబ్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అభిమానులకు స్వీట్ సర్ప్రైజ్ ఇస్తూ నాగార్జున సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియచేయడంతో అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. గతంలో అఖిల్ శ్రీయ భూపాల్ అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య, సమంత నిశ్చితార్థం జరిగిన కొద్దిరోజులకే వీళ్లిద్దరి నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ కొన్ని అనుకోని సంఘటనల కారణంగా ఈ నిశ్చితార్థం రద్దు అయ్యింది. మూడేళ్ళ క్రితం నాగ చైతన్య, సమంత కూడా విడాకులు తీసుకోవడంతో, నాగార్జున మళ్ళీ తన కొడుకులిద్దరి పెళ్లీళ్లను ఒకే సమయంలో చేయాలనీ నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా ముందుగా ఆయన నాగ చైతన్య , శోభితల నిశ్చితార్థం ఆగస్టు నెలలో జరిపించాడు. ఇప్పుడు రెండు రోజుల క్రితమే అఖిల్, జైనబ్ ల నిశ్చితార్థం జరిపించాడు.
ఇది ఇలా ఉండగా నాగ చైతన్య, శోభితల వివాహం వచ్చే నెల 4వ తేదీన అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగబోతుంది. ఇదే రోజున అఖిల్, జైనబ్ వివాహం కూడా జరగబోతుందని గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియా లో భారీ ఎత్తున ప్రచారం జరగబోతుంది. ఈ ప్రచారాన్ని నాగార్జున దృష్టికి తీసుకొని పోగా, అందులో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చాడు నాగార్జున. అఖిల్ పెళ్లి వచ్చే ఏడాది జరిపించాలని అనుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని స్వయంగా నాగ చైతన్య తో చెప్పించాడు నాగార్జున. జనవరి లేదా ఫిబ్రవరి నెలలో వీళ్లిద్దరి వివాహం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ రెండు నెలల్లోనే ఎక్కువగా శుభ ముహుర్తాలు ఉంటాయి. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ‘నా కొడుకులిద్దరి విషయంలో చాలా నాకు చాలా సంతోషంగా ఉంది. అఖిల్, జైనబ్ నిశ్చితార్థం కూడా ఇటీవలే జరిపించాము. జైనబ్ చాలా మంచి అమ్మాయి. మా ఇంట్లో వాళ్ళతో కూడా బాగా కలిసిపోయింది. చాలా కాలం తర్వాత అఖిల్ కూడా సంతోషంగా ఉన్నాడు’ అంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున.
ఇక అఖిల్ కెరీర్ విషయానికి వస్తే, ఆయన గత చిత్రం ‘ఏజెంట్’ భారీ అంచనాల నడుమ విడుదలై ఘోరమైన డిజాస్టర్ గా నిల్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద అక్కినేని అభిమానులు విడుదలకు ముందు భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ వాళ్ళ అంచనాలను కనీస స్థాయిలో కూడా అందుకోలేకపోయింది ఈ చిత్రం. మరో పక్క అఖిల్ ఇండస్ట్రీ లోకి వచ్చి ఇన్నేళ్లు అయినా, ఇప్పటి వరకు క్లీన్ హిట్ ని అందుకోలేకపోయాడు. ఇది అఖిల్ ని మానసికంగా చాలా కృంగదీసింది. అందుకే ఈసారి అభిమానుల ముందుకు వస్తే, సూపర్ హిట్ సినిమాతోనే వస్తానని, అప్పటి వరకు అభిమానులకు నా ముఖం చూపించను అని బలమైన నిర్ణయం తీసుకున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున చెప్పుకొచ్చాడు. మరి అఖిల్ కి కావాల్సిన హిట్ పెళ్లి తర్వాత అయినా దక్కుతుందో లేదో చూడాలి.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Akkineni naga chaitanya who made sensational comments on akhils marriage shocking reaction on fake news what really happened
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com