Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీBest Phone for Students : ఏఐ ఫీచర్లు, సెల్ఫీ కెమెరా.. జెన్ జెడ్ విద్యార్థులకు...

Best Phone for Students : ఏఐ ఫీచర్లు, సెల్ఫీ కెమెరా.. జెన్ జెడ్ విద్యార్థులకు ఇంతకుమించిన ఫోన్ లేదు

Best Phone for Students : ప్రస్తుత కాలంలో విద్యార్థులు ఎక్కువ శాతం మొబైల్ వినియోగిస్తున్నారు. తమ కెరీర్ ను డెవలప్ చేసుకోవడంతో పాటు సరదాగా ఉండేందుకు గేమ్స్ కోసం మొబైల్ కొనుగోలు చేస్తున్నారు. అయితే వీరి కోసం ప్రత్యేకంగా ఐక్యూ కంపెనీ ప్రత్యేకంగా మొబైల్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇందులో విద్యార్థులకు ఉపయోగపడే ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. మరి ఈ మొబైల్ ధర ఎంత? ప్రముఖ మొబై్ కంపెనీ iQOOనుంచి కొత్తగా Z11 5G అనే […]

Best Phone for Students : ప్రస్తుత కాలంలో విద్యార్థులు ఎక్కువ శాతం మొబైల్ వినియోగిస్తున్నారు. తమ కెరీర్ ను డెవలప్ చేసుకోవడంతో పాటు సరదాగా ఉండేందుకు గేమ్స్ కోసం మొబైల్ కొనుగోలు చేస్తున్నారు. అయితే వీరి కోసం ప్రత్యేకంగా ఐక్యూ కంపెనీ ప్రత్యేకంగా మొబైల్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇందులో విద్యార్థులకు ఉపయోగపడే ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. మరి ఈ మొబైల్ ధర ఎంత?

ప్రముఖ మొబై్ కంపెనీ iQOOనుంచి కొత్తగా Z11 5G అనే మొబైల్ భారత మార్కెట్లోకి వచ్చింది. ఇందులో 6.83 అంగుళాల ఎమోల్డ్ డిస్ ప్లే ఉంది. ఇది 144 హెచ్ జడ్ రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. దీంతో విద్యార్థులు ఎక్కువగా కోరుకునే వీడియోలు, గేమింగ్స్ ప్లే చేసుకోవచ్చు. అలాగే దీని స్క్రోలింగ్ కూడా స్మూత్ గా ఉంటుంది. ఈ డిస్ ప్లే లో పీడీఎఫ్ బుక్స్ చదివినా పెద్దగా ఇబ్బంది అనిపించదు.

ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో ప్రాసెసర్ ను అమర్చారు. ఇలాంటి ప్రాసెసర్ ఉన్న భారత్ లోకి వచ్చిన తొలిస్మార్ట్ ఫోన్ గా పేర్కొంటున్నారు. అలాగే ఇందులో ఉన్న చిప్ సెట్ తో రోజూవారీ పనులను సులభంగా పూర్తి చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ ఏఐ వంటి పనులను కూడా ఇది పూర్తి చేస్తుంది. ఇందులో ఉన్న 12 జీబీ ర్యామ్ తో పాటు 256 జీబీ స్టోరేజ్ తో ఏఐ ఆధారిత పనులను విజయవంతంగా పూర్తి చేస్తుంది.

ఈ మొబైల్ లో బ్యాటరీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇందులో 7,050 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఈ బ్యాటరీకి 44 వాట్ ఛార్జర్ సపోర్ట్ చేయనుంది. దీంతో ఎక్కువ సేపు ఆన్ లైన్ క్లాసులు వినేందుకు ఉపయోగపడుతుంది. అలాగే సోషల్ మీడియా తో పాటు బ్రౌజింగ్ చేయడానికి ఇది బెస్ట్ ఎంపిక అని అంటున్నారు. ఇక ఫొటోగ్రఫీ కోసం ఇందులో 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాను ఉంచారు. దీనితో పాటు 2 ఎంపీ సెకండరీ కెమెరా ఉండనుంది అలాగే సెల్ఫీ కోసం 32 ఎంపీ కెమెరాను అందించారు.

అయితే ఈ ఫోన్ లో ప్రత్యేకంగా విద్యార్థుల కోసం ఏఐ ఫీచర్లను అందించారు. డాక్యుమెంట్లను టెక్ట్స్ గా మార్చేందుకు ఈ ఫోన్లో రకరకాల ఫీచర్లను అందించారు. దీంతో రీసెర్చ్ చేసే విద్యార్థులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఈ మొబైల్ ధర రూ.34,900 గా నిర్ణయించారు. కొన్ని ఆఫర్లు డిస్కౌంట్ల ద్వారా కొనుగోలు చేస్తే మరింత తక్కువకు వచ్చే అవకాశం ఉంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper