Chiranjeevi: తెలుగు చలన చిత్ర పరిశ్రమ కి కమర్షియల్ సినిమాల విషయం లో సరికొత్త నిర్వచనం తెలిపిన ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి. అప్పటి వరకు ఒకే మూసలో వెళ్తున్న టాలీవుడ్ సినిమా రూపురేఖలు మార్చేసిన లెజెండ్ ఆయన. ఎన్టీఆర్ , ఏఎన్నార్, శోభన్ బాబు , సూపర్ స్టార్ కృష్ణ వంటి దిగ్గజాలు ఏలుతున్న సమయంలో ఇండస్ట్రీ లోకి వచ్చిన మెగాస్టార్, ఆ తర్వాత ఏ స్థాయికి ఎదిగాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘ఖైదీ ‘ సినిమాతో మొదలైన ఆయన సునామీ , ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. నేటి తరం స్టార్ హీరోలతో బాక్స్ ఆఫీస్ వద్ద ఆయన పోటీ పడే తీరుని చూస్తుంటే , మళ్లీ ఇలాంటోడు పుట్టడం కష్టమే , అలాంటి శిఖరం ఇండస్ట్రీ లో ఉన్న సమయం లో , ఆయన్ని మనమంతా వెండితెర మీద చూసి ఆనందిస్తున్నందుకు అదృష్టం అనుకోవాలి.
చిరంజీవి పరిపూర్ణమైన నటుడు ఇండియా లోనే ఎవ్వరూ ఉండరు అనడంలో అతిశయోక్తి కాదేమో. లెజండరీ దర్శకుడు బాలచందర్ ఒక సందర్భంలో చిరంజీవి గురించి మాట్లాడుతూ , రజినీకాంత్, కమల్ హాసన్ లను కలిపితే చిరంజీవి అని అంటాడు. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. మెగాస్టార్ ప్రేక్షకుల చేత కడుపుబ్బా నవ్వించగలడు, అదే విధంగా గుక్క తిప్పకుండా ఏడిపించగలడు కూడా. తన డ్యాన్స్ తో కోట్లాది మంది సినీ ప్రియులను మంత్రం ముగ్దులను చేయగలడు, ఫైట్స్ తో, యాక్షన్ సన్నివేశలతో రోమాలను నిక్కపొడుచుకునేలా కూడా చేయగలడు. 71 ఏళ్ళ వయస్సు లో కూడా డ్యాన్స్ వేస్తూ , నేటి తరం కుర్రాళ్లను కూడా అలరిస్తూ, వందల కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే హీరో ని ప్రపంచం లో ఒక్కరిని చూపించండి చూద్దాం అంటూ విశ్లేషకులు సైతం మెగాస్టార్ గురించి చెప్తుంటారు. రజినీకాంత్ 75 ఏళ్ళ వయస్సులో కూడా వందల కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడుతున్నాడు కదా అని మీరు అనుకోవచ్చు.
కానీ ఆయన వయస్సుకి తగ్గ పాత్రలు చేస్తూ , ఆ స్థాయి వసూళ్లను రాబడుతున్నాడు. కానీ చిరంజీవి అలా కాదు , మనం చిన్నప్పుడు ఆయన్ని ఎలా అయితే చూస్తూ పెరిగామో , అదే చిరంజీవి ఇప్పటికీ వెండితెర పై కనిపిస్తున్నాడు. అప్పట్లో ఎలాంటి స్టెప్పులు వేసేవాడో , ఇప్పటికీ అదే రేంజ్ స్టెప్పులు వేస్తున్నాడు. ఆరోజుల్లో వీరోచితంగా ఎలా అయితే ఫైటింగ్స్ చేసేవాడో , ఇప్పటికీ అదే రేంజ్ లో ఫైటింగ్స్ చేస్తున్నాడు, ఇలా ఎవరున్నారు చెప్పండి?, అందుకే ప్రపంచం లో ఎవరికీ సాధ్యం అవ్వని అరుదైన రికార్డ్స్ మెగాస్టార్ కి మాత్రమే సొంతం అని అంటున్నారు విశ్లేషకులు. రాబోయే రోజుల్లో ఆయన ‘కాకా’ చిత్రం తో ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తాడో చూడాలి.