Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్స్ అన్నిటిని బాగా గమనిస్తే , పలు సంఘటనల కారణంగా వివాదాస్పదంగా మారిన అనేక మంది కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి తీసుకొస్తున్నారు. ఉదాహరణకు గత సీజన్ ని తీసుకోండి. రీతూ చౌదరి , దువ్వాడ మాధురి వంటి వారు ఏ రేంజ్ లో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీళ్లపై నెటిజెన్స్ లో విపరీతమైన నెగెటివిటీ ఉండేది. వీళ్ళు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి తనదైన మార్కు వేసుకున్నారు. గత సీజన్ లోనే శ్రేష్టి వర్మ అనే అమ్మాయి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈమె జానీ మాస్టర్ పై కేసు వేసి ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక సీజన్ 8 లో అయితే శేఖర్ బాషా కూడా వివాదాల ద్వారా వైరల్ అవ్వడం తో ఆయన్ని కూడా తీసుకున్నారు.
ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. ఇప్పుడు వీళ్ళ లిస్ట్ లోకి మరో ఇద్దరు కంటెస్టెంట్స్ కూడా చేరబోతున్నారా ? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే గత రెండు , మూడు రోజులుగా సోషల్ మీడియా లో వైరల్ గా మారిన సెలబ్రిటీలు మాధురి రాథోడ్ , ఈశ్వర్ సాయి. వీళ్లిద్దరు ఒకే రూమ్ లో ఉండగా , ఈశ్వర్ సాయి సతీమణి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని , ఆ తర్వాత ఆమె క్రియేట్ చేసిన సీన్ ఎలాంటిదో మీరంతా చూసే ఉంటారు. ఈ వీడియో సోషల్ మీడియా లో ఎవ్వరూ ఊహించని రేంజ్ లో వైరల్ అయ్యింది. అంతే కాదు , ఈ సంఘటన ఇన్ స్టాగ్రామ్ లో పెద్ద మేము మెటీరియల్ గా మారిపోయింది. నెటిజెన్స్ వీళ్ళని అనుకరిస్తూ , వివిధ సందర్భలపై రీల్స్ చేస్తున్నారు. అవి చూసేందుకు చాలా ఫన్నీ గా అనిపించాయి.
అయితే వీళ్ళిద్దరిని ఇప్పుడు ‘బిగ్ బాస్ 10’ టీం సంప్రదించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సోషల్ మీడియా లో బలంగా వినిపిస్తున్న వార్త. గత సీజన్ మొదలయ్యే ముందే అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అందుకే ఆమెని వైల్డ్ కార్డు కంటెన్స్టెంట్ గా తీసుకొచ్చారు. అలా మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి లను కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. మరి ‘ఉప్పల్ బాలు’ లాంటి వాళ్ళని లోపలకు పంపించి సమాజానికి మేము ఎలాంటి మెసేజ్ ఇవ్వాలి అంటూ మాట్లాడిన నవదీప్ , ఒకవేళ ఈ వివాదాస్పద జంటని బిగ్ బాస్ కి పంపిస్తే ఎలాంటి రెస్పాన్స్ ఇస్తాడో చూడాలి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.