AE Nookaraju Case : ఏపీలో పిఠాపురం ప్రాంతంలో ఏఈగా పనిచేస్తున్న నూకరాజు కుటుంబం ఇటీవల సామూహికంగా ఆత్మహత్య చేసుకుంది. నూకరాజు, ఆయన భార్య మీన, కుమార్తె సౌజన్య, మనవడు రియాన్శ్ రెడ్డి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే వీరిలో రియాన్స్ రెడ్డి బతికి బట్టకట్టాడు. ఇటీవల మీడియా ముందుకు వచ్చి సంచలన విషయాలను వెల్లడించాడు.
నూకరాజు ఆత్మహత్య చేసుకోవడానికి కంటే ముందు లెటర్ రాశారు. అందులో సాధిక్ అనే వ్యక్తి తమను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు.. తన కూతుర్ని ఏ విధంగా చిత్రవధకు గురి చేస్తున్నాడు అనే విషయాలను పూస గుచ్చినట్టు వివరించాడు. సాదిక్ సౌజన్య కుమారుడు రియాన్స్ రెడ్డికి రైఫిల్ షూటింగ్ నేర్పేవాడు. రియాన్స్ రెడ్డి ద్వారా సౌజన్య వ్యక్తిగత విషయాలను తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఆమెకు దగ్గర అయ్యాడు. ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడింది. వారిద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు ఆదృశ్యాలను రికార్డ్ చేశాడు. వాటి ద్వారా ఆమెను బెదిరించడం మొదలు పెట్టాడు. ఈ లోగానే సౌజన్య భర్తకు అనారోగ్యం సో కింది. అంతకుముందే సౌజన్య వ్యవహారం భర్తకు తెలియడంతో అతడు మందలించాడు. దీంతో సాదిక్ అతడిని తీవ్రంగా కొట్టాడు. సౌజన్య భర్త అనారోగ్యానికి గురైనప్పుడు పరామర్శించడానికి సాదిక్ ఆసుపత్రికి వెళ్ళాడు. అంతేకాదు హైదరాబాద్ నుంచి తెప్పించిన ఒక ప్రమాదకరమైన రసాయనాన్ని సౌజన్య భర్తకు పండ్ల రసంలో కలిపి ఇచ్చే విధంగా ఏర్పాటు చేశాడు. అది తాగిన సౌజన్య భర్త చనిపోయాడు.
అతని మరణాన్ని సహజమైనదని అనుకున్నారు. కానీ దాని వెనుక సాదిక్ కుట్ర ఉందని తేలింది. నూకరాజు కుటుంబం రాసిన లేఖలను ఫోరెన్సిక్ విశ్లేషణకు అధికారులు పంపించారు. మరోవైపు సాధిక్ ను పోలీసులు వేరే రాష్ట్రంలో తలదాచుకుంటే పట్టుకున్నారు. అతడిని కస్టడీలోకి తీసుకున్నారు. అంతేకాదు రియాన్స్ రెడ్డి చెప్పిన వివరాల ఆధారంగా ఈ కేసును మరింత లోతుగా పోలీసులు తవ్వుతున్నారు. సాధిక్ సౌజన్య మీద మతం మారాలని ఒత్తిడి తీసుకొచ్చాడని.. తన మతానికి సంబంధించిన గ్రంథాలు పుస్తకాలు చదవాలని ఇబ్బంది పెట్టాడని.. సౌజన్య కుమారుడిని ఉగ్రవాదులకు అమ్మేస్తానని బెదిరించే వాడని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై పూర్తి నిజాలు పోలీసుల విచారణ తర్వాత వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.