Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ లో అవసరానికి మించి కంటెంట్ ఇస్తున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది త్రిగున్ మాత్రమే. ఇంతటి దూల కంటెస్టెంట్ ని బిగ్ బాస్ హిస్టరీ లోనే మేము చూడలేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా రోహిత్ ఇతనిపై చేస్తున్న టార్గెట్టింగ్ చూస్తే , ఎలాంటి వారికైనా రక్తం మరిగిపోతాది. రోహిత్ ని ద్వేషించే వాళ్లకు కూడా, ఏంటి ఇతను ఇంత దారుణంగా ఉన్నాడు అని అనిపించక తప్పదు. ఆ స్థాయిలో రోహిత్ ని మానసికంగా టార్చర్ కి గురయ్యేలా చేస్తున్నాడు. రోహిత్ కాబట్టి తట్టుకుంటున్నాడు కానీ , వేరే ఏ కంటెస్టెంట్ అయినా ఫిజికల్ దాడి చేసి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేసేవారు అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై రేపు నాగార్జున త్రిగున్ కి స్ట్రాంగ్ కోటింగ్ ఇస్తాడా లేదా వదిలేస్తాడా అనేది చూడాలి.
ఇదంతా పక్కన పెడితే రోహిత్ ఇప్పుడు ఈ స్థాయిలో షైన్ అవ్వడానికి ప్రధాన కారణం అభిజిత్. అగ్ని పరీక్ష 2 లో మిగిలిన ఇద్దరు జడ్జీలు నువ్వు బిగ్ బాస్ కి పనికిరావు అని రెడ్ ఫ్లాగ్స్ ఇవ్వగా, ఒక్క అభిజిత్ మాత్రమే గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చి హోల్డ్ లో పెట్టాడు. ఆ తర్వాత రోహిత్ క్రియేట్ చేసిన హిస్టరీ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఓటింగ్ కంటెస్టెంట్స్ అందరి కంటే భారీ మార్జిన్ తో కొనసాగుతున్నాడు. అలాంటి రోహిత్ కి ఇప్పుడు అభిజిత్ సపోర్ట్ మరింత తోడైనట్టుగా అనిపిస్తోంది. రీసెంట్ గా ఆయన తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన రెండు స్టోరీస్ ని చూస్తుంటే , ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో రోహిత్ పరిస్థితి ని గుర్తు చేసేలా అనిపిస్తోంది.
శ్రీరాముడు , హనుమంతుడిని అధిరోహించినప్పుడు , రావణాసురుడు బాణాల వర్షం కురిపించడం తో , హనుమంతుడి శరీరం మొత్తం గాయాలై రక్తం సెలయేటి లాగా ప్రవహిస్తోంది , దీన్ని గమనించిన శ్రీరాముడు కాస్త రుద్రుడు అయ్యాడు అంటూ ఒక వీడియో ని స్టోరీ గా పెట్టాడు. అంటే దీని అర్థం త్రిగున్ రోహిత్ పై నాన్ స్టాప్ గా టార్గెట్ చేసి టార్చర్ చేస్తున్నాడు, అది చూసి నాకు చాలా కోపం వచ్చింది అనే అర్థాన్ని తెచ్చేలా ఉంది. అదే విధంగా అన్ని ఆగమనిస్తున్నాను , సరైన సమయం వచ్చినప్పుడు వేట మొదలు అవ్వుద్ది అంటూ మరో స్టోరీ పెట్టాడు. వీటి అర్థం మొత్తం ప్రస్తుతం హౌస్ లో రోహిత్ , త్రిగున్ మధ్య జరుగుతున్న యుద్దాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగానే అనిపించింది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.