Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్స్ లో ప్రేక్షకులకు మోస్ట్ ఫెవరెట్ కంటెస్టెంట్ ఎవరూ అని అడిగితే, అత్యధిక శాతం మంది అభిజిత్ పేరు చెప్తారు. ఎందుకంటే ఇతర కంటెస్టెంట్స్ లాగా హంగామా చేయలేదు, సైలెంట్ గా ఎదుటి మంచి ఎత్తులు పై ఎత్తులను పసిగట్టి , వాళ్లకు దిమ్మ తిరిగే రేంజ్ లో కౌంటర్లు ఇవ్వడమే కాకుండా, తన బుర్రతో స్మార్ట్ గేమ్ ఆడుతూ అందరి మతులను పోగొట్టేలా చేసాడు. అందుకే ఎన్ని బిగ్ బాస్ సీజన్స్ వచ్చినా , ఇప్పటికీ అభిజిత్ ని మర్చిపోలేకపోతున్నారు ఆడియన్స్. అయితే అభిజిత్ చాలా రిజర్వ్ గా ఉండే వ్యక్తి అనే సంగతి మన అందరికీ తెలిసిందే. తన తోటి కంటెస్టెంట్స్ ని ఇప్పటి వరకు ఆయన కలవలేదు అంటేనే అర్థం చేసుకోవచ్చు , అభిజిత్ మనస్తత్వం ఎలాంటిదో.
‘బిగ్ బాస్ 4’ తర్వాత చాలా కాలం వరకు అభిజిత్ బయట ఎక్కడా కనిపించలేదు. టీవీ షోస్ లో కూడా పాల్గొనేందుకు పెద్దగా ఆసక్తి చూపించడు. అలాంటి అభిజిత్ ‘అగ్ని పరీక్ష ‘ రెండు సీజన్స్ లో జడ్జి గా వ్యవహరించడమే కాకుండా, ఒక కంటెస్టెంట్ కి ప్రతీ రోజు తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పరోక్షంగా సపోర్టు ఇస్తూ వస్తున్నాడు. ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు, రోహిత్. ‘అగ్ని పరీక్ష 2’ ఆడిషన్స్ లో రోహిత్ ని తక్కువ అంచనా వేసి , ఎలిమినేట్ చేయడానికి నవదీప్ , బిందు మాధవి లు చూస్తే , అభిజిత్ మాత్రం రోహిత్ కి గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చి హోల్డ్ లో పెట్టాడు. అలా హోల్డ్ లో పెట్టినందుకు రోహిత్ నేడు ఏ స్థాయిలో ఉన్నాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సెలబ్రిటీ కంటెస్టెంట్స్ హౌస్ లో పట్టపగలే చుక్కలు చూపిస్తే , అందరికంటే కనీవినీ ఎరుగని రేంజ్ భారీ ఓటింగ్ తో ముందుకు దూసుకుపోతున్నాడు.
మరో రెండు మూడు సరైన ఎపిసోడ్స్ పడితే మాత్రం ‘బిగ్ బాస్ 10’ టైటిల్ విన్నర్ గా రోహిత్ ఫిక్స్ అయిపోయినట్టే అనుకోవచ్చు. పైగా నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున తో పాటు , హౌస్ మేట్స్ అందరూ రోహిత్ ని టార్గెట్ చేసి ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం తో , అతని పై జనాల్లో మరింత క్రేజ్ , సానుభూతి ఏర్పడింది. ఆ కారణం చేత రోహిత్ ఓటింగ్ ఇప్పుడు 70 నుండి 80 శాతం కి ఎగబాకింది అని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే రోహిత్ కోసం ఒక ఎపిసోడ్ కి అభిజిత్ బిగ్ బాస్ హౌస్ లోకి వస్తాడట. ఇప్పటి వరకు ‘బిగ్ బాస్’ సీజన్స్ టైటిల్ విన్నర్స్ గా నిల్చిన ప్రతీ ఒక్కరు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి కొన్ని టాస్కుల్లో వీళ్ళతో పాటు పాల్గొంటారట. అలా అభిజిత్ కూడా హౌస్ లోకి అడుగుపెట్టి , టాస్కులు నిర్వహించి , రోహిత్ కి మంచి బూస్ట్ ఇచ్చే పాజిటివ్ ఎనర్జీ ని నింపి వెళ్తాడని టాక్. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.