Homeట్రెండింగ్ న్యూస్Raj Kumar : ప్రశాంతంగా చ*చ్చాడు.. కాల్చి చం*పా*ల్సింది సర్..రాజ్ కుమార్ సోదరుల వీడియో వైరల్

Raj Kumar : ప్రశాంతంగా చ*చ్చాడు.. కాల్చి చం*పా*ల్సింది సర్..రాజ్ కుమార్ సోదరుల వీడియో వైరల్

Raj Kumar : సైకో కి*ల్ల*ర్ రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. గడ్డి మందు తాగి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. అతడు సోమవారం ఉదయమే చనిపోయినట్టు తెలుస్తోంది. నిర్మానుష్యమైన ప్రాంతంలో అతడి మృతదేహం కనిపించింది. ఈ నేపథ్యంలో డయల్ 100 కు ఫోన్ రావడంతో.. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆధారాలను పోల్చుకొని అతడు రాజ్ కుమార్ అని తేల్చారు. రాజ్ కుమార్ పక్కనే గడ్డి మందు ఉంది. అతడి మృతదేహం పక్కన […]

Raj Kumar : సైకో కి*ల్ల*ర్ రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. గడ్డి మందు తాగి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. అతడు సోమవారం ఉదయమే చనిపోయినట్టు తెలుస్తోంది. నిర్మానుష్యమైన ప్రాంతంలో అతడి మృతదేహం కనిపించింది. ఈ నేపథ్యంలో డయల్ 100 కు ఫోన్ రావడంతో.. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆధారాలను పోల్చుకొని అతడు రాజ్ కుమార్ అని తేల్చారు.

రాజ్ కుమార్ పక్కనే గడ్డి మందు ఉంది. అతడి మృతదేహం పక్కన ఫోన్ కూడా లభించింది. దీంతో పోలీసులు ఆ ఫోన్ పరిశీలించి చూశారు. అందులో కీలకమైన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఆరుగురిని హ*త్య చేయడానికి అంటే ముందు రాజ్ కుమార్ ఒక వీడియో తీసినట్టు తెలుస్తోంది..” నా డబ్బులు మొత్తం గుంజుకున్నారు. అప్పుల పాలయ్యాను. ఇప్పుడేమో కేసు పెడుతున్నారు. నా పిల్లలకు ఆస్తి లేకుండా చేశారు. భూమి అమ్ముకున్నాను. ఆ అమ్మాయి మాయలో పడి మొత్తం పోగొట్టుకున్నానని” రాజ్ కుమార్ మాటల ద్వారా తెలుస్తోంది.

రాజ్ కుమార్ చనిపోయిన తర్వాత ఈ విషయాన్ని పోలీసులు అతని కుటుంబ సభ్యులు చెప్పారు. దీంతో వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. రాజ్ కుమార్ మృతదేహాన్ని చూసి బోరున ఏడ్చారు. ఈ నేపథ్యంలో రాజు కుమార్ వల్ల వారు పడుతున్న ఇబ్బందిని బయటికి చెప్పుకున్నారు..”సార్ వీడి వల్ల మా పరువు మొత్తం పోయింది. ఆరుగురిని చంపేశాడు. వారి కుటుంబాలు మొత్తం కన్నీటితో విలపిస్తున్నాయి. ఆ అమ్మాయి కుటుంబంలో ఒక మానసిక వికలాంగురాలు ఉంది. ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆమెకు ఎవరు అండగా ఉంటారు.. ఆమెను ఎవరు చూసుకుంటారు. వీడు చేసిన దారుణం వల్ల తల ఎత్తుకోకుండా ఉండిపోతున్నాం. నరకం చూస్తున్నాం. ఇంతకంటే శిక్ష ఏముంటుంది.. అసలు బలవంతంగా వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. కాల్చి కాల్చి వాడిని చంపాల్సింది సార్. అప్పుడే చనిపోయిన వారి ఆత్మలు శాంతించేవని” రాజ్ కుమార్ సోదరులు చెప్పారు. రాజ్ కుమార్ మృతదేహానికి పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు. ఇంకా ఈ కేసులో అనే అంశాల మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper