Homeక్రైమ్‌60 Tolas Gold Theft: 60 తులాల బంగారం కొట్టేశారు.. అక్కడే నేపాలీ గ్యాంగ్ దొరికిపోయింది..

60 Tolas Gold Theft: 60 తులాల బంగారం కొట్టేశారు.. అక్కడే నేపాలీ గ్యాంగ్ దొరికిపోయింది..

60 Tolas Gold Theft: ఈ రోజుల్లో బంగారం ధర విపరీతంగా పెరిగిపోయింది. ఇంకా పెరుగుతూనే ఉంది. బంగారం ధర విలువ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. చివరికి పోలీసులకు దొరికిపోతున్నారు. అటువంటిదే ఈ సంఘటన. ఇటీవల హైదరాబాద్ నగరంలో నేపాలి గ్యాంగ్ ఆగడాలు పెరిగిపోతున్నాయి. వరుసగా నేపాల్ ముఠా సభ్యులు దారుణాలకు పాల్పడుతున్నారు. ఇంట్లో పని మనుషులుగా చేరి ఘోరాలు చేస్తున్నారు. చివరికి పోలీసులకు దొరికిపోతున్నారు.. ముఖ్యంగా నేపాల్ ముఠా ఇలా […]

60 Tolas Gold Theft: ఈ రోజుల్లో బంగారం ధర విపరీతంగా పెరిగిపోయింది. ఇంకా పెరుగుతూనే ఉంది. బంగారం ధర విలువ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. చివరికి పోలీసులకు దొరికిపోతున్నారు. అటువంటిదే ఈ సంఘటన.

ఇటీవల హైదరాబాద్ నగరంలో నేపాలి గ్యాంగ్ ఆగడాలు పెరిగిపోతున్నాయి. వరుసగా నేపాల్ ముఠా సభ్యులు దారుణాలకు పాల్పడుతున్నారు. ఇంట్లో పని మనుషులుగా చేరి ఘోరాలు చేస్తున్నారు. చివరికి పోలీసులకు దొరికిపోతున్నారు.. ముఖ్యంగా నేపాల్ ముఠా ఇలా వ్యవహరించడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కౌకూర్ లో ఓ దారుణం జరిగింది. ఏకంగా 60 తులాల బంగారం చోరీ అయింది. ఈ ఘటనలో నేపాలి గ్యాంగ్ హస్తము ఉన్నట్టు తేలింది. చివరికి పోలీసులు అనేక రకాలుగా ఆధారాలు సేకరించి.. నేపాలి గ్యాంగ్ ను పట్టుకున్నారు.

కౌకూర్ లో విశ్రాంత ప్రొఫెసర్ మురళీమోహన్, విజయలక్ష్మి దంపతులు నివసిస్తున్నారు. వీరి పిల్లలు వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. మురళీమోహన్, విజయలక్ష్మి మాత్రమే వారి ఇంట్లో ఉంటున్నారు. వారి ఇంట్లో పని మనుషులుగా చేరారు నేపాల్ దేశానికి చెందిన మీనా, రాజేష్.

ఈనెల తన పుట్టినరోజు అని మమత చెప్పింది. తమ కుటుంబ సభ్యులను పిలిచి వేడుక జరుపుకుంటామని మురళీమోహన్ దంపతులకు చెప్పింది. దానికి వారు ఓకే చెప్పారు. మమత తమ దేశానికి చెందిన రాజేష్, సబీనా, సామ్రాట్, బిస్వాల్, చాంగ్, కమల్, శంకర్ ను తను పని చేస్తున్న ఇంటికి పిలిపించుకుంది. దొంగతనానికి వారితో కలిసి స్కెచ్ వేసింది. 11వ తేదీన మమతా గ్యాంగ్ మురళీమోహన్ ఇంటికి వచ్చింది. ఆరోజు రాత్రి మమత పుట్టినరోజు వేడుకలు జరిపారు. అనంతరం మురళీమోహన్, విజయలక్ష్మి దంపతులను తాళ్లతో కట్టివేశారు. ఇంట్లో ఉన్న అరవై తులాల బంగారం, 15 కిలోల వెండి, మూడు వేల డాలర్ల నగదు దోపిడీ చేశారు. అనంతరం ఆటలో కొంతమంది.. స్కూటర్లో కొంతమంది పరారై యాప్రాల్ వెళ్ళిపోయారు. అక్కడ ఆ వాహనాలను వదిలిపెట్టి.. నేరుగా సికింద్రాబాద్ వెళ్ళిపోయారు. దేశం దాటి వెళ్లిపోయేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. వి నేపథ్యంలో గతంలో మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దొంగతనం జరిగింది. ఆ కేసులో మమతకు, రాజేష్ కు ప్రళయం ఉన్నట్టు తేరింది. మురళీమోహన్ ఇంట్లో దొంగతనం జరిగినప్పుడు పోలీసులు సేకరించిన వేలిముద్రలు.. గతంలో మొయినాబాద్ కేసులో పోలీసులు సేకరించిన వేలిముద్రలు సరిపోయాయి. దీంతో పోలీసులు మమత గ్యాంగ్ మీద పోలీసులు తీవ్రంగా నిఘా పెట్టారు. వారిని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారి దగ్గర నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగులో కొంతమంది పరారీలో ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని పేర్కొంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper