Delhi Crime News: ఇతర దేశాల వాళ్లకు శృంగారం అనేది ఒక రొటీన్ కార్యక్రమం. అందువల్లే దానిని వారు శరీర జీవక్రియ లాగానే చూస్తుంటారు. అందువల్లే లైంగిక సంబంధాల విషయంలో ఇష్టా రాజ్యాన్ని ప్రవర్తిస్తుంటారు. సంబంధాలను ఇష్టానుసారంగా ఏర్పరచుకుంటారు. పెళ్లి విషయంలో ఒక కట్టుబాటుతో ఉండరు. ప్రేమ విషయంలోనూ ఒక నిబంధన పాటించరు. ఒకరకంగా చెప్పాలంటే ఆకలి, నిద్ర ఎలాగో శృంగారం కూడా అలాంటిదేనని భావిస్తుంటారు. సమయానికి శృంగారంలో పాల్గొనకపోతే శరీర జీవ క్రియలను ఇబ్బంది ఏర్పడుతుందని భావించి.. అప్పటికప్పుడు పని కానిస్తుంటారు. అంత తప్ప అందులో ప్రేమను, ఆప్యాయతను, గాఢమైన పరిష్వంగనను ఆస్వాదించలేరు. అందువల్లే పాశ్చాత్య దేశాలలో శృంగారం అనేది ఒక భౌతిక క్రియ లాగానే కనిపిస్తుంది. రెండు దేహాల మధ్య జరిగే ప్రక్రియ లాగానే ఉంటుంది.
మనదేశంలో శృంగారం అనేది ఒక దైవకార్యం. భారతీయులు శృంగారాన్ని భావోద్వేగాలను నియంత్రించే కార్యక్రమం లాగా.. శారీరక అనుబంధాన్ని పెంపొందించే కార్యం లాగా భావిస్తుంటారు. శృంగారాన్ని అత్యంత పవిత్రమైన కార్యక్రమం లాగా చెబుతుంటారు. ఇది కేవలం భార్యాభర్తలకు మాత్రమే పరిమితమైన బంధాలు లాగా చూస్తుంటారు. అందువల్లే శృంగారానికి సంబంధించిన విషయాలను భారతీయులు బహిరంగంగా మాట్లాడేందుకు ఇష్టపడరు. కేవలం నాలుగు గోడల మధ్య, అది కూడా భార్య భర్తలు మాత్రమే చర్చించుకుంటారు. అయితే శృంగారం పవిత్ర కార్యక్రమంగా ఒకప్పుడు మనదేశంలో వెలుగొందేది. ఇప్పుడు రకరకాల సంస్కృతుల ప్రభావం వల్ల మనదేశంలో కూడా దాని పరమార్ధాన్ని కోల్పోతోంది. మనుషులు శృంగారాన్ని దైవ కార్యం లాగా కాకుండా.. కేవలం శరీర కోరికలను తృప్తిపరుచుకునే అవసరం లాగా చూస్తున్నారు. అందువల్లే వివాహేతర సంబంధాలను పెట్టుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా ఘోరాలు మనదేశంలో పెరిగిపోయాయి.. ముఖ్యంగా దాంపత్య జీవితంలో సంతృప్తి అనేది లభించినప్పుడు.. దంపతులు ఇతర సంబంధా లవైపు వెళ్తున్నారు. గతంలో వివాహేతర సంబంధాలను ఏర్పరచుకునే వారిలో మగవారు అధికంగా ఉండేవారు. ఇప్పుడు మగవారితో పాటు ఆడవారు కూడా ఉంటున్నారు. పైగా వివాహేతర సంబంధాల విషయంలో ఆడవారు ఏమాత్రం తగ్గడం లేదు. అవసరం అనుకుంటే దాంపత్య బంధాన్ని వదులుకోవడానికి కూడా వెనుకడం లేదు. ఈ క్రమంలోనే తమ వివాహేతర సంబంధాలకు అడ్డుగా ఉన్నారని భర్తలను కూడా అంతం చేస్తున్నారు. ప్రియుళ్లతో కలిసి సరస సల్లాపాలలో మునిగితేలుతున్నారు.
Also Read: డ్రైవింగ్ చేస్తుండగా గుండెపోటు.. ఆ డ్రైవర్ ముందు చూపునకు హ్యాట్సాఫ్!
తాజాగా ఓ భార్య తన భర్తను అత్యంత దారుణంగా హతమార్చింది. లైంగికంగా తనను స్వర్గపు అంచులలోకి తీసుకువెళ్లడం లేదని.. సంతృప్తి పరచడం లేదని ఆమె వాపోయింది. దీంతో తట్టుకోలేక తన భర్తను అంతం చేసింది.. ఈనెల 20న ఢిల్లీలో మహమ్మద్ షాహిద్ అనే వ్యక్తి తన భార్య చేతిలో కత్తిపోటుకు గురయ్యాడు. ఆ తర్వాత అక్కడికక్కడే చనిపోయాడు. షాహిద్ భార్య అతని మృతదేహాన్ని ఢిల్లీలోని నిహాల్ విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్ళింది. విచక్షణ కోల్పోయిన తన భర్త తనను తానే పొడుచుకున్నాడు అని చెప్పింది. అయితే అప్పటికే అతడు చనిపోయాడు. అనుమానం వచ్చిన ఆసుపత్రి వర్గాలు పోలీసులకు సమాచారం అందించాయి. ఆస్పత్రికి వచ్చిన పోలీసులు షాహిద్ మృతదేహాన్ని పరిశీలించారు. అతని శరీరంలో ఛాతి భాగంలో గాయాలు కనిపించాయి. దీంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేసి.. అతడు ఆత్మహత్య చేసుకోలేదని నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత షాహిద్ భార్య ఫోన్ స్వాధీనం చేసుకొని.. దానిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. అయితే అందులో అల్యూమినియం పాస్పైడ్ వంటి అత్యంత విషపూరితమైన పదార్థాలు ఉపయోగించి ఒక మనిషిని ఎలా చంపాలి.. అనే అంశాన్ని ఆమె వెతికినట్టు తేలింది. పోలీసులు ఆమెను విచారించి.. నిజం ఒప్పుకునేలా చేశారు.
” నేను ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్నాను. నా భర్త నన్ను సుఖ పెట్టడం లేదు. నాకు తగ్గట్టుగా శృంగారం చేయడం లేదు. పైగా శృంగారంలో పాల్గొనకుండా నన్ను దూరం పెడుతున్నాడు. ఇదే విషయంపై నేను ఆయనను అడిగాను. దీంతో అతడు ఆవేశపూరితంగా మాట్లాడాడు. నన్ను ఎందుకు సుఖ పెట్టడం లేదని అడిగితే అనకూడని మాట అన్నాడు. దీంతో ఆవేశం తట్టుకోలేక కత్తితో నేను అతడి చాతి మీద పొడిచానని” షాహిద్ భార్య వెల్లడించింది.. మరోవైపు ఆమె వాట్సాప్ లో ఎవరితోని చాట్ చేసింది.. అయితే దానిని డిలీట్ చేసింది. అయితే ఆమె ఎవరితో చాట్ చేసిందో తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.