Latest Crime News: మొన్నటి వరకు భర్తలపై భార్యల దురాగతాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు భర్తల దురాగతాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకోవడం సంచలనం కలిగిస్తోంది..
హైదరాబాద్ నగరంలో నాలుగు నెలల గర్భవతి అయిన తన భార్య భర్త మహేందర్ అత్యంత దారుణంగా చంపాడు. చంపడం మాత్రమే కాదు ముక్కలు ముక్కలుగా అందరికీ గురుమూర్తి ఉదంతాన్ని గుర్తు చేశాడు. తన సతీమణి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి.. ప్లాస్టిక్ సంచలలో వేసి.. మూసీ నదిలో పడేశాడు. నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి లో కూడా ఇటువంటి దారుణమే జరిగింది. అనుమానంతో భార్య శ్రావణి భర్త శ్రీశైలం అత్యంత దారుణంగా హత్య చేసి.. పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లక్ష్మీప్రసన్న అనే మహిళను ఆమె భర్త రెండు సంవత్సరాలుగా కడుపు మార్చి చంపేశాడు. వరంగల్ జిల్లాలో తన భార్య గౌతమిని భర్త ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు.
Also Read: లేడీ డాన్ అరుణకు ఫైనాన్స్ చేసింది ఆ వ్యక్తే.. ఏపీలో ప్రకంపనలు
ఈ దారుణాలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. వాస్తవానికి అనుమానాలు సంసారాలలో ఎంతటి దారుణాలకు కారణమవుతున్నాయో నిరూపిస్తున్నాయి..”అనుమానం అనేది మంచిది కాదు. ఒక్కసారి అది మొదలైతే మనుషులను మనుషుల మాదిరిగా ఉంచదు. ఇటీవల కాలంలో చోటుచేసుకున్న ఘటనలు పరిశీలిస్తే అనుమానం వల్ల కుటుంబాలు ఎలా నాశనం అవుతున్నాయి అర్థం అవుతుంది. ఇటువంటి కేసుల్లో ఎన్ని రకాలుగా శిక్షణ విధించినప్పటికీ మనుషులు మారడం లేదు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు కూడా తమ జీవిత భాగస్వాములపై అనుమానం పెంచుకొని అత్యంత దారుణాలకు పాల్పడుతున్నారు. దీనివల్ల సమాజంలో ఒక రకమైన అశాంతి ఏర్పడుతోంది. సాధ్యమైనంత వరకు ఇటువంటి అనుమాన ప్రవృత్తి ఉన్నవారు పెళ్లి చేసుకోకపోవడమే మంచిది. మానసిక ఉన్మాదుల మాదిరిగా ప్రవర్తిస్తూ.. ఇలా దారుణాలకు పాల్పడుతూ.. పెళ్లి అంటేనే భయపడే పరిస్థితిని కల్పిస్తున్నారు. ఇటువంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి వారికి మానసికంగా కౌన్సిలింగ్ ఇవ్వాలి. లేకపోతే మరిన్ని అనర్ధాలు జరుగుతాయని” మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు.