Homeక్రైమ్‌Amrita Chauhan case : ఘీ రోస్ట్..21 ఏళ్ల అమ్మాయి క్రూరం.. దేశాన్నే షేక్ చేసింది..

Amrita Chauhan case : ఘీ రోస్ట్..21 ఏళ్ల అమ్మాయి క్రూరం.. దేశాన్నే షేక్ చేసింది..

Amrita Chauhan case : అది ఢిల్లీలోని గాంధీ విహార్ ప్రాంతం.. అక్కడ రాంకేష్ మీనా అనే యువకుడు యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. ఒకరోజు అతడు ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిపోయి చనిపోయాడు. అతడి మరణాన్ని అందరూ కూడా సహజమే అని అనుకున్నారు. పోలీసులకు మొదట్లో అనుమానం రాలేదు. ఆ తర్వాత ఒక చిన్న విషయంలో పోలీసులకు సందేహం ఏర్పడింది. అది కాస్త ఒక దారుణమని.. దీని వెనక పకడ్బందీ ప్రణాళిక ఉందని తేలింది. రాంకేష్ […]

Amrita Chauhan case : అది ఢిల్లీలోని గాంధీ విహార్ ప్రాంతం.. అక్కడ రాంకేష్ మీనా అనే యువకుడు యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. ఒకరోజు అతడు ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిపోయి చనిపోయాడు. అతడి మరణాన్ని అందరూ కూడా సహజమే అని అనుకున్నారు. పోలీసులకు మొదట్లో అనుమానం రాలేదు. ఆ తర్వాత ఒక చిన్న విషయంలో పోలీసులకు సందేహం ఏర్పడింది. అది కాస్త ఒక దారుణమని.. దీని వెనక పకడ్బందీ ప్రణాళిక ఉందని తేలింది.

రాంకేష్ వయసు 32 సంవత్సరాలు. ఇతడు ఢిల్లీలోని గాంధీ విహార్ ప్రాంతంలో ఉంటున్నాడు. కొంతకాలంగా యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ అతని జీవితంలోకి అమృతా చౌహన్ అనే అమ్మాయి వచ్చింది. ఆమె వయసు 21 సంవత్సరాలు. ఇద్దరి మధ్య దాదాపు 13 సంవత్సరాల వ్యత్యాసం ఉంది. ఇద్దరికీ లంకె కుదిరింది. ఆ తర్వాత రామ్ కేష్ ప్రిపరేషన్ అటకెక్కింది. ఇద్దరి మధ్య యవ్వారం జోరుగా సాగడం మొదలుపెట్టింది. వారిద్దరు ఒక గది తీసుకొని లీవ్ ఇన్ రిలేషన్ మొదలుపెట్టారు.

మొదట్లో వీరిద్దరి మధ్య అంత బాగానే జరిగింది. అమృతకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలు రామ్ కేష్ వద్ద ఉన్నాయి. అయితే వాటిని తొలగించాలని పదేపదే కోరింది. దీంతో అతడు వాటిని తొలగించలేదు. గతంలో అమృత సుమిత్ అనే యువకుడితో ప్రేమ వ్యవహారం కొనసాగించింది. అప్పుడు వారిద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియోలు తీశారు.. ఆ తర్వాత అతడి నుంచి దూరంగా వచ్చింది. తనకి దగ్గరైన తర్వాత అమృత గురించి రాంకేష్ ఆరా తీశాడు. ఆమె గురించి వివరాలు తెలిసిన తర్వాత.. సుమిత్ నుంచి ఆ వీడియోలు సేకరించాడు. ఆ వీడియోలు అతని ఫోన్లో ఉండడంతో తొలగించాలని అమృత పదేపదే కోరింది. దానికి రాంకేష్ ఒప్పుకోలేదు.

ఈ నేపథ్యంలో అమృత సుమిత్ కు మళ్లీ టచ్లోకి వెళ్ళింది. జరిగిన విషయం చెప్పింది. ప్రవేట్ వీడియోలను తొలగించడం లేదని.. ఇబ్బంది పెడుతున్నాడని అతడితో వాపోయింది. ఈ క్రమంలోనే అతడిని అంతం చేయాలని ఇద్దరు బలంగా అనుకున్నారు.. పగడ్బందీ ప్రణాళిక రూపొందించారు.. సందీప్ అనే వ్యక్తి సాయం తీసుకున్న సుమిత్.. మాస్కులు ధరించి రాంకేష్ ఉంటున్న ఇంట్లోకి వచ్చారు. అతడి గొంతు నులిమి చంపేశారు..

అమృత ఫోరెన్సిక్ సైన్స్ చదివిన విద్యార్థి కావడంతో.. పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ప్రణాళిక రూపొందించింది. రాంకేష్ మృతదేహంపై నెయ్యి పోసింది. ఆ తర్వాత వైన్ చల్లింది. అనంతరం లిక్కర్ కూడా పోసింది. ఆ తర్వాత గ్యాస్ లీక్ చేసి.. అగ్ని ప్రమాదం జరిగినట్టుగా దృశ్యాన్ని చిత్రీకరించింది.. అయితే మొదట్లో ఇదంతా కూడా ప్రమాదమని పోలీసులు భావించారు. సీసీ కెమెరాలు చూస్తే అందులో ఉన్న దృశ్యాలు పోలీసులకు అనుమానం కలిగించాయి. ఆ తర్వాత వారు లోతుగా దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. కీలక విషయాలను మొత్తం రాబట్టారు. తదపు 813 పేజీల చార్జిషీట్ కోర్టులో దాఖలు చేశారు. అమృత.. సుమిత్.. సందీప్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు..

అమృత వ్యవహార శైలి నచ్చకపోవడంతో కుటుంబ సభ్యులు గత ఏడాదిగా ఆమెకు దూరంగా ఉంటున్నారు. ఆమె ఇంత దారుణానికి పాల్పడడంతో తల ఎత్తుకోలేకపోతున్నారు. ఆమె జైల్లో ఉన్నప్పటికీ ఇంతవరకు ఒక్కసారి కూడా చూసేందుకు వారు వెళ్లలేదు. మరోవైపు ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం మాత్రమే కాదు.. సహజీవనం చేసేవారిలో వణుకు పుట్టించింది. ఈ దారుణాన్ని ఢిల్లీ పోలీసులు ఘీ రోస్ట్ అని పేర్కొంటున్నారు. ఇటువంటి దారుణాలకు పాల్పడేవారు ఒక పేరుతో ఘోరాలు చేస్తంటారని.. సహజీవనం చేసేవాళ్లకు ఈ ఘటన ఓ గుణపాఠమని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper