Homeబిజినెస్Oppo Find X10: Oppo Find X10 లీక్.. ప్రోఫెషనల్ ఫొటోగ్రఫీ వారికి బెస్ట్ ఫోన్..

Oppo Find X10: Oppo Find X10 లీక్.. ప్రోఫెషనల్ ఫొటోగ్రఫీ వారికి బెస్ట్ ఫోన్..

Oppo Find X10: భారతదేశంలో Oppo మొబైల్స్ కు ఆదరణ ఎక్కువగా ఉంది. ఈ కంపెనీ నుంచి మార్కెట్లోకి ఇప్పటికే ఎన్నో మోడల్స్ వచ్చాయి. అయితే లేటేస్ట్ గా దీని నుంచి Oppo Find X10 ఫ్లాగ్‌షిప్ ఫోన్ రాబోతుంది. ఈ మొబైల్ గురంచి అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఈ స్మార్ట్‌ఫోన్ కు సంబంధించి కొన్ని లీక్స్ ఆసక్తికరంగా ఉంటున్నాయి. 2026 చివరలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్న ఈ మొబైల్ డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ, ప్రాసెసర్‌ ఎలా […]

Oppo Find X10: భారతదేశంలో Oppo మొబైల్స్ కు ఆదరణ ఎక్కువగా ఉంది. ఈ కంపెనీ నుంచి మార్కెట్లోకి ఇప్పటికే ఎన్నో మోడల్స్ వచ్చాయి. అయితే లేటేస్ట్ గా దీని నుంచి Oppo Find X10 ఫ్లాగ్‌షిప్ ఫోన్ రాబోతుంది. ఈ మొబైల్ గురంచి అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఈ స్మార్ట్‌ఫోన్ కు సంబంధించి కొన్ని లీక్స్ ఆసక్తికరంగా ఉంటున్నాయి. 2026 చివరలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్న ఈ మొబైల్ డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ, ప్రాసెసర్‌ ఎలా ఉంబడోతున్నాయో చూద్దాం..

డిస్‌ప్లే:
ఒప్పో ఫైండ్ X10లో 6.59 అంగుళాల ఫ్లాట్ OLED డిస్‌ప్లే ఉండనుంది. ఇది 1.5K రిజల్యూషన్‌తో వస్తుందని లీక్స్ చెబుతున్నాయి. అలాగే 120Hz లేదా 165Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేసి.. HDR10+ ఫీచర్లతో ప్రీమియం విజువల్ అనుభవాన్ని అందిస్తుంది.దీంతో మూవీస్ చూసేవారికి ఇది అనుగుణంగా ఉండనుంది. అంతేకాకుండా ఎలాంటి వాతావరణంలోనైనా అద్భుతమైన కాంతిని అందజేస్తుంది.

కెమెరా:
ఒప్పో ఫైండ్ X10లో డ్యూయల్ కెమెరాలు ఉండనున్నాయి. 200MP రియర్ మెయిన్ కెమెరా, 200MP పెరిస్కోప్ టెలిఫోటోతో ఉండవచ్చు. జూమ్ లో-లైట్ పెర్ఫార్మెన్స్‌లో రిజల్యూషన్ తగ్గకుండా నాణ్యమైన ఫొటోలను అందిస్తుంది. 50MP అల్ట్రా-వైడ్ లెన్స్ కూడా ఉండే అవకాశం. మొత్తంగా హై-రిజల్యూషన్ తో ఫొటోలను తీసుకోవచ్చు. ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ వారికి ఈ కెమెరా అద్భుతంగా పనిచేస్తుంది.

బ్యాటరీ:
ఒప్పో కొత్త మొబైల్ లో 8000 mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీతో భారీ అప్‌గ్రేడ్ ఇవ్వనుంది. ఈ బ్యాటరీ 80W వైర్డ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేయనుంది. గతంలో మార్కట్లోకి వచ్చిన ఫైండ్ X9 (7025mAh) కంటే ఎక్కువ డే లాంగ్ ను అందిస్తుంది.

ప్రాసెసర్:
వేగమైన పనితీరును కోరుకునేవారికి ఈ ఫోన్ ఉపయోగపడనుంది. ఎందుకంటే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9500+ లేదా 9600 చిప్‌సెట్‌తో పవర్ అవుతుంది. LPDDR6 RAM, UFS 5.0 స్టోరేజ్‌తో హై పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. AI కెపాబిలిటీస్ ఉండడంతో గేమింగ్, మల్టీటాస్కింగ్‌ లో వర్క్ చేసేవారికి ఫుల్ సపోర్ట్ ఇవ్వనుంది.

ధర:
భారత్‌లో 12GB+256GB వేరియంట్ ఒప్పో ఫైండ్ ఘ 10 మొబైల్ ధర రూ. 79,990ఉండనుంది. ప్రో మోడల్ రూ.1,00,000కు పైగానే ఉండే అవకాశం ఉంది. ప్రీమియంల ఫోన్ల కోసం ఎదురుచూసేవారికి ఇది బెస్ట్ ఎంపిక అని అంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper