Oppo Find X10 : తక్కువ ధరల్లో ప్రీమియం ఫోన్లను అందించే సంస్థలలో ఒప్పో ఒకటి. పేరుకు చైనా కంపెనీ అయినప్పటికీ.. భారతీయ వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా ఫోన్లను రూపొందించడంలో ఒప్పో సంస్థ విజయవంతమైంది.
ఒప్పో సంస్థ తాజాగా ఒప్పో ఫైండ్ ఎక్స్ 10 ప్రో మాక్స్, ఒప్పో ఫైండ్ ఎక్స్ వన్ అనే మోడల్స్ ను అందుబాటులో తీసుకొచ్చింది.
Oppo find X10 promax
కెమెరా.. దీని వెనక భాగంలో మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలు (main, ultra wide, periscope, tele photo) ఉన్నాయి. ప్రపంచంలోనే ఇలాంటి కెమెరా సెట్ అప్ తో వస్తున్న మొదటి ఫోన్ దాదాపు ఇదే కావచ్చు.
బ్యాటరీ.. ఇందులో ఎవరూ ఊహించని విధంగా 8000 ఎం ఏ హెచ్ భారీ బ్యాటరీ.. అలాగే అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్ ఉంది
ప్రాసెసర్.. శక్తివంతమైన మీడియా టెక్ డైమన్ సిటీ 9600 ప్రో ప్రాసెసర్ ఇందులో ఉంది.
డిస్ ప్లే.. 6.78 ఇంచుల టూ కే ఎల్ టి పి ఓ ఓఎల్ఈడి డిస్ ప్లే ఇందులో ఉంది.
మనదేశంలో ఈ కంపెనీ ఒప్పో ఫైండ్ ఎక్స్ టెన్ ప్రో పేరుతో విడుదలవుతోంది.
Oppo find x 1
ఈ మోడల్ ఫోన్లను 2018 లోనే కంపెనీ విడుదల చేసింది. ఆరోజుల్లోనే ఎక్కడ నాచ్ లేని సరికొత్త డిజైన్.. ఫోన్ లోపల నుంచి పైకి వచ్చే మెకానికల్ పాప్ అప్ కెమెరా సెటప్ తో ఈ ఫోన్ రూపొందించారు. అయితే ఇప్పుడు దీనికి సరికొత్త మార్పులను ఒప్పో తీసుకొచ్చింది.
ఇందులో స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్.. 6.42 ఇంచుల అమో లెడ్ డిస్ ప్లే.. 3730 ఎంఎహెచ్ బ్యాటరీ ఇందులో ఉన్నాయి.
ఫైండ్ ఎక్స్ అనేది ఒప్పో సిరీస్ ప్రారంభించిన మొదటి ఐకానిక్ ఫోన్. ఫైండ్ ఎక్స్ 10 ప్రో మాక్స్ అనేది వచ్చే రోజుల్లో కెమెరా, టెక్నాలజీలో సరికొత్త రికార్డులను కచ్చితంగా సృష్టించబోతుంది.
Oppo find X10 Pro Max ధర మనదేశంలో 1,29,990 నుంచి 1,50,000 వరకు లభించవచ్చు.
Oppo find X1 2018లో 59,990 ధరకు విక్రయించారు. ప్రస్తుతం ఈ మోడల్ ధర 34,990 కి లభిస్తోంది.