spot_img
Homeబిజినెస్Elon Musk Net Worth: టెస్లా అధినేత మస్క్ కు 15 లక్షల కోట్లు.. ఇంత...

Elon Musk Net Worth: టెస్లా అధినేత మస్క్ కు 15 లక్షల కోట్లు.. ఇంత డబ్బు ఎలా.. దాని వెనుక కథేంటి..

Elon Musk Net Worth: ఈ ప్రపంచంలో బడా కార్పొరేట్ వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వ్యాపారం ద్వారా.. వివిధ ఉత్పత్తుల ద్వారా వారు ఆ స్థాయిలో డబ్బు సంపాదించారు. ఒకప్పుడు ప్రపంచంలోనే అతి సంపన్నమైన వ్యక్తిగా బిల్గేట్స్ ఉండేవారు. ఆ తర్వాత ఆయన స్థానాన్ని క్రమక్రమంగా టెస్లా అధినేత మస్క్ ఆక్రమించడం మొదలుపెట్టారు. ఇప్పుడు బిల్ గేట్స్ కనీసం ఆలోచించలేని విధంగా మస్క్ డబ్బు సంపాదించారు.

టెస్లా కంపెనీ ద్వారా మస్క్ ప్రపంచ కార్ల తయారీలో సరికొత్త శకానికి నాంది పలికారు. ఎలక్ట్రానిక్ వెహికల్స్ రంగంలో తిరుగులేని సంస్థగా తన కంపెనీని నిర్మించారు. ప్రపంచ ఆటోమొబైల్ రాజధానిగా జర్మనీ ఉంటుంది.. కానీ జర్మనీ కంపెనీలకు కూడా అంతుచిక్కని టెక్నాలజీతో టెస్లా కార్లను రూపొందించారు మస్క్.. టెస్లా మాత్రమే కాదు ట్విట్టర్, స్పేస్ ఎక్స్.. ఇంకా రకరకాల వ్యాపారాలలో మస్క్ అడుగుపెట్టారు. అన్ని రంగాలలో కూడా ఆయనకు అంచనాలకు మించిన లాభాలు వస్తున్నాయి. అందువల్లే ప్రపంచ కుబేరుడిగా కొనసాగుతున్నారు మస్క్.

మస్క్ ఏం చేసినా సరే సంచలనం గానే ఉంటుంది. చివరికి తన వేతనం విషయంలో కూడా మస్క్ ఎప్పటికప్పుడు రికార్డులు బద్దలు కొడుతూనే ఉంటారు. 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆయన ఏకంగా 158 బిలియన్ డాలర్లు తీసుకుంటున్నట్టు టెస్లా వేతన ప్యాకేజీని ప్రకటించింది. రెగ్యులేటరీ ఫైరింగ్ లో కంపెనీ ఈ విషయాన్ని బయటపెట్టింది. అయితే ఇంత స్థాయిలో డబ్బు మస్క్ ఖాతాలో పడుతుందా.. అసలు పడదు.

కంపెనీ పనితీరు ఆధారంగా వచ్చే పారితోషికం విలువ దాదాపు 132 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. ఒకవేళ పనితీరు విషయంలో కంపెనీ అనుకున్న లక్ష్యాలు మొత్తం పూర్తయితే ఈ నగదు మొత్తం మస్క్ కు దక్కుతుంది. ప్యాకేజీలో భాగంగా మిగతా 26 బిలియన్ డాలర్లు టెస్లా బోర్డు ఆమోదించిన మద్యం తన అవార్డు రూపంలో వస్తుంది. గత ఏడాది కూడా మస్క్ కు టెస్లా కంపెనీ ఏకంగా ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీని ఇచ్చేసింది. అయితే ఆ ప్యాకేజీ పూర్తిగా ఈక్విటీ అవార్డుల గ్రాంట్ ల రూపంలో ఇస్తామని టెస్లా వెల్లడించింది.. ప్రస్తుతం టెస్లా స్టాక్ విలువ స్థిరంగా కొనసాగుతోంది. ఈ సంవత్సరంలో టెస్లా స్టాక్ విలువ పెరిగితే.. నిర్వహణపరంగా కంపెనీ అంచనా వేసిన లాభాలు గనుక వస్తే.. కచ్చితంగా ఆ నగదు మొత్తం మస్క్ ఖాతాలో పడుతుంది. మార్కెట్లో ఉన్న ఒత్తిడి.. అంతర్జాతీయ పరిస్థితుల వల్ల గత ఏడాది టెస్లా మార్కెట్ విలువ అంతగా పెరగలేదు. అంచనా వేసుకున్న లక్ష్యాలను సైతం టెస్లా రీచ్ కాలేదు. దీంతో మస్క్ కు ఒక్క డాలర్ కూడా రాలేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper