Homeఅంతర్జాతీయంoppo color OS 17 launch date: యూజర్ల కోసం కొత్తగా కలర్ ఓఎస్ 17.....

oppo color OS 17 launch date: యూజర్ల కోసం కొత్తగా కలర్ ఓఎస్ 17.. పనితీరు.. అప్డేట్స్ ఎలా ఉంటాయంటే..

oppo color OS 17 launch date: స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు కీలకమైన అప్డేట్ అందుబాటులోకి వచ్చింది. ఒప్పో కంపెనీ తన కొత్త ఆపరేటింగ్ సిస్టం color OS 17 ను భారత్ లో Find X10 సిరీస్ ద్వారా పరిచయం చేసేందుకు సిద్ధమైంది. మరోవైపు వన్ ప్లస్ 13, వన్ ప్లస్ 15 సీరీస్ కు చెందిన ఎంపిక చేసిన స్మార్ట్ ఫోన్ లలో కూడా colour OS 17 బీటా ప్రోగ్రాం మొదలైంది. దీంతో కొత్త […]

oppo color OS 17 launch date: స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు కీలకమైన అప్డేట్ అందుబాటులోకి వచ్చింది. ఒప్పో కంపెనీ తన కొత్త ఆపరేటింగ్ సిస్టం color OS 17 ను భారత్ లో Find X10 సిరీస్ ద్వారా పరిచయం చేసేందుకు సిద్ధమైంది. మరోవైపు వన్ ప్లస్ 13, వన్ ప్లస్ 15 సీరీస్ కు చెందిన ఎంపిక చేసిన స్మార్ట్ ఫోన్ లలో కూడా colour OS 17 బీటా ప్రోగ్రాం మొదలైంది. దీంతో కొత్త సాఫ్ట్వేర్ ఫీచర్లను ముందుగానే పరీక్షించే అవకాశం యూజర్లకు దక్కుతుంది.

అక్టోబర్ 13న లాంచ్

ఒప్పో తన కొత్త సాఫ్ట్వేర్ కలర్ ఓఎస్ 17 ను అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురాబోతోంది ఇది ఆండ్రాయిడ్ 17 ఆధారంగా రూపొందింది. కొత్త డిజైన్.. మెరుగైన యానిమేషన్లు.. వేగవంతమైన స్క్రీన్ ట్రాన్సిషన్.. ఏఐ ఆధారిత ఫీచర్లపై కంపెనీ ప్రముఖంగా దృస్తారించినట్టు తెలుస్తోంది.

మనదేశంలో colour OS 17 తొలిసారిగా అందుబాటులోకి రాబోతున్న స్మార్ట్ ఫోన్ లైన్ ఆఫ్ గా oppo find X10 సిరీస్ నిలవబోతోంది. ఈ సిరీస్లో find X10, find X10 pro max మోడల్స్ ఉంటాయని తెలుస్తోంది. మన దేశ మార్కెట్లో ఈ ఫోన్లో విక్రయాల ప్రారంభం.. ధర.. ఇతర వివరాలపై అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది.

కొత్త డిజైన్లు

Colour OS 17 లో living flow design పేరుతో కొత్త డిజైన్ విధానాన్ని తీసుకొస్తున్నారు. ఫోన్లో వివిధ స్క్రీన్ల మధ్య మారుతున్నప్పుడు, యాప్స్ తెరిచేటప్పుడు, నోటిఫికేషన్లు పరిశీలిస్తున్నప్పుడు యానిమేషన్లు మరింత స్మూత్ గా ఉండే విధంగా మార్చారు.

Luminous effect ద్వారా స్క్రీన్ మీద కొన్ని కంట్రోల్స్ టచ్ చేసినప్పుడు కాంతి ప్రభావాలను చూపిస్తారు. ముఖ్యంగా క్విక్ సెట్టింగ్స్ లోని టేబుల్స్ ఉపయోగించినప్పుడు కొత్త విజువల్ ఎఫెక్ట్లు కనిపిస్తాయి

AI suggest ఫీచర్ ను కూడా మెరుగు చేస్తున్నారు. యూజర్ల అవసరాల తగ్గట్టుగా విడ్జెట్ లను సూచించడం. రోజువారి వినియోగాన్ని సులభతరం చేయడం దీని లక్షణంగా ఉన్నట్టు తెలుస్తోంది.. Laminar flow engine ద్వారా ఫోన్ వేగం.. పనితీరు.. యానిమేషన్ల సాఫీదనాన్ని మెరుగుపరిచే దానిపైన దృష్టిపెట్టారు.

వన్ ప్లస్ 13, 15 సిరీస్ కు ఓపెన్ బీటా

మరోవైపు వన్ ప్లస్ వినియోగదారులకు కూడా కొత్త సాఫ్ట్వేర్ను పరీక్షించే అవకాశం లభిస్తుంది. మనదేశంలో వన్ ప్లస్ 15, 15 ఆర్ 13 , 13ఎస్, 13 ఆర్ మోడల్ లకు కలర్ ఓఎస్ 17 ఓపెన్ బీటా ప్రోగ్రాం అందుబాటులోకి వచ్చింది.

వన్ ప్లస్ 15 యూజర్ల కోసం అక్టోబర్ 9 నుంచి 12 వరకు దరఖాస్తు గడువు ప్రకటించినట్టు తెలుస్తోంది. ఇతర మోడల్స్ కు సంబంధించిన అర్హతలు.. సాఫ్ట్వేర్ వెర్షన్లు.. అప్లికేషన్ నిబంధనలు ఆయా ఫోన్ల అధికారిక కమ్యూనిటీ ప్రకటనలలో గమనించడం మంచిది.

ఓపెన్ బీటా వెర్షన్ లో కొత్త ఫీచర్లు ముందుగానే అందుబాటులోకి వచ్చినప్పటికీ.. కొన్ని లోపాలు ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. యాప్స్ సరిగా పనిచేయకపోవడం.. బ్యాటరీ వినియోగంలో మార్పులు రావడం.. సిస్టం స్థిరత్వంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

రోజువారి అవకాశాలకు ఉపయోగించే ప్రధాన ఫోన్లో బీటా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసే ముందు ముఖ్యమైన డాటాను బ్యాకప్ చేసుకోవాలి. ఫోన్లో తగినంత బ్యాటరీ లేదా స్టోరేజ్ ఉన్నాయో చూసుకోవాలి. సమస్యలు ఎదురైతే స్థిరమైన సాఫ్ట్వేర్ కు మారాల్సి రావచ్చు.

మొత్తంగా చూస్తే కలర్ ఓఎస్ 17 ద్వారా ఒప్పో, వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్లలో కొత్త డిజైన్తో పాటు ఏఐ ఆధారిత ఫీచర్లు.. మెరుగైన పనితీరు.. అందించడమే లక్ష్యంగా కనిపిస్తోంది. తుది ఫీచర్లు.. స్థిరమైన అప్డేట్ విడుదల తేదీలు.. ప్రతి మోడల్ కు వర్తించే నిబంధనలపై కంపెనీల అధికారిక ప్రకటనలను చూడడం ఉత్తమం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper