Motorola Razr Phones: Motorola మొబైల్స్ అంటే ఇష్టపడేవారు చాలామంది ఉన్నారు. ఈ కంపెనీ నుంచి కొత్త మొబైల్ మార్కెట్ లోకి వస్తే వెంటనే కొనాలని చూస్తుంటారు. ఇలాంటి వారికి కంపెనీ ఎప్పటికప్పుడు ఫోన్ ను అభివృద్ధి చేస్తూ మార్కెట్లోకి తీసుకువస్తుంది. ఇందులో భాగంగా మోటరోలా Razr మొబైల్స్ అందరిని ఆకర్షిస్తున్నాయి. ఈ సిరీస్లో ఇప్పటివరకు మూడు ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి వేటికవే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. యూత్ తో పాటు రోజువారి వినియోగదారుల కోసం ఈ ఫోన్లో ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉందని కొందరు నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇవి Folding ఫోన్లు కావడంతో వీటిపై ఆసక్తి పెరిగింది. యితే వీటిల్లో ఉండే స్పెషల్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
Motorola 70 మొబైల్ మార్కెట్లో ఆకట్టుకునే ఫీచర్లతో అందుబాటులో ఉంది. ఈ మొబైల్ ఫుల్ డిస్ప్లే 6.90 AMOLED తో కలిగి ఉంటుంది. అయితే దీనిని ఫోల్డింగ్ చేస్తే 3.63 అంగుళాల వరకు స్క్రీన్ ఉండనుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేసే ఇందులో మీడియా టెక్ డైమెన్సిటీ 7450 ప్రాసెసర్ ఉండనుంది. అలాగే ఈ ఫోన్ 8gb రామ్ సపోర్ట్ చేయనుంది. 128 జీబీ నుంచి 256 జీబీ వరకు స్టోరేజ్ కోసం ఉపయోగించుకోవచ్చు. 4800 mAh బ్యాటరీ ఉన్న ఈ మొబైల్ 30 వాట్ వైర్డ్ చార్జింగ్ సపోర్ట్ తో పనిచేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో నాలుగు రంగుల్లో అందుబాటులో ఉన్న ఈ మొబైల్ ధర రూ. 64, 999 నుంచి విక్రయిస్తున్నారు.
ఇదే సిరీస్లో Razr 70 ఆల్ట్రా మొబైల్ కూడా అందుబాటులో ఉంది. ఇది ఫ్లాగ్ ఫిష్ మొబైల్ కావడంతో యూత్ ఎక్కువగా దీని కోసం ఆలోచిస్తున్నారు. ఇందులో 6.96 అంగుళాల AMOLED డిస్ప్లే ఉండనుంది. అలాగే Qualcomm స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉండగానే ఉంది. 12 జీబీ లేదా 16gb రామ్ సపోర్ట్ చేసే ఇందులో 256 జిబి నుంచి 512 జిబి వరకు సపోర్ట్ చేసే స్టోరేజ్ ఉండరు ఉంది. ఈ మొబైల్ Razr 60 అల్ట్రా మాదిరిగానే ఉండరు ఉంది. ఇందులో 5000 mAh బ్యాటరీ ఉండనుంది. ఈ బ్యాటరీ 30 W ఫాస్టెస్ట్ చార్జింగ్తో సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ లో 50 ఎంపీ మెయిన్ కెమెరా ఉండనుంది. దీనిని రూ. 84,999 ధరతో విక్రయిస్తున్నారు.
Motorola 70 ప్లస్ మొబైల్ కూడా వినియోగదారులు ఆకర్షిస్తుంది. ఈ మొబైల్ లో 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండనుంది.32 ఎంపీ ఫ్రంట్ కెమెరా తో పాటు వీడియో కాలింగ్ కోసం కూడా పనిచేస్తుంది. అలాగే ఇందులో 6.9 అంగుళాల AMOLED డిస్ప్లే ఉండనుంది. 4500 mAh బ్యాటరీ తో పని చేసే ఈ బ్యాటరీకి 45 W ఫాస్టెస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేయనుంది.