Simple energy scooters: ఎలక్ట్రిక్ వెహికల్స్ సెగ్మెంట్లో స్కూటర్లకు డిమాండ్ పెరిగిపోతోంది. పెద్ద పెద్ద కంపెనీలు స్కూటర్లను తయారు చేస్తున్న నేపథ్యంలో చాలామంది కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇంధనం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది ఎలక్ట్రానిక్ వెహికల్స్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఎలక్ట్రానిక్ వెహికల్స్ తయారీలో ముందు వరుసలో ఉన్న సంస్థ సింపుల్ ఎనర్జీ. ఈ సంస్థ కొత్త మోడల్ స్కూటర్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ముఖ్యంగా కుటుంబ అవసరాలను.. బడ్జెట్.. ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. సింపుల్ ఎనర్జీ కంపెనీ తీసుకొచ్చిన ఈ కొత్త మోడల్స్ ను ఒకసారి పరిశీలిస్తే..
సింపుల్ వేవ్
సింపుల్ ఎనర్జీ కంపెనీ నుంచి వచ్చిన మొట్టమొదటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. దీనిని రోజు వారి అవసరాలకు తగ్గట్టుగా వాడుకోవచ్చు. దీని ప్రారంభ ధర 1,09,999.. ఇందులో టాప్ రేంజ్.. అత్యధిక వేరియంట్ లో సింగిల్ ఛార్జ్ మీద ఏకంగా 243 కిలోమీటర్లు రేంజ్ లభిస్తుంది. ఇందులో బ్యాటరీ ఆప్షన్లు 2.2 kwh నుంచి ఫైవ్ కే డబ్ల్యూహెచ్ వరకు నాలుగు రకాల బ్యాటరీ ఆప్షన్లతో.. 6 వేరియంట్లలో లభిస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లు. ఇందులో భారీగా 70 లీటర్ల స్టోరేజ్ స్పేస్ (అండర్ సీట్.. సైడ్ పిల్ కంపార్ట్మెంట్) ఇచ్చారు. రైడర్ల కోసం ఇందులో పొడవైన ప్లాట్ సీట్.. ట్వీన్ షాక్ అబ్జర్వర్స్ ఇందులో ఉన్నాయి.
సింపుల్ ఆల్ట్రా
ఎక్కువ దూర ప్రయాణించే వాళ్లకు ఈ కంపెనీ తీసుకొచ్చిన హై పెర్ఫార్మన్స్ స్కూటర్ ఇది. దీని ప్రారంభ ధర 2,34,999. సింగిల్ చార్జ్ ద్వారా ఇది 400 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. ఇందులో బ్యాటరీ 6.5 కే డబ్ల్యూహెచ్ సామర్థ్యంతో ఉంటుంది. టాప్ స్పీడ్ గంటకు 115 కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్తుంది. కేవలం 2.77 సెకండ్లలోనే 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
సింపుల్ వన్ ఎస్ & సింపుల్ వన్
పట్టణ ప్రాంతాలలో తిరిగి ఎందుకు అత్యంత అనుకూలంగా ఉండే వేరియంట్లు ఇవి.. సింపుల్ వన్ ఎస్ ప్రారంభ ధర 1,71,999.. ఇది 19 0 కిలోమీటర్ల రేంజ్ లభిస్తుంది. గంటకు 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్ లభిస్తుంది.
సింపుల్ వన్ ప్రారంభ ధర 1,94,999. ఇది 265 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. గంటకు 115 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో వస్తుంది..
ఈవీ స్కూటర్ల మార్కెట్ లో సింహభాగం స్థానం అందుకోవాలని కంపెనీ ఈ మోడల్స్ అందుబాటులో తీసుకొచ్చింది. ముఖ్యంగా కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని ఈ మోడల్స్ రూపొందించింది. ఇవి స్కూటర్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. వీటిని మార్కెట్లోకి తీసుకొచ్చి సింపుల్ ఎనర్జీ సంచలనం సృష్టించింది.