Packaged Food Labels: ఒకప్పుడు పిల్లలకు ఇంట్లో వండిన ఆహారం తప్ప ఎక్కడా ప్రత్యేకంగా దొరికేది కాదు. కొన్ని కిరాణం షాపుల్లో నిమ్మరసం చాక్లెట్లు.. పార్లేజీ బిస్కెట్లు.. మరికొన్ని ప్రాంతాల్లో రసగుల్లాలు వంటివి లభించేవి. అయితే ఇవి పిల్లలను ఆకర్షించడంతోపాటు ఆరోగ్యాన్ని కూడా ఉంచేవి. కానీ ఇప్పుడు ప్రతి కిరాణంలో నిండుగా ప్యాకేజ్ ఫుడ్ కనిపిస్తున్నాయి. ఇవి పిల్లలను అయితే ఆకర్షిస్తున్నాయి కానీ.. అందులో స్పష్టమైన పోషకాహారాలు లేకపోవడమే కాకుండా ఆరోగ్యాన్ని పాడు చేసే విధంగా ఉన్నాయని కొందరు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ తాత్కాలికంగా పిల్లలను ఆనందంగా ఉంచేందుకు తల్లిదండ్రులు సైతం వీటిని ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ ఇటీవల ప్యాకేజీడు ఫుడ్ పై సుప్రీంకోర్టు హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి వాటిపై కొన్ని రకాల లేబుల్స్ ఉంచాలని పేర్కొంది. అసలు ఈ లేబుల్స్ ఎలా ఉంటాయి. ముఖ్యంగా రెడ్ లేబుల్ ఉన్న ప్యాకేజ్డ్ తింటే ఏమవుతుంది?
ప్రపంచంలోని చాలా దేశాల్లో ప్యాకేజ్డ్ ఫుడ్ పై రకరకాల లేబుల్స్ అంటించి ఉంటాయి. వీటిని గుర్తించి కావాల్సిన వాటిని తీసుకుంటూ ఉంటారు. అయితే మన దేశంలో కూడా ఇలాంటి స్పష్టమైన లేబుల్స్ ఉండాలని.. కోడింగ్ విధానాలు రావాలని ఆహార భద్రత నియంత్రణ సంస్థ గతంలోనే హెచ్చరించింది. అయితే తాజాగా ప్రజారోగ్య కార్యకర్తలు దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా లేబుల్ అంశాన్ని పరిశీలించాలని నియంత్రణ సంస్థలను ఆదేశించింది.
అయితే చాలామంది ఇంట్లో వండిన ఆహారం కంటే బయట దొరికే ప్యాకేజ్డ్ ఫుడ్ పైన ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. వీటిని కొనేటప్పుడు కేవలం రుచిని గురించి తెలుసుకుంటున్నారే తప్ప.. ఇందులో ఎలాంటి విధానాలు పాటించారని గ్రహించడం లేదు. దీనిపై ఉన్న కొన్ని గుర్తుల ప్రకారం ఇది ఏ రకమైనదో తెలుసుకోవచ్చు. అలాంటి గుర్తులు 5 ఉంటాయి. వాటిలో
రెడ్:
ఒక ప్యాకేజ్ ఫుడ్ పై రెడ్ కలర్ లేబుల్ ఉంటే దీనిని మాంసాహార ఉత్పత్తులతో తయారు చేశారని అర్థం. శాఖాహారులు అయితే దీనిని తీసుకోకపోవడమే మంచిది.
బ్లాక్:
ఈ రకమైన లేబుల్ ఉంటే ఇందులో పెద్ద మొత్తంలో కెమికల్స్ కలిసి ఉన్నాయని అర్థం అయితే వీటిని రుచిని పెంచడానికి కలిపారని ఆయా సంస్థలు తెలుపుతాయి. వీటిని పెద్ద మొత్తంలో తీసుకుంటే ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అందువల్ల ఇలాంటి వాటిని కొనేటప్పుడు ఆలోచించాలి.
ఎల్లో:
ఇలాంటి లేబుల్ ఉన్న ఆహారం కోడిగుడ్డుతో తయారు చేసిందని అర్థం. ఎవరైనా ఈ పదార్థం నచ్చని వారు తీసుకోకపోవడం మంచిది.
బ్లూ:
నీలం రంగు ఉన్న లేబుల్ ఆహారం నేరుగా కాకుండా వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు
గ్రీన్:
ఇలాంటి లేబుల్ ఉన్న ఆహారం పూర్తిగా శాఖాహారమని.. ఇది స్వచ్ఛంగా ఉంటుందని అర్థం. ఇందులో ఎలాంటి మాంసాహార పదార్థాలు లేకుండా తయారు చేశారని అర్థం.
ఈ విధంగా ప్యాకేజీలపై ప్రత్యేకంగా లేబుల్స్ అంటించాలని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టు దీనిపై ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో ఆహార నియంత్రణ సంస్థ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.