Homeబిజినెస్Personal Finance Tips : ఇలా చేస్తే ఈఎంఐ చిక్కుల్లో పడిపోతారు.. జాగ్రత్త..

Personal Finance Tips : ఇలా చేస్తే ఈఎంఐ చిక్కుల్లో పడిపోతారు.. జాగ్రత్త..

Personal Finance Tips :  ఒకప్పుడు ఒక వస్తువును కొనుగోలు చేయాలంటే డబ్బులు జమ అయ్యేవరకు వెయిట్ చేసేవారు. ఆ తర్వాత ఆ వస్తువు అవసరమా? లేదా? అనేది అర్థమై చేసేవారు. కానీ ఇప్పుడు ఈఎంఐ అనే సౌకర్యం అందుబాటులోకి రావడంతో చాలామంది కొన్ని వస్తువులను ముందుగానే కొనుగోలు చేస్తూ దాని డబ్బులను నెలనెలా చెల్లిస్తున్నారు. ఈ నెల నెల చెల్లించడాన్ని ఈఎంఐ అని అంటారు. అయితే ప్రస్తుత కాలంలో చాలామంది ఈఎంఐ ద్వారా బ్యాంకు రుణాలు […]

Personal Finance Tips :  ఒకప్పుడు ఒక వస్తువును కొనుగోలు చేయాలంటే డబ్బులు జమ అయ్యేవరకు వెయిట్ చేసేవారు. ఆ తర్వాత ఆ వస్తువు అవసరమా? లేదా? అనేది అర్థమై చేసేవారు. కానీ ఇప్పుడు ఈఎంఐ అనే సౌకర్యం అందుబాటులోకి రావడంతో చాలామంది కొన్ని వస్తువులను ముందుగానే కొనుగోలు చేస్తూ దాని డబ్బులను నెలనెలా చెల్లిస్తున్నారు. ఈ నెల నెల చెల్లించడాన్ని ఈఎంఐ అని అంటారు. అయితే ప్రస్తుత కాలంలో చాలామంది ఈఎంఐ ద్వారా బ్యాంకు రుణాలు తీసుకోవడమే కాకుండా వస్తువులను కూడా కొనుగోలు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల నెలనెలా తక్కువ మొత్తంలో చెల్లించాలని అనిపించినా కూడా.. మొత్తంగా చూస్తే ఇది భారీగా నష్టమే అని అనిపిస్తుంది. అంతేకాకుండా ప్రస్తుత కాలంలో ఈ ఈఎంఐ ట్రాప్ లో పడి చాలామంది అవస్థలు పడుతున్నారు. అయితే భవిష్యత్తు తరాల వారికి ఇలాంటి అవస్థల పాలు కాకుండా ఉండాలంటే ఏం చేయాలో కొందరు సూచనలు చేస్తున్నారు.. అవేంటంటే?

ఒకప్పుడు ఏదైనా ఇల్లు కొనుగోలు చేయాలంటే కొన్ని రోజులపాటు డబ్బులు పొదుపు చేసేవారు. కానీ ఇప్పుడు ముందుగా లోన్ తీసుకొని ఇల్లు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇలా చెల్లించడం వల్ల జీవితంపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక ఉద్యోగికి తన జాబ్ ఎప్పటికీ ఉంటుందన్న ఆశ లేదు. ఇది ఉన్నంతవరకు ఎలాంటి సమస్య ఉండదు. కానీ ఒక్కసారి జరగరానిది జరిగితే మాత్రం ఆ కుటుంబం పై భారం పడే అవకాశం ఉంటుంది. అయితే కొందరు ఇల్లును మాత్రమే కాకుండా ఖరీదైన వస్తువులను ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. అలా చేసేవారు భవిష్యత్తులో వాటిని చెల్లించేటప్పుడు అధిక చెల్లింపులు చేసే అవకాశం ఉంటుంది.

ఉదాహరణకు నెలకు రూ. 50వేల జీతం ఉన్న వ్యక్తి ఒక బైకు రూమ్ 6000, ఫోన్ కు రూ 3000, పర్సనల్ లోన్ కు రూ. 8000, క్రెడిట్ కార్డు బకాయికి రూ 5000, ఇంటి అద్దె, కరెంటు బిల్లు, పిల్లల చదువు, ప్రయాణం వంటి ఖర్చులు కూడా ఉంటాయి. అయితే ఈఎంఐ ట్రాప్ లో పడిపోతే వీటి చెల్లింపులు కష్టతరం అవుతుంది. అంతేకాకుండా ఏదైనా ఒక నెలలో ఆదాయం తగ్గినా కూడా.. వీటి భారం తీవ్రంగా ఉంటుంది.

అందువల్ల ఈఎంఐ పై ఆధారపడకుండా డబ్బులు పొదుపు అయిన తర్వాతనే కొన్ని వస్తువులను కొనుగోలు చేసే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఖరీదైన వస్తువులను ఈఎంఐ ద్వారా కాకుండా నిలువ ఉండే డబ్బుతోనే కొనుగోలు చేయాలి. ఎందుకంటే ఇవి తాత్కాలిక ఆనందాన్ని మాత్రమే ఇస్తాయి. వీటినుంచి ఎలాంటి రాబడి ఉండదు. అలాగే ఇల్లు లేదా కారు కొనుగోలు చేసేటప్పుడు వీటికి సంబంధించిన 50% పేమెంట్ చేసిన తర్వాతనే కొనుగోలు చేయడం మంచిది అని కొందరు నిపుణులు సూచిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper