బిజినెస్Airtel: ఎయిర్ టెల్ కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. ప్రీపెయిడ్ రీఛార్జ్ ల పెంపు?

Airtel: ఎయిర్ టెల్ కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. ప్రీపెయిడ్ రీఛార్జ్ ల పెంపు?

Airtel: ప్రముఖ టెలీకాం కంపెనీలలో ఒకటైన ఎయిర్ టెల్ కస్టమర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది. ప్రీపెయిడ్ రీఛార్జ్ లను పెంచుతున్నట్టు ఎయిర్ టెల్ ప్రకటించింది. అపరిమిత ఉచిత వాయిస్ కాల్ ప్లాన్లపై 25 శాతం, ప్రవేశ టారిఫ్ వాయిస్ ప్లాన్లపై 20 శాతం పెంచుతున్నట్టు ఎయిర్ టెల్ ప్రకటించింది. నవంబర్ 26వ తేదీ నుంచి పెరిగిన ఛార్జీలు అమలులోకి రానున్నాయని సమాచారం అందుతోంది. ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయాన్ని 200 రూపాయల నుంచి 300 రూపాయలకు పెంచాలని ఎయిర్ టెల్ భావిస్తోంది.

Also Read: ఎయిర్ టెల్ వినియోగదారులకు షాక్.. మోత మోగించింది..చార్జీలు ఎంత పెరిగాయంటే?

Airtel
Airtel

ఈ విధంగా చేయడం ద్వారా సహేతుకమైన రాబడి వస్తుందని ఎయిర్ టెల్ చెబుతోంది. టారిఫ్ రేట్ల పెంపు వల్ల ఆరోగ్యకరమైన వ్యాపార నమూనాకు దారి తీస్తుందని ఎయిర్ టెల్ చెబుతోంది. ఆదాయం పెరిగితే స్పెక్ట్రంల కొనుగోలు, నెట్వర్క్ ల విషయంలో పెట్టుబడులు పెరుగుతాయని ఎయిర్ టెల్ పేర్కొంది. ఆదాయం పెరిగితే 5జీ అమలు కూడా సులభంగా జరుగుతుందని ఎయిర్ టెల్ వెల్లడించడం గమనార్హం.

ఈరీజన్స్ వల్లే టారిఫ్ ఛార్జీల విషయంలో మార్పులు చేశామని ఎయిర్ టెల్ తెలిపింది. భారత్ లో 5జీ అమలుకు కూడా ఇది దోహదం చేస్తుందని ఎయిర్ టెల్ వెల్లడించింది. ఈ పెంపు వల్ల 28 రోజుల కాలపరిమితితో ఉన్న 79 రూపాయల ప్లాన్ ధర 99 రూపాయలుగా మారింది. 149 రూపాయల ప్లాన్ 179 రూపాయలకు, 219 రూపాయల ప్లాన్ 265 రూపాయలకు, 249 రూపాయల ప్లాన్ 299 రూపాయలకు మారింది.

298 రూపాయల ప్లాన్ 359 రూపాయలకు, 399 రూపాయల ప్లాన్ 479 రూపాయలకు, 449 రూపాయల ప్లాన్ 549 రూపాయలకు మారినట్టు సమాచారం. 379 రూపాయల ప్లాన్ 455 రూపాయలకు, 598 రూపాయల ప్లాన్ 719 రూపాయలకు, 698 రూపాయల ప్లాన్ 839 రూపాయలకు మారిందని తెలుస్తోంది.

Also Read: ఫోన్ పట్టుకుంటే షాక్ యే ఇక.. ఎయిర్ టెల్ బాటలోనే వోడాఫోన్, ఐడియా రేట్లు భగ్గు

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Tata Avinya X

Tata Avinya X: ఈ టాటా కారు డిజైన్ గురించి తెలిస్తే క్యూ కట్టకుండా ఉండరు..

Tata Avinya X: భారత దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ తమ ప్రతిష్టాత్మక 'టాటా అవిన్యా ఎక్స్' ఈవీ కారును భారత రోడ్లపై రోడ్ టెస్టింగ్...
Honor X7e Plus 5G

Honor X7e Plus 5G: ఈ ఫోన్ ఎక్కువ సేపు చూసినా కళ్లకు అలసట కలగదు.. ఎందుకంటే..

Honor X7e Plus 5G: ఈ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Honor తన ప్రముఖ 'ఎక్స్ సిరీస్'లో భాగంగా 'హానర్ ఎక్స్7 ఈ ప్లస్ 5జీ’ని గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది....
Mahindra Vision T

Mahindra Vision T: మహీంద్రా మరో సంచలనం.. విజన్.T కి భారత్‌లో పేటెంట్.. ఇది ఎలా ఉండబోతుందంటే..

Mahindra Vision T: SUV కార్లను తీసుకురావడంలో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రత్యేకతను చాటుకుంటుంది. ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ కార్లతో అలరించిన ఈ కంపెనీ ఇప్పుడు ఎలక్ట్రిక్ విషయంలోనూ తనదే...
Jio

Jio: జియో వాడుతూ మనం కంపెనీకి ఎంత నెల ఇస్తున్నామో తెలుసా

Jio: రిలయన్స్‌ లిమిటెడ్‌ దేశంలో అతిపెద్ద ప్రైవేటు వ్యాపార సంస్థ. ఈ సంస్థ అధినేత అనిల్‌ అంబానీ ఆసియాలోనే అతిపెద్ద సంపన్నుడు. రిలయన్స్‌ సంస్థ ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ఉన్న త్రైమాసిక...
Oneplus 15 Oneplus 15R

OnePlus : స్మార్ట్ ఫోన్ మార్కెట్ నుంచి OnePlus ఎగ్జిట్.. మరి భారత్ లో..

OnePlus : ప్రముఖ మొబైల్ సంస్థ వన్ ప్లస్ (OnePlus) మార్కెట్ నుంచి తప్పుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వన్‌ప్లస్ మాతృ సంస్థ అయిన 'ఒప్పో' (Oppo) తన గ్లోబల్ బిజినెస్‌ను పునర్వ్యవస్థీకరించే ఆలోచనలో...
Oktelugu Epaper