Blink It : కొద్ది రోజుల క్రితం బ్లింకిట్, ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ కలిసి 10 నిమిషాల్లో సిమ్ కార్డ్‌ను ఇంటికి డెలివరీ చేస్తామంటూ సంచలన ప్రకటన చేశాయి. అయితే ఇప్పుడు ఈ సర్వీసు తాత్కాలికంగా నిలిచిపోయింది. టెలికాం డిపార్ట్‌మెంట్ (DoT) వ్యక్తం చేసిన అభ్యంతరాల కారణంగానే ఈ చర్యలను తీసుకున్నట్లు సమాచారం. ఈ సర్వీసులో అనుసరిస్తున్న కేవైసీ (Know Your Customer) ప్రక్రియపై DoT ప్రశ్నలను లేవనెత్తింది.
సిమ్ కార్డ్ డెలివరీ, కేవైసీ ప్రక్రియను ఎయిర్‌టెల్ ఏ విధంగా నిర్వహిస్తోందని DoT ప్రశ్నించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేవైసీ ప్రక్రియను కంప్లీటుగా నిర్వహించడం లేదని అది చాలా ముఖ్యమని స్పష్టం చేసింది. నివేదికల ప్రకారం.. టెలికాం డిపార్ట్‌మెంట్ సిమ్ డెలివరీపై పూర్తి నిషేధం విధించలేదు.. కానీ తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రస్తుతం మీరు బ్లింకిట్ యాప్‌లో ఎయిర్‌టెల్ సిమ్ కోసం సెర్చ్ చేస్తే.. అది కనిపించదు.. ఇప్పుడు బ్లింకిట్ నుంచి సిమ్‌ను కస్టమర్లు ఆర్డర్ చేయలేరు.
already here to pick you up @airtelIndia https://t.co/NyYrcRWfTr pic.twitter.com/9LmfvTBfun
— Blinkit (@letsblinkit) April 15, 2025
బ్లింకిట్-ఎయిర్‌టెల్ సిమ్ డెలివరీ ప్లాన్ ఏమిటి?
ఎయిర్‌టెల్ ఏప్రిల్ 15న బ్లింకిట్‌తో కలిసి ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, పూణే, జైపూర్, కోల్‌కతా వంటి 16 పెద్ద నగరాల్లో 10 నిమిషాల్లో సిమ్ కార్డ్‌ను డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది. వినియోగదారులు రూ.49 కన్వినెన్స్ ఫీజు చెల్లించి సిమ్‌ను ఇంటి వద్దే పొందవచ్చు. సిమ్ డెలివరీ తర్వాత ఆధార్ కార్డ్ ద్వారా కేవైసీ పూర్తి చేసి దాన్ని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కస్టమర్‌లు పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ లేదా నంబర్ పోర్టింగ్ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఈ ప్లాన్ నిలిచిపోయింది. మీరు ఇంటి వద్దే బ్లింకిట్ ద్వారా 10 నిమిషాల్లో సిమ్ కార్డ్ డెలివరీని పొందలేరు.
ఎయిర్‌టెల్, బ్లింకిట్ ప్రభుత్వం షరతులను అనుసరించి ఈ సర్వీసును మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తాయో చూడాలి. సరైన ప్రక్రియ నిర్ణయించే వరకు సిమ్ 10 నిమిషాల డెలివరీ కల కొంచెం వాయిదా పడినట్లే.ప్రభుత్వ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ కూడా ఇంటి వద్దకే సిమ్ డెలివరీ ఆప్షన్ కూడా అందించేందుకు సిద్ధంగా ఉంది.
Also Read : మనిషి జీవితమే ఒక బిజినెస్.. అంబులెన్స్ మాత్రం వ్యాపార వస్తువు ఎందుకు కాకూడదు?