Kodali Nani: ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల వ్యవహారం కొలిక్కి వచ్చింది. ఇన్నాళ్లు రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిన విషయంలో ప్రభుత్వం ఎట్టకేలకు దిగి వచ్చింది. ఇప్పటికే అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొద్ది రోజులుగా చేస్తున్న ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం బిల్లును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. ఈ మేరకు రాష్ర్ట పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పందించారు.

సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద నాని మాట్లాడుతూ మూడు రాజధానుల వ్యవహారంలో ఎదురైన సాంకేతిక ఇబ్బందుల దృష్ట్యా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇన్నాళ్లుగా చేస్తున్న పోరాటానికి తగిన ఫలితం దక్కినట్లయింది. బిల్లు రద్దయిందని తెలుసుకున్న మరుక్షణమే రైతులు హర్షం వ్యక్తం చేశారు.
Also Read: ఏపీకి 3 రాజధానుల రద్దు వెనుక జగన్ ప్లాన్ ఏంటి?
వైసీపీ ప్రభుత్వం అనవసరంగా మూడు రాజధానుల ప్రస్తావన తెచ్చి ప్రజలను తప్పు దారి పట్టించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయినా జగన్ మాత్రం మొండిగానే వ్యవహరించారు. దీంతో వ్యవహారం కాస్త వివాదాస్పదమైంది. అయినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. నిర్లక్ష్యంగానే వ్యవహరించింది. ఈ క్రమంలో రైతుల ఆందోళన రెట్టింపయింది.
Also Read: మోడీ బాటలో జగన్.. మూడు రాజధానులపై సంచలన నిర్ణయం.. కేసీఆరే కారణమా?
అయినా ప్రభుత్వంలో మార్పు కనిపించకపోవడంతో న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో మహాపాదయాత్ర చేసేందుకు సిద్ధమైంది. దీంతో 21 రోజులుగా పాదయాత్ర కొనసాగుతోంది. దీనిపై ప్రభుత్వం పునరాలోచించి మూడు రాజధానుల వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చించి బిల్లు రద్దుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేబినెట్ నిర్ణయాన్ని అసెంబ్లీలో ప్రకటించేందుకు సిద్ధమైంది. దీంతో మూడు రాజధానుల వ్యవహారంలో సమంజసమైన నిర్ణయం వెలువడిందని అందరిలో హర్షం వ్యక్తమవుతోంది.
Also Read: తగ్గేదేలే! జస్ట్ గ్యాప్ ఇచ్చాడంతే.. ఏపీ రాజధానిపై జగన్ సంచలనం