Airtel Offer : దేశ టెలికామ్ రంగంలో ఎయిర్టెల్, జియో మధ్య విపరీతమైన పోటీ ఉంది. వినియోగదారులను పెంచుకోవడానికి ఈ రెండు సంస్థలు బీభత్సమైన ఆఫర్లు ఇస్తున్నాయి. గతంలో చవకైన ప్లాన్లతో జియో దేశ టెలికాం రంగంలో సంచలనం సృష్టించింది. తద్వారా టెలికాం రంగంలో అతిపెద్ద కంపెనీగా అవతరించింది. జియో విస్ఫోటనం ముందు ఎయిర్టెల్ కొద్దిరోజులు వెనకడుగు వేసినప్పటికీ.. తన విస్తృతమైన నెట్వర్క్ ద్వారా యూజర్లను నిలుపుకుంది. ప్రస్తుతం జియో కంటే ఒక మెట్టు పైనే ఉంది ఎయిర్టెల్. అయితే జియో కంటే ముందుగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో సరికొత్త అడుగు వేస్తోంది ఎయిర్టెల్.
ఇప్పటికే స్పామ్ కాల్స్ విషయంలో ఎయిర్టెల్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఉపయోగిస్తున్నది. దీనిద్వారా మోసపూరితమైన కాల్స్ కు ముందుగానే చెక్ పెడుతోంది. తద్వారా యూసర్లు మోసపోకుండా చూస్తోంది. అంతేకాదు ఇప్పుడు ఎంత రీఛార్జ్ చేసుకున్నా సరే.. ఎయిర్టెల్ తన యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటిస్తోంది..పర్ ప్లెక్సిటీ అనే ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ యాప్ ను ఏడాది పాటు ఫ్రీగా ఉపయోగించే అవకాశాన్ని కల్పిస్తోంది. దీని సంవత్సర ప్యాకేజీ విలువ 17000. అయితే తన కస్టమర్ల కోసం ఎయిర్టెల్ దీనిని ఉచితంగా అందిస్తోంది.
కృత్రిమ మేథ ఆధారిత యాప్ ను భారత సంతతి చెందిన అరవింద్ శ్రీనివాస్ అనే వ్యక్తి సృష్టించాడు. ఇది కూడా ఏఐ తో నడుస్తుంది. ఈ టెక్నాలజీ సరికొత్త విషయాలను తెలియజేస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే గ్రోక్, జెమిని, మెటా మాదిరిగానే పనిచేస్తుంది. ఇప్పటికే ఈ యాప్ మనదేశంలో సంచలనాలను సృష్టిస్తోంది. అయితే జియోకు ఇటువంటి అవకాశం లేకపోవడంతో ఎయిర్టెల్ తన మార్కెట్ మరింత పెంచుకోవడానికి ఈ ఎత్తు వేసింది. అయితే ఇది విజయవంతమవుతుందని టెలికాం రంగ నిపుణులు చెబుతున్నారు. ” నేటి కాలంలో కృత్రిమ మేధ వాడకం పెరిగిపోయింది. ప్రతి చిన్న విషయాన్ని కూడా కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నారు. దీనిని ఉపయోగించి అనేక రకాలుగా సేవలు పొందుతున్నారు. ఎంతో విలువైన దీనిని ఎయిర్టెల్ తన యూజర్లకు ఉచితంగానే ఇస్తోంది. దీనివల్ల ఈ యాప్ ఉపయోగించేవారి సంఖ్య పెరిగిపోతుంది. తద్వారా ఎయిర్టెల్ కు కూడా బలమైన మార్కెట్ ఏర్పడుతుంది. అప్పుడు జీయో నష్టపోతుందని” టెలికాం రంగ నిపుణులు చెబుతున్నారు.