Wi-Fi: ప్రస్తుతం మన పనులన్నీ దాదాపు ఇంటర్నెట్ ద్వారానే జరుగుతున్నాయి. ఇంట్లో ఎక్కువ మంది యూజర్లు ఉండడం వల్ల లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా వైఫై తప్పనిసరి అయింది. అయితే, వైఫై బిల్లు, ఫోన్ రీఛార్జ్ ప్లాన్ వేర్వేరుగా తీసుకోవడం వల్ల కొంచెం ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. కానీ మీరు కోరుకుంటే రీఛార్జ్ ఖర్చులను తగ్గించుకోవచ్చు. అన్ లిమిటెడ్ కాలింగ్, ఉచిత ఎస్‌ఎంఎస్‌లు, డేటా కూడా లభించే చౌకైన ప్లాన్‌ను మీ ఫోనులో సెలక్ట్ చేసుకోవచ్చు. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలలో ఏది చౌకైన ప్లాన్‌ను అందిస్తుందో వివరంగా తెలుసుకుందాం.
Also Read: జాక్ పాట్ కొట్టేసిన వైభవ్ సూర్యవంశీ!
జియో 336 రోజుల ప్లాన్
జియో యూజర్ అయితే ఏడాది వ్యాలిడిటీ కలిగిన ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ 336 రోజుల వాలిడిటీతో వస్తుంది. దీని ద్వారా మీరు అన్ లిమిటెడ్ కాలింగ్‌ను ఆస్వాదించవచ్చు. ఎటువంటి అంతరాయం లేకుండా గంటల తరబడి మాట్లాడవచ్చు. ఈ ప్లాన్‌లో 3600 ఉచిత ఎస్‌ఎంఎస్‌లను కూడా పొందవచ్చు. అంతేకాకుండా, ఎంటర్ టైన్ మెంట్ కోసం జియో టీవీ, జియో ఏఐకి కూడా యాక్సెస్ లభిస్తుంది. ఇంట్లో వైఫై ఉన్న వారికి ఎక్కువ డేటా అవసరం లేకపోతే, ఇది చాలా మంచి ఆప్షన్.
బీఎస్‌ఎన్ఎల్ వార్షిక ప్లాన్:
బీఎస్‌ఎన్ఎల్ రూ.1199 ప్లాన్ అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్‌ను ఎంచుకుంటే ఏడాది పొడవునా రీఛార్జ్ చేయించే టెన్షన్ ఉండదు. ఈ ప్లాన్‌లో అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. అదనంగా, మొత్తం 24GB డేటా కూడా అందుబాటులో ఉంటుంది. తక్కువ ధరలో అనేక ప్రయోజనాలు అందించే ప్లాన్‌గా ఇది చాలా పాపులర్ పొందింది. మీ ఇంట్లో వైఫై ఉండి, తక్కువ డేటాతో అన్ లిమిటెడ్ కాలింగ్ ప్లాన్ కావాలనుకుంటే ఈ ప్లాన్ బెస్ట్.
వీఐ యూజర్లకు బెస్ట్ ప్లాన్
వొడాఫోన్ ఐడియా రూ. 1849 ప్లాన్ 365 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌లో అన్ లిమిటెడ్ కాలింగ్ లభిస్తుంది. అంతేకాదు, 3600 ఎస్‌ఎంఎస్‌లను కూడా ఉచితంగా పొందవచ్చు. అంటే, ఆఫ్‌లైన్ చాటింగ్ కోసం తగినంత ఫ్రీ ఎస్‌ఎంఎస్ లభిస్తాయి. ఇంటి బయట ఎక్కువ డేటా ఉపయోగించని వారికి ఈ ప్లాన్ చాలా బాగుంటుంది. ఇంట్లో వైఫై ఉన్నవారు కాలింగ్, ఎస్‌ఎంఎస్‌ల కోసం ఈ ప్లాన్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు.