YSRCP Social Media: మనం ఆలోచించే మనసు బట్టి ఉంటుంది. మనం చెడుగా ఆలోచిస్తే చెడుగా అర్థం అవుతుంది. మంచిగా ఆలోచిస్తే మంచిగా అర్థం అవుతుంది. అయితే ఈ విషయంలో మాత్రం వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ఇప్పటికీ గుణపాఠాలు నేర్చుకోలేదు. జగన్మోహన్ రెడ్డి సైతం ఆ సోషల్ మీడియా ప్రభావంతోను, ఐ ప్యాక్ బృందం వ్యూహాల మధ్య చిక్కుకొని ఉన్నారు. మొన్న ఆ మధ్యన వల్లభనేని వంశీ మోహన్ జైల్లో ఉన్నప్పుడు పరామర్శకు వెళ్లారు. ఆ సమయంలో ఓ చిన్నారి జగన్ మామయ్య అంటూ గుక్క తిప్పుకోకుండా ఏడ్చుకోవడం వంటి ఫోటోలు వైరల్ అయ్యాయి. కానీ ఆ మరుసటి రోజు ఆ చిన్నారి ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడింది. అదంతా వైసీపీ సోషల్ మీడియా సృష్టి అని కనిపించింది. అయితే ఆ పార్టీకి అనుకూలమైన విషయాలు ఎన్నైనా చేసుకోవచ్చు. కానీ రాజకీయ ప్రత్యర్థులను, అందులోనూ మహిళలను తక్కువ చేసి చూపించడం అనేది చాలా తప్పు. దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. సమాజంపై దుష్పరిణామాలు చూపుతాయి.
విద్యార్థులతో కలిసి భోజనం..
ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉండడంతో నిత్యం బిజీగా ఉంటారు. ఇప్పుడు ఆ నియోజకవర్గానికి తరచూ ఆయన భార్య భువనేశ్వరి వెళ్తున్నారు. అక్కడి ప్రజలతో మమేకం అవుతున్నారు. గత రెండు రోజులుగా భువనేశ్వరి కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో అక్కడ విద్యార్థులతో కలిసి భోజనాలు చేశారు. విద్యార్థులంతా బూట్లు వేసుకొని భోజనాలు చేస్తున్నారు. అయితే ఆమె వయసు రిత్యా అక్కడ అధికారులు చిన్నపాటి టేబుల్ వేశారు. ఆ టేబుల్ పై కూర్చుని భోజనం చేస్తున్న భువనేశ్వరి చెప్పులతో కనిపించారు. పద్ధతిగా ఉండదని భావించి తన చీర కొంగుతో వాటిని కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. అయితే దానిని అసభ్యంగా చూపిస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. అంతకంటే జుగుప్సాకరంగా ఏమైనా ఉంటుందా?
శబరిమలైలో జగన్ నినాదం..
కొద్దిరోజుల కిందట కేరళలో( Kerala ) శబరిమలైలో జై జగన్ అన్న నినాదాలు వినిపించాయి. కొందరు భక్తులు జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలతో అక్కడ కనిపించారు. ఒకవైపు తలపై ఇరుముడులు పట్టుకొని.. మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలతో కనిపించారు. అయ్యప్ప శరణు ఘోషతో శబరిమలై వెళుతుంటారు దీక్షాపరులు. అటువంటి చోట రాజకీయ భక్తితో రెచ్చిపోయారు వైసీపీ సానుభూతిపరులు. కానీ అది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకు కానీ.. మెయిన్ మీడియాకు కానీ వినిపించలేదు.. కనిపించలేదు. తప్పుగా అనిపించలేదు. ఇప్పుడు మాత్రం ఓ స్త్రీ మూర్తి అసభ్యత కనిపించకుండా తన చెప్పులను చూపించకుండా చేసే క్రమం మాత్రం తప్పుగా వారికి అర్థమవుతోంది. అటువంటి వారి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది.
పిల్లల అన్నం తినే ప్లేట్ పక్కనే మేడమ్ గారి పాదరక్షుకులు..
ఇబ్బంది పడ్డ విద్యార్థిని pic.twitter.com/fIg6WvPSW5
— UttarandhraNow (@UttarandhraNow) November 21, 2025