Dry Fruits: ప్రస్తుత కాలంలో ఆరోగ్యమే మహాభాగ్యం అని అనుకోవాల్సి వస్తుంది. ఒత్తిడితోపాటు అదనపు పని భారం పెరగడంతో శరీరానికి అదనపు శక్తి కావాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమయంలో డ్రై ఫ్రూట్స్ కు ఎక్కువగా ఆదరణ పొందుతోంది. సాధారణ ఫ్రూట్స్ కంటే వీటిలో అత్యధిక పోషకాలు ఉంటాయని కొందరు నిపుణులు తెలుపుతున్నారు. అయితే వీటిని సరైన మార్గంలో తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారని.. ఇష్టం వచ్చినట్లు తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇలాంటి అప్పుడు డ్రై ఫ్రూట్స్ ను ఏ విధంగా తీసుకోవాలి?
మార్కెట్లో లభించే డ్రై ఫ్రూట్స్ లో బాదం కచ్చితంగా ఉంటుంది. ఒక్కో బాదం గింజలో ప్రోటీన్ 6 గ్రాములు ఉంటుంది. పీచు పదార్థం నాలుగు గ్రాముల వరకు ఉంటుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు 14 గ్రాములు ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అయితే బాదంను పెద్దలు ప్రతిరోజూ ఐదు గింజలు మాత్రమే తీసుకోవాలి. పిల్లలు మూడు గింజలు తీసుకుంటే సరిపోతుంది. వీటిని నేరుగా కాకుండా రాత్రంతా నానబెట్టి ఉదయం పొట్టు తీసి తినడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరగకుండా ఉంటుంది.
బాదం కొనేవారు జీడిపప్పును కచ్చితంగా కొనుగోలు చేస్తారు. ఇందులో ప్రోటీన్ ఐదు గ్రాములు, కొవ్వులు 14 గ్రాములు, పీచు పదార్థం ఒక గ్రామం ఉంటుంది. ఎముకల ఆరోగ్యానికి, నాడీ వ్యవస్థ మెరుగుపరడానికి జీడిపప్పు ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే జీడిపప్పును క్రమ పద్ధతిలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీటిని నేరుగా తీసుకోవచ్చు. పిల్లలు మూడు గింజలు, పెద్దలు 5 గింజల వరకు తినవచ్చు. కానీ కొందరు దీనిని రోస్ట్ చేసి తింటారు. అలా చేయడం ఆరోగ్యకరం కాదు.
శరీరంలో అధిక ఉష్ణోగ్రత తగ్గాలంటే సబ్జా గింజలకు ప్రిఫరెన్స్ ఇస్తారు. వీటిలో ప్రోటీన్ ప్రోటీన్ 14.8 గ్రాములు ఉంటుంది. కార్బోహైడ్రేట్లు 63.8 గ్రాములు ఉంటుంది. అలాగే ఇనుము, మెగ్నీషియం ఇందులో లభిస్తుంది. ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలని అనుకునే వారికి ఇవి ప్రయోజనకరంగా ఉంటాయి. సజ్జలను నేరుగా కాకుండా నానబెట్టి ఇతర పానీయాలతో కలిపి తీసుకోవచ్చు. ఇలా కలిపిన మిశ్రమాన్ని పెద్దలు ఒక స్పూన్ తీసుకోవాలి.
వాల్ నట్స్ వంటి డ్రైఫ్రూట్స్ కు కూడా ఇటీవల ప్రాధాన్యత పెరుగుతుంది. వీటిలో 4.3 గ్రాముల ప్రోటీన్, 18.5 గ్రాముల కొవ్వు, 1.9 గ్రాముల పీచు పదార్థం ఉంటుంది. మెదడు పనితీరును మెరుగుపరిచేందుకు వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. వాల్నట్స్ను పిల్లలకు ప్రతిరోజు ఒక గింజ ఇస్తూ ఉండాలి. పెద్దలు రెండు గింజలు తినవచ్చు. వీటిని నేరుగా పరిగడుపున తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది.
ఇటీవల కాలంలో అవిస గింజలు ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వీటిలో 18 గ్రాముల ప్రోటీన్లు, 27 గ్రాముల పీచు పదార్థం, 42 గ్రాముల కొవ్వులు ఉంటాయి. వీటిని పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకపోవడమే మంచిది. పెద్దలు మాత్రం పెరుగు లేదా ఓట్స్ తో కలిపి ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల తక్కువ తిని ఎక్కువగా నీరు తీసుకునే ప్రయత్నం చేయాలి.