Targeting Signs: సమాజంలో ఎన్నో రకాల మనుషులు ఉంటారు. అందరూ మనకు నచ్చిన విధంగా ఉండాలని అనుకోవడానికి వీల్లేదు. కొన్ని పరిస్థితులు లేదా వారి వాతావరణాన్ని బట్టి మనుషుల్లో మంచితనం, చెడు గుణం అనేవి ఉంటాయి. మన చుట్టుపక్కన ఉండేవారు మంచివారై ఉండాలని కోరుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో వారు పైకి మంచిగానే కనిపిస్తూ మనల్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. మన ఎదుగుదల లేదా సమాజంలో గుర్తింపు నచ్చక కొందరు మనపై చెడు ప్రచారం చేస్తారు. అయితే మనల్ని ఒకరు టార్గెట్ చేస్తున్నారని మనం ఎలా తెలుసుకోవాలి? మనల్ని టార్గెట్ చేసినప్పుడు మనలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి?
కొందరు మానసిక నిపుణులు తెలుపుతున్న ప్రకారం ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మూడు రకాల విషయాలను మనం అర్థం చేసుకోవాలి. అందులో మొదటిది reputation attack.
Reputation attack అంటే ఒకరి గురించి తప్పుగా ప్రచారం చేయడం. ఒక వ్యక్తికి సమాజంలో మంచి గుర్తింపు ఉంది. అలాగే అతడు విజయవంతమైన పనులు నిర్వహిస్తున్నాడు. ఇలాంటి వారికి సహజంగానే శత్రువులు ఉంటారు. కానీ ఈ వ్యక్తికి పక్కన ఉండే వారు నేరుగా దెబ్బ కొట్టకుండా.. ఆ వ్యక్తి గురించి తప్పుగా ప్రచారం చేస్తుంటారు. అంటే వారి మైనస్లను గుర్తించి వాటిని పెద్దవిగా చేస్తూ వ్యక్తిగత విషయాలను వక్రీకరించి ఇతరులకు చెబుతుంటారు. ఇవి ఎక్కువగా ఉద్యోగ ప్రదేశాల్లో కల్పించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉన్నతాధికారుల నుంచి వచ్చే ప్రశంసలు లేదా క్రెడిట్ వారికి దక్కకుండా ముందుగానే వారి గురించి చెడుగా ప్రచారం చేయడం. ఈ పరిస్థితి ఎదురైనప్పుడు వెంటనే అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది.
Isolation attack:
మంచివారికి సమాజంలో ఎంతోమంది స్నేహితులు, బంధువులు ఉంటారని అంటారు. కానీ ఆ మంచి వారిని దెబ్బ కొట్టడానికి వారికి సన్నిహితంగా ఉండేవారిని దూరంగా చేయడాన్ని ఐసోలేషన్ అటాక్ అని అంటారు. ఉదాహరణకు ఒక వ్యక్తి నచ్చనప్పుడు ఆ వ్యక్తికి సంబంధించిన స్నేహితులు లేదా బంధువులకు అబద్ధపు మాటలతో అతనిపై ద్వేషం కలిగేలా చేయడం. ముఖ్యంగా ఉద్యోగ ప్రదేశాల్లో ఒక వ్యక్తి సమావేశాలకు రాకుండా చేయడం.. అతనికి ముఖ్యమైన సమాచారం ఇవ్వకపోవడం లేదా సహచరులతో మాట్లాడకుండా చేయడం వంటివి దీనికి వస్తుంది.
Self doubt attack:
కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి చెప్పే నిజాన్ని తిరస్కరించడం.. లేదా ఆ వ్యక్తి చెప్పే విషయాన్ని అబద్ధమని ప్రచారం చేయడం ఐసోలేట్ చేయడం అని అంటారు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక విషయాన్ని చెప్తే అతనికి ఏమీ తెలియదు.. అతను తెలివి లేని వాడు.. అని చెప్పడం జరుగుతుంది. ఇలా పదా పెదవి చేయడం వల్ల ఆ వ్యక్తి తనపై తనకే నమ్మకం కోల్పోయేలా జరుగుతుంది.
అయితే ఈ మూడు పరిస్థితులు ఎదురైనప్పుడు ముందుగానే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ఎలాంటి దాడి జరిగినా ముందుగా ప్రశాంతంగా ఆలోచించి.. ఆ వ్యక్తులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఉద్యోగ ప్రదేశంలో వేధింపులు లేదా తప్పుడు ఆరోపణలు కొనసాగితే సరైన ఆధారాలను భద్రపరుచుకోవాలి. సమయం వచ్చినప్పుడు అసలు నిజాలను బయటపెట్టి తప్పుడు ప్రచారం చేసే వ్యక్తి గురించి తెలపాలి.