India vs Pakistan: ఢిల్లీ పేలుడు ఘటన తర్వాత భారత్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఉగ్ర కుట్ర, మూలాలు, దాని వెనుక ఉన్న దేశాల గుట్టు బయటకు తీస్తోంది. ఇప్పటికే అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ నింద తమపై రాకుండా ఓ బాంబు పేల్చుకుంది. కానీ, పాకిస్తాన్‌కు భయం పోవడం లేదు. ఈ క్రమంలో దొంగే దొంగ అన్న చందంగా భారత్‌ను బద్నాం చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ క్రమంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ భారతదేశంపై దాడికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇటీవల ఢిల్లీ బాంబు పేలుడు ఘటన తర్వాత భారతదేశం తమపై దాడి చేయబోతుందని, అలాగే ‘ఆపరేషన్ త్రిశూల్‘ తర్వాత యుద్ధ పరంగా స్పష్టత ఉండి ఇప్పటికీ భారత సైద్ధాంతిక సన్నద్ధత ఉందని చెప్పారు. ఈ స్టేట్‌మెంట్ వెనుక కారణం పాకిస్తాన్ తమ పరిరక్షణ కోసం ముందుగానే సిద్ధమవుతూ, భారత్‌పై దాడి చేయడానికి ప్రపంచానికి ముందే మద్దతు పొందేందుకు వ్యూహాత్మకంగా ఉద్దేశించడమేనని విశ్లేషిస్తున్నారు.
ఎదురు దాడికి యత్నం..
పాకిస్తాన్ భారత్‌పై తాను యుద్ధం చేయనున్నట్టే ప్రత్యక్షంగా చెప్పకుండా, భారత్ ముందుగా దాడి చేయబోతోంది అని ప్రపంచాన్ని నమ్మించేందుకు డ్రామా మొదలు పెట్టింది. ఈ నేపధ్యంలో, భారతదేశం అప్రమత్తంగా ఉండి త్రివిధ దళాలను యుద్ధానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉంచాలి. పాకిస్తాన్ ఈ మాటలను ఉపయోగించి దాడికి సన్నద్ధం కావడంతో పాటు, వ్యూహాత్మకంగా మరింత కఠినంగా స్పందించి పాకిస్తాన్ కదలను తగ్గించేందుకు, మెరుగైన వ్యూహాలు వహించాల్సింది.
Also Red: ట్రంప్ మెదడు మోకాలిలోకి జారిందా.. ఆపరేషన్ సింధూర్ పై రహస్య నివేదిక
ఢిల్లీ ఘటన వెనుక పాకిస్తాన్..
ఇదిలా ఉంటే ఢిల్లీ పేలుడు ఘటన వెనుక పాకిస్తాన్ ఉన్నట్లు ఎన్‌ఐఏ నిర్ధారించింది. లష్కర్ ఏ తోయిబా చీఫ్ మసూద్ అజర్ సోదరి నడిపే సంస్థతో డాక్టర్ షాహిస్ సాయిద్‌కు సంబంధం ఉన్నట్లు గుర్తించారు. పాకిస్తాన్ ఆదేశాల మేరకే దేశంలో పేలుళ్లకు అల్‌ఫలా డాక్టర్లు కుట్ర చేశారని నిర్ధారణ అయింది. దీంతో భారత్ ఆపరేషన్ సిందూర్ 2.0 ప్రారంభిస్తుందని పాకిస్తాన్ అంచనా వేస్తోంది. ఈ క్రమంలోనే భారత్ దాడికన్నా ముందే దాడి చేయాలని సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
పాకిస్తాన్ హెచ్చరికల నేపథ్యంలో భారత త్రివిధ దళాలు కూడా అప్రమత్తం అవుతున్నాయి. ఏ క్షణంలో అయినా ఆపరేషన్ సిందూర్ 2.0 ప్రారంభించే అవకాశం ఉంది. అదే జరిగితే ఈసారి పాకిస్తాన్‌ను ప్రపంచ పటం నుంచి చెరిపేయడం కాయం అన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.