Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh: డేటా సెంటర్ మీద వైసిపి కేసులు.. నారా లోకేష్ చెప్పిన నీళ్ల లెక్కలు.....

Nara Lokesh: డేటా సెంటర్ మీద వైసిపి కేసులు.. నారా లోకేష్ చెప్పిన నీళ్ల లెక్కలు.. ఇప్పటికైనా జగన్ పార్టీ మూసుకుంటుందా..

Nara Lokesh: వినాశనం లేకుండా వికాసం సాధ్యం కాదు. కాకపోతే వినాశనం స్థాయి తక్కువగా ఉండాలి. వికాసం పరిధి ఎక్కువగా ఉండాలి అంటారు. కానీ.. తెలుగు రాష్ట్రాల్లో వికాసం జరుగుతుంటే కొంతమంది వ్యక్తులు జీర్ణించుకోవడం లేదు. ముఖ్యంగా కొన్ని పార్టీలు ప్రతీప శక్తుల మాదిరిగా వ్యవహరిస్తూ ఉన్నాయి. ఏపీ విషయంలో ఈ దారుణం మరింత ఎక్కువగా ఉంది. ఏపీ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వకపోయినప్పటికీ వైసీపీ విద్వేషపూరిత రాజకీయాలు చేస్తోంది. ముఖ్యంగా ఏపీ పురోగమనంలో ప్రతి సందర్భంలో అడ్డు తగులుతోంది.

వైజాగ్ నగరాన్ని గ్లోబల్ హబ్ గా మార్చేందుకు ఏపీ సర్కారు పని చేస్తోంది. ఇందులో భాగంగానే అనేక సంస్థలను వైజాగ్ లో ఇన్వెస్ట్ చేసేలా అనుకూల వాతావరణం కల్పిస్తోంది. ఇప్పటికే టిసిఎస్ లాంటి అగ్రశ్రేణి ఐటి కంపెనీలు విశాఖపట్నం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇక గూగుల్ కూడా డేటా సెంటర్ ను ఏర్పాటు చేసింది. ఈ డేటా సెంటర్ అమెరికా వెలుపల తర్వాత అంతటి స్థాయిలో గూగుల్ ఇక్కడ ఏర్పాటు చేయడం విశేషం. అయితే దీనిని వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది. మొదట్లో ఈ డేటా సెంటర్ ఘనత తనదేనని జగన్ చెప్పుకున్నారు. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని చెప్పారు.

కొద్దిరోజులకు వైసిపి గూగుల్ డాటా సెంటర్ మీద నెగిటివ్ స్టాండ్ తీసుకుంది. ఆ పార్టీ సంబంధించిన కొంతమంది నాయకులతో కేసులు వేయించింది. దీంతో డేటా సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు అవుతుందా.. ఈ విషయంలో న్యాయస్థానాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాయి అనే ప్రశ్నలు సగటు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో వ్యక్తమయ్యాయి. చివరికి వైసీపీ పాచికలు పారలేదు. ఫలితంగా గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది.

ప్రధానంగా గూగుల్ డేటా సెంటర్ మీద వైసిపి చేస్తున్న ఆరోపణ నీటి వినియోగం.. ఎక్కడ విదేశాలలో ఏదో జరిగితే.. ఇక్కడ కూడా అటువంటి సంఘటనలు జరుగుతాయని వైసీపీ మీడియా చెప్పడం గమనార్హం. అయితే దీనిపై నారా లోకేష్ ముంబై వేదికగా జరిగిన ఒక సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. “గోదావరికి ప్రతి ఏడాది వరదలు వస్తూ ఉంటాయి. ఈ క్రమంలో 3000 టీఎంసీల వరద నీరు వృధాగా సముద్రంలో కలుస్తూ ఉంటుంది. విశాఖపట్నంలో 6.5 గిగా వాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. దీని నిర్వహణకు శతకోటి ఘనపుటడుగుల(టీఎంసీ) నీరు సరిపోతుంది..ఒక గిగా వాట్ థర్మల్ ప్లాంట్ ఒక డేటా సెంటర్ కంటే ఏడు రెట్లు ఎక్కువగా నీటిని ఉపయోగించుకుంటుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఎవరో ఏదో ప్రచారం చేస్తున్నారని దానిని నమ్మొద్దు. అభివృద్ధిని సానుకూల కోణంలో చూడాలి. అభివృద్ధి జరిగితేనే ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్ర ఖజానాకు ఆదాయం వస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఏర్పడుతుందని” నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. దీంతో వైసిపి నోరు మూసుకుంది. ఇన్నాళ్లు చేసిన విష ప్రచారానికి ఇకనైనా అడ్డుకట్ట వేస్తుందో చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular